Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా.
శ్రీ విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ గుంటూరు.
పూజ్య శ్రీ విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ వారు కూడా సాయిమార్గమునకు సన్నిహితముగా యుండువారు. సాయి విగ్రహ ప్రతిష్టలు చేయువారు.
సాయి నామము ఓం సాయినాధాజై – శ్రీ సాయినాథాజై అని చేయుచు భక్తులచే చేయంచువారు. శ్రీ సాయిబాబా గురించి అనుగ్రహ భాషణలు చేయువారు.
అనేక సాయి మందిరములలో వారి ప్రవచనములు జరిగేవి.పొన్నూరు, నండూరు, చీరాల, గుంటూరులలోని సాయి మందిరములలో వారి ప్రవచనములు స్వయంగా విన్నాను.
చీరాలలో జరిగిన సమావేశములలో వారి ప్రక్కన నన్ను కూర్చొని బెట్టుకొని నాచే మాట్లాడించిరి. ఇలానే పూలమ్మగారు కూడా నన్ను ప్రక్కన కూర్చుండ బెట్టుకొని నండూరు గ్రామములో మందిర వార్షికోత్సవము రోజున నాచే బాబా లీలలు చెప్పించిరి.
ఒకసారి పూల్లమ్మ గారు భక్తులతో విశ్వంజీవారి వద్దకు వెళుతూ నన్ను(రచయిత) కూడా తీసుకొని వెళ్ళిరి.
అప్పుడు అమ్మగారు “గోపాలరావుకు ధ్యానం కుదరటం లేదు” అని అనగా, స్వామివారు “ఇంకొన్ని సమస్యలుయున్నవి అవి అవగానే కుదురుతుందన్నారు”.
అటు తరువాత ఒకసారి నన్ను మండవ వీరయ్య చౌదరి వాళ్ళు స్వామివారి వద్దకు తీసుకొని వెళ్ళారు. వారు చెప్పిన సమయమునకు వెళ్లనందున ఇప్పు డొచ్చారేమిటి? అని స్వామి అంటే, గోపాలరావుగారు పూజచేసుకుంటుంటే ఆలస్యమైనదని నా మీద నెపం పెట్టారు వాళ్ళు. అప్పుడు స్వామి కారణం అదికాదు అన్నారు.
“గోపాలరావు! ఇంకా పూజలు కాదు మార్చుకోవాలి” అని అన్నారు. మేము వారితో మాట్లాడిన తరువాత పైకి వెళ్ళి కాసేపు కూర్చొని వెళ్లండని చెప్పారు.
పైకి వెళ్లగా స్వామి శ్రీ విద్యాసాగరశర్మ గారు అక్కలకోటస్వామి జీవితచరిత్ర చదువుచు “ఇంకా ఎంతకాలము ఈ పూజలతో గడుపుతూ కాలం వెళ్లబుచ్చుతాము. ద్యానం ఎప్పుడు చేస్తాము, ఆత్మను ఎప్పుడు దర్శిస్తాము” అని చెపుతున్నారు.
దానిని బట్టి శ్రీ విశ్వంజీవారు నన్ను ధ్యానసాధన చేయమని ఆదేశించుటగా తెలియబడినది.ఇట్టి మహాత్ముల దర్శనభాగ్యం బాబా కలిగించుటయే కదా!
ఒకసారి పొన్నూరులో భావనగర్ కాలనీలో గల మా స్వగృహమునకు పూజ్య శ్రీ విశ్వంజీ మహారాజు వారు, చందోలు శ్రీరాఘవ నారాయణ శాస్త్రి గారితొ కలసివచ్చిరి. ఆ సమయములో రాఘవనారాయణ శాస్త్రి గారికి పాదపూజ చేయబోతే నాకు వద్దు, శ్రీ విశ్వంజీగారు దత్తుడు వారికి చేయుండన్నారు.
నేను వ్రాసిన “లైఫ్ స్కెచ్ అఫ్ షిరిడి సాయిబాబా” అను గ్రంధమును విశ్వమందిరము వద్ద విశ్వంజీ గారు ఆవిష్కరించిరి.
ఆ కార్యకర్మములో శ్రీ శివయ్య గారు రిటైర్డ్ ఐ. ఏ. ఎస్, శ్రీ ప్రసాదరాయకులపతిగారు, శ్రీ మాధవపెద్ది రాధాకృష్ణమూర్తి గారు కూడా పాల్గొనిరి.
ఇలా సాయి నా సాధనలో పెద్దలందరి దర్శనము చేయించిరి.ఒకసారి వారి గురువు గారైన శ్రీ దత్తాత్రేయ వ్రాడేకర్ వారి దర్శన భాగ్యము కూడా స్వామివారుమా దంపతులకు కలిగించిరి.
శ్రీ ఆలూరు గోపాలరావు గారి విరచిత శ్రీ సాయి బాబా సత్ చరితము
సంపాదకీయం: సద్గురులీల ( జనవరి – 2016)
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- సాయి మార్గములో పెద్దలు(శ్రీ కుర్తాళం పీఠాధిపతి)
- సాయి మార్గములో పెద్దలు (శ్రీ అచలానంద సరస్వతి, బషీర్ బాబా)
- సాయి మార్గములో పెద్దలు(శ్రీ పూర్ణానంద స్వామి – శ్రీశైలం)
- సాయి మార్గములో పెద్దలు(శ్రీ నాంపల్లి బాబా, శ్రీ రామిరెడ్డి తాత)
- సాయి మార్గములో పెద్దలు(జిల్లెళ్ళమూడి అమ్మగారు)
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments