Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio Prepared by Mrs Archana
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము
ధనము – 1వ.భాగమ్
ఆంగ్లమూలం : లెఫ్టినెన్ట్ కల్నల్ ఎమ్.బి.నింబాల్కర్
తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు
సంసారులకు (లౌకిక జీవితం సాగించేవారికి) బాబా చెప్పిన సలహాలు
ఎవరయితే నీతి నిజాయితీగా ధనం సంపాదిస్తారో సంపాదించిన దానితో తృప్తిగా జీవించమని అటువంటి భక్తులకు మరీ మరీ చెప్పారు.
ఎవరూ కూడా హత్యలు చేసి, దోపిడీలు చేసి, లంచాలు మరిగి, అన్యాయమార్గంలో ధనం సంపాదించి దాని ద్వారా వచ్చే దుఃఖాన్ని ఆందోళనలని కొని తెచ్చుకోరాదు. ఈ విధంగా చేసిన పాపపు పనుల వల్ల ఆపాప ఫలితాలను ఈ జన్మలో కాకపోయినా మరుజన్మలోనయినా అనుభవించవలసి ఉంటుంది.
ఈ విషయంలో బాబా, నానాసాహెబ్ చందోర్కర్ కి ఉదాహరణగా ఒక చక్కటి సంఘటనని వివరించారు.
“ఒక గుమాస్తా తన యజమానిని చంపి, తానే యజమానిగా చలామణి అయ్యాడు. యజమాని అయిన తరువాత ఆగుమాస్తా విలాసవంతమైన జీవితాన్ని సుఖంగా అనుభవించసాగాడు.
గుఱ్ఱపు బళ్ళలో తిరుగుతూ తానెంతో సుఖంగా ఉన్నానని చెప్పసాగాడు. (13)
తన యజమానిని చంపి, అతను ఈ జన్మలో గాని, అంతకుముందు జన్మలలో గాని మంచిపనులు గాని, చెడుపనులు గాని చేసి ఉన్నా మరింత పాపాన్ని మూట కట్టుకొన్నాడు.
ఈజన్మలో అతను చేసే పనులకి అవి మంచయినా, చెడయినా గాని, వాటి వల్ల వచ్చేసుఖాలు గాని, బాధలు గాని వచ్చే జన్మలో అనుభవించవలసిందే. (14)
దాసగణు మహరాజ్ వారి భక్త లీలామృతం – అధ్యాయమ్ – 33
శ్రీసాయి సత్ చరిత్ర 46వ.అధ్యాయంలో సాయిబాబా రెండు మేకల యొక్క గత జన్మకు సంబంధించిన వృత్తాంతం చెప్పారు.
గత జన్మలో ఆ మేకలు రెండూ తమ క్రిందటి మానవ జన్మలో సోదరులు . ఒకరిపై ఒకరికి ప్రేమ ఉండేది. కాని ధన వ్యామోహంతో ఇద్దరూ శతృవులై ఒకరినొకరు చంపుకొన్నారు. ఈ జన్మలో మేకలుగా జన్మించారు.
అలాగే 47వ. అధ్యాయంలో పాము, కప్పల గత మూడు జన్మల వృత్తాంతాన్ని వివరించారు.
ఆవిధంగా ధనం మీద ఉన్న విపరీతమయిన వ్యామోహం మానవుని ఎంతగా అధోగతిపాలు చేస్తుందో సోదాహరణంగా వివరించారు. (15)
అందుచేత బాబావారు శతృత్వం అనేది ఎన్నటికీ మంచిది కాదని చెప్పారు. మనసు శతృత్వం వైపు మళ్ళకుండా దానిని స్వాధీనంలో ఉంచుకోవాలి. లేకపోతే అది జీవితాన్ని నాశనం చేస్తుంది. అధ్యాయం – 47
ఎవరికయినా న్యాయంగా చేసిన ప్రయత్నాల వల్ల గాని, అదృష్టం వల్ల గాని ధనం లభిస్తే దానిని తప్పక అనుభవించవలసినదే. కాని, ఆ ఆనందాన్ని లేనివారితోను, అవసరమయిన వారితోను కలిసి పంచుకోవాలి.
సాయిబాబా ఇచ్చిన సలహా అతిధులను గౌరవించమని. దాహార్తితో ఉన్నవారికి మంచినీరు, ఆకలిగొన్నవారికి ఆహారం, నీడ లేనివారికి ఆశ్రయం, బట్టలులేని వారికి బట్టలు ఇచ్చినచో శ్రీకృష్ణపరమాత్మ ఎంతో ప్రీతి చెందుతాడు. (74) అధ్యాయం 19
అందుచేతనే 24వ.అధ్యాయంలో బాబావారు అన్నాసాహెబ్ ధబోల్కర్ చేతి కోటు మడతలలో నుండి శనగలు రాలిపడగా పరిహాసం చేశారు.
ఈ అణ్ణాసాహెబ్ కు తానొక్కడే తిను దుర్గుణం కలదని చెప్పుతూ హాస్యమాడారు. దీని ద్వారా బాబా, మనం ఏది తిన్నాకూడా ప్రక్కవారికి కూడా అందులో భాగం పెట్టి తినాలనే సందేశాన్నిచ్చారు.
ఆవిధంగానే బాబా లోభుల గురించి చెబుతూ లోభి తన వద్దనున్న ధనాన్ని తాననుభవించలేడు. ఇతరులను అనుభవించనివ్వడు. అంతులేని సంపద ఉన్నా లోభత్వంతో ఉండటమంటే అది సిగ్గుచేటు. లోభి జీవితమంతా చేదు అనుభవాలు, అలసట తప్ప మరేమీ ఉండదు. (30) అధ్యాయం 40
ఏదానం చేసినా (దానధర్మాలు, మందిర నిర్మాణాలు మొదలగునవి) అవి స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగా చేస్తేనే దానికి విలువ. బలవంతంగా చేసిన దానం, లేక పేరు ప్రతిష్టలకోసం చేసిన దానధర్మాలవల్ల ఎటువంటి ఉపయోగము లేదు.
దీనికి సంబంధించి బాబా చెప్పిన మాటలు “ఇష్టం లేకుండా, ప్రేమలేకుండా, భయంతోను, ఎవరో బలవంతం పెట్టినందువల్లగాని, తప్పనిసరి పరిస్థితులలో గాని ఏది ఇచ్చినా గాని భగవంతుడు మెచ్చడు.
త్రికరణశుధ్ధిగా ఇచ్చేది కొంచమయినా సరే భగవంతుడు ఎంతో ప్రీతి చెందుతాడు. (101)
ఎవరయితే సద్భావం లేకుండా ఇస్తారో వారిచ్చే దానానికి ఎటువంటి విలువలేదు. ఇక ఆలస్యం లేకుండా ఆఖరికి తాను చేసిన దానానికి ఫలితం ఏదీ లేదన్న విషయం అనుభవమవుతుంది. (109) అధ్యాయం 47
దానధర్మాల గురించి సాయిబాబా అమూల్యమయిన సలహానిచ్చారు. “ఒకవేళ నీకు ఎవరికీ కూడా డబ్బు ఇవ్వలనిపించకపోతే ఇవ్వకు. కాని వారిపై అరచి కోపంగా కుక్కలా మొరగవద్దు”. (143) అధ్యాయం – 19
ప్రధానంగా సాంసారిక జీవితంలో జీవిస్తున్నవారికి బాబావారు చక్కటి సలహానిచ్చారు.
సంసారులు తమ కుటుంబ పోషణార్ధం అవసరాన్ని బట్టే ధనం వ్యయం చేయమని, చాలా జాగ్రత్తగాను, మితంగాను ఖర్చు పెట్టమని చెప్పారు.
నిరంతరం దానధర్మాలను కూడా అధికంగా చేయడం కూడా మంచిది కాదన్నారు. మొత్తం ఉన్న ధనమంతా ఖర్చుపెట్టిన వాడిని ఇక ఎవ్వరూ కూడా లక్ష్యపెట్టరు. (79)
ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకొనండి. ఎవరయినా సరే దానధర్మాలు (దానం చేయుట, మందిరాలు నిర్మించుట మొ.) చేయవలసినదే. కాని తమకు ఉన్నంతలోనే చేయాలి తప్ప వాటికోసం అప్పులపాలవద్దని చెప్పారు. (72), దానధర్మాలు చేయవలసి వచ్చినపుడు ఆలోచించి పాత్రనెరిగి దానం చేయాలి తప్ప అపాత్ర దానం కూడదని చెప్పారు.
రేపు తరువాయి భాగం…..
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
Latest Miracles:
- మహారాజ్ ఎంతో ప్రేమతో ’అల్లా ఆచ్చాకరేగా’ (భగవంతుడు అంతా సరి చేస్తాడు) అన్నారు…Audio
- భగవంతుడు మననించి కోరేది ఏమిటి ?
- భగవంతుడు ఉండగా దేనికీ భయపడనవసరం లేదు–Audio
- నానావలికి సంబందించిన ఒక సంఘటన–Audio
- బాబా నీ కోసమే ఇలా ఎంతో కస్టపడి వస్తే నువ్వు ఇలా చేస్తావా?–Aduio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments