సత్సంగం చేసుకోవడానికి బాబా ధన సహాయం



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

ఈరోజు మనం సత్సంగం చేసుకోవడానికి బాబా ధన సహాయం ఏవిధంగా చేశారో తెలుసుకుందాము. నరసాపురంలో సత్సంగం ప్రారంభిద్దామనుకున్న తన భక్తులకి బాబా మొట్టమొదటిసారిగా ధనాన్ని ఎలా సమకూర్చారో చదవండి.

మన మనసులో మంచి సంకల్పం ఉండాలే గాని బాబా గారి ద్వారా అవి నెరవరతాయనడంలో యెటువంటి సందేహమూ అక్కరలేదు. మన  మనస్సు  మంచిది అవ్వాలి, మన ప్రవర్తన మంచిగా ఉండాలి, మన మాట తీరు మృదువుగా ఉండాలి , మొహములో ప్రసన్నతా ఉండాలి. ఇవన్నీ  కూడా  ప్రతీ  సాయిభక్తుడూ తప్పక ఆచరించతగ్గవి.

ఈ రోజు నేను ద్వారకామాయి సాయి బంధు సేవా సత్సంగ్ స్థాపించిన శ్రీమతి పి.వి. మీనాక్షి గారి బాబా లీలలను గూర్చి చెప్పుకుందాము.

లీల నం. 1

ఈ లీలను చెప్పేముందు మొదటగా సాయినాథుని ప్రార్థిస్తున్నాను. మేము ఈ సత్సంగాన్ని 2007 లో బాబా గారి దయతో ప్రారంభించాము. మేము ఆయన చూపే ఎన్నో లీలలను చూస్తున్నాము. అందులో మొదటగా ఈ సత్సంగం ప్రారంభమయిన లీలను ఆమె మాటలలలోనే తెలుసుకుందాము.

ఒకరోజున నేను, నా స్నేహితురాలు (ఈమె సత్సంగానికి 108పాటలను వ్రాసారు) సత్సంగం కొత్తగా ప్రారంభించడం గురించి మట్లాడుకుంటున్నాము. ఆ సమయంలో సత్సంగానికి ప్రారంభపు సొమ్ము ఏదీ లేదు. ఈ సత్సంగం తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలను చేద్దామనుకొన్నాము.

కాని మొదటగా ప్రారంభపు సొమ్ము ఏదీ లేదు. కాని, ఏ భక్తుని వద్దనించి సొమ్ము అడగకుండా ప్రారంభిద్దామని అనుకున్నాము. ఇలా మాట్లాడుకుంటూ మేము నడుస్తూ ఉన్నాము. దారిలో ఒక రంగుల షాప్ వద్దకు పని వుండి వెళ్ళాము.

అక్కడ కుర్చీలో ఒక 500 రూపాయల నోటు ఒకటి పడివుంది. నేను ఆ నోటు తీసుకుని పక్కన కుర్చీలో కూర్చున్న అతనిని “ఈ నోటు ఎవరిది?” అని అడిగాను. ఆ వ్యక్తి ఆ నోటు తనది కాదని చెప్పాడు. మరలా నేను ఆ షాపు యజమానిని అడిగాను. అతను కూడా తనది కాదు అని చెప్పాడు.

మేము ఆ షాపుయజమానితో మరలా రేపు వస్తాము, ఎవరయినా 500 రూపాయలు పోగొట్టుకున్నామని అడిగితే మాకు చెప్పండి అని మా వివరాలూ, చిరునామా అన్నీ ఇచ్చి ఆ నోటు తీసుకుని వచ్చేశాము. మరునాడు మేము ఆ షాపుకి వెళ్ళి ఎవరయినా నోటు పారేసుకున్నామని వచ్చారా అని అడిగాము. ఆ షాపు యజమాని ఎవరూ నోటు పారేసుకున్నామని రాలేదు అని చెప్పాడు.

అప్పుడుమాకు అనుమానం వచ్చింది. అసలు ఇది మంచి నోటేనా లేక దొంగనోటా అని. అందుచేత మేము ఆ సాయంత్రం బ్యాంక్ కి వెళ్ళి ఆ నోటు మంచిదా లేక దొంగ నోటా అని అడిగాము. వారు ఆ నోటు మంచిదే అని చెప్పారు.

అందుచేత ఆ సొమ్ము బాబాగారే మా సత్సంగం ప్రారంభించడానికి తన మొదటి చందాగా ఇచ్చినట్లు భావించాము. మరునాడు నేను, నా స్నేహితురాలు చివర సున్నా లేకుండా 500కి కొంత సొమ్ము వేద్దామనుకున్నాము. అంటే 500/- కాకుండా 501/-.

ఇలా మాట్లాడుకుంటూ వెడుతుండగా మాకు రోడ్డు మీద 5రూపాయల నాణెం కనపడింది. ఈవిధంగా బాబాగారు మా సత్సంగానికి తమ మొదటి చందాగా 505/- రూపాయలు ఇచ్చారనటానికి నిదర్శనం.

నాకు నా పేరు గాని విద్యార్హతలు గాని చెప్పుకోవడానికి ఇష్టపడను. దానివల్ల అహం పెరుగుతుంది. బాబాగారి భక్తురాలిగా ఉండడమే నాకు ఇష్టం. బాబా గారిని నన్నుఎల్లప్పుడూ రక్షించమని వేడుకుంటూ ఉంటాను. నేను సాయి సత్సంగంలో సభ్యురాలిగా ఉండి సేవ చేయడమే నాకిష్టం.

లీల నం.2

మా శ్రీ ద్వారకామాయి సాయి బంధు సేవా సత్సంగ్ ప్రథమవార్షికోత్సవం సందర్భంగా 2008 అక్టోబర్ విజయదశమినాడు అన్నదానం చేయడానికి నిర్ణయించుకున్నాము. ఆ రోజు 108మంది బీదవారికి అన్నదానం జరుపుదామని నిశ్చయించాము. మేము వంటలు చేయడానికి వంటవారినెవరినీ పిలవకుండా మొత్తం పదార్థాలన్నీ మేమే స్వయంగా తయారు చేద్దామనుకున్నాము.

మా చిన్నచెల్లెలు (ఆమె కూడా సత్సంగంలో సభ్యురాలు) ఇంకొక ఇద్దరము ప్రధానమయిన వంటవారు. నేను, మిగతా భక్తులం సహాయం చేస్తున్నాము. వంట ప్రారంభించే ముందు నేను బాబాగారికి కొబ్బరికాయ కొడదామనుకున్నాను. ఈ ఏర్పాటులన్నీ కూడా బాబా గారి గుడి ప్రక్కనే జరుగుతున్నాయి.

మా చెల్లెలు తనకు 108మందికి వంట చేయడంలో అనుభవం లేదని చెప్పింది. వంటలన్నీ ఎలా ఉంటాయోనని మేము భయపడ్డాము, ఎందుకంటే బాబాగారికి నైవేద్యం పెట్టకుండా రుచి చూడలేము కదా.

నేను కూడా చాలా భయపడ్డాను, ఎందుకంటే వంటలు ప్రారంభించే ముందు బాబాగారికి కొబ్బరికాయ కొట్టడం మర్చిపోయాను. అప్పుడు నేను కొబ్బరికాయ తీసుకుని బాబా గారి వద్దకు వెళ్ళి ఇలా ప్రార్ధించాను, “బాబా, ఇదంతా కూడా నువ్వు తయారుచేసినదే, ప్రధాన సూత్రధారివి నువ్వే, మేము నిన్ను అనుసరించేవారిమి మాత్రమే బాబా.”

మొదటగా ఈ సత్సంగం ఎక్కడయితే ప్రారంభమయిందో ఆ గుడిలో అన్నదానం జరుగుతోంది. అన్నదానం జరిపేముందు మేము బాబాకు నైవేద్యం పెట్టాము. నైవేద్యం కాగానే మొదటి బ్యాచ్ కి వడ్డించడం మొదలుపెట్టాము. ఆ మొదటి బ్యాచ్ లో భోజనము చేస్తున్న ఒక వ్యక్తి, “పదార్థాలు చాలా రుచిగా ఉన్నాయి” అని చెప్పాడు. “ఈ పదార్థాలన్నీ ఏదయినా పెద్ద హోటల్నుంచి తెచ్చారా?” అని అడిగాడు. (ఈ మాటలు అన్న వ్యక్తి గేటు పక్కనే బాబా విగ్రహం యెదురుగా కూర్చుని వున్నాడు)

మేమంతా చాలా సంతోషించి “శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై “ అన్నాము.

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “సత్సంగం చేసుకోవడానికి బాబా ధన సహాయం

Sai..bhale baaga raasavu…manchi leela..baba is there always..with u and u r Baba’s work..keep it up.

sai…chalabaga raasavu….manchi leela..great devote..baba is there always with u and u r babas work..keep it up.

Maruthi

Sri Sathchidananda Sadguru Sainath Maharaj Ki Jai….Sai Baba…Sai Baba

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles