Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
గణేష్ విష్ణు బేరే జిల్లా వ్యవసాయ శాఖాధికారి. అతడు ఒకసారి షిర్డీ కి వచ్చి, బాబాను దర్శించి, నమస్కరించుకున్నరు. బాబా, “తక్షణం షిర్డీ నుండి బయలుదేరి వెళ్ళండి, కొంచెం కూడా ఆలస్యం చేయవద్దు. ఇంకొక్క క్షణం కూడా ఇక్కడ ఉండవద్దు. నీ టాంగా బండిని అత్యంత వేగంగా పోనిస్తూ అతి శ్రీఘ్రంగా కోపరగావ్ చేరుకో!” అని అజ్ఞాపించారు.
సాయి మహారాజు వచనాల యందు విశ్వాసముంచి బేరే వెంటనే బయలుదేరారు. అతనితోపాటు దాసగణు కూడా బయలుదేరారు. వారి టాంగా అతివేగంగా పోతూ ఉంది. దారిలో నెమ్మదిగా మరో టాంగా పోతూ ఉంది. ఆ టాంగా లో ఉన్నవారిలో ఒక పెద్ద మనిషి బేరేతో “అంత మరీ వేగంగా వెళ్లి పోతున్నారెందుకు? రైలు బండికి ఇంకా చాలా సమయముంది. టాంగాను మెల్లగా పోనీయమని చెప్పరాదూ నేను కూడా నీ వెంట వస్తానుగా” అని వేడుకున్నాడు.
బేరే అతని మాటలు లెక్కచేయకుండా బాబా ఆజ్ఞమేరకు టాంగాను త్వరగా పోనివ్వమన్నారు. త్వరగా త్వరగా పోయి గోదావరి నది దాటి రైల్వే స్టేషన్ చేరుకున్నారు. వారు స్టేషన్ చేరుకున్న కొంతసేపటి తరువాత తెలిసిన విషయమేమిటంటే కోపరగావ్ రోడ్డు పై నింపాదిగా వెనుక వస్తున్న టాంగా ఒక రోడ్డు మలుపులో దారిదోపిడికి గురి అయ్యింది. వాళ్ళు డబ్బు పోగోట్టుకోవదమేగాక బందిపోట్ల చేత తన్నులు కూడా తిన్నారు.
ఆ వార్త విని బేరే “ఓ సద్గురు నాధా! మమ్ము రక్షించవు. నీవు మమ్మల్ని ఎందుకు త్వరగా వెళ్ళమన్నావో ఆ సత్యం ఇప్పుడు భోదపడింది” అని బాబాకు కృతజ్ఞతలు అర్పించారు.
source: దాసగణు గారి రచన భక్తీసారామృత్ చాప్టర్ 31
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- విష్ణు పంత్ బల్వంత్ మామిడిపళ్ళు – బాబా అనుగ్రహమ్
- తన కన్నునిచ్చి పాప కన్నును కాపాడిన సాయి గణేష్–Audio
- ‘‘సాయిబాబానే మీ మైనతాయిని రక్షించాడు.
- పెట్టిన రెండు రూపాయిలు అలాగే ఉన్నాయి. అమితాశ్చర్యానికి లోనూఅయ్యాను.
- బాబా పంపించారంటే అభయం లభించినట్టే
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “గణేష్ విష్ణు బేరే”
Maruthi
May 30, 2017 at 11:25 pmaapadbhandava SaiBaba…Anadha Rakshaka Sai Baba…Sai Baba…Sai Baba…prema Swaroopa SaiBaba…Karuna Sagara SaiBaba…Sai Baba…Sai Baba