Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
బాబా గారు ద్వారకామాయిలో దక్షిణగా స్వీకరించిన సొమ్మునంతా మరలా భక్తులందరికీ ఉదారంగా పంచి పెట్టేస్తూ ఉండేవారన్న విషయం మనకందరకూ తెలుసు. బాబా వారికి సత్సంగాలంటే ప్రీతి. ఎక్కడ సత్సంగాలు జరుగుతున్నా బాబా అక్కడ స్వయంగా ఉంటారనీ, కొంత మంది భక్తులపై తన అనుగ్రహాన్ని ప్రసరిస్తూ ఉంటారన్న విషయం కూడా సత్సంగాలను నిర్వహిస్తున్న వారందరికి అనుభవమే.
ఒక్కొక్కసారి సత్సంగాలు జరుగుతున్నపుడు, ఆఖరులో బాబా వారికి ఆరతి ఇస్తుండగా భక్తులలో కొంతమందికి తమకు తెలియకుండానే కళ్ళవెంట నీరు వస్తూ ఉంటుంది. ఇది సాయి భక్తులకు అనుభవమే.
ఇప్పుడు మీరు చదవబోయే లీల శ్రీసాయిలీలా మాసపత్రిక జనవరి, 1984 వ సంవత్సరంలో ప్రచురింపబడింది.
మొట్టమొదటి సారిగా నేను పూజ్యశ్రీ ఎక్కిరాల భరద్వాజ గారిని 1980 వ సంవత్సరం జూలై నెలలో కలుసుకునే భాగ్యం కలిగింది. అప్పుడాయన పశ్చిమ గోదావరి జిల్లా చివటం గ్రామంలో సాయి తత్వ ప్రచారానికి ఎంతగానో కృషి చేస్తున్నారు.
ఆ రోజు చివటం అమ్మ (చివటం అమ్మ. ఈమె గొప్ప అవధూత. ఈవిడ దిగంబరంగానే తిరిగేవారు. చివటం గ్రామంలో ఆవిడ సమాధి కూడా ఉంది.) మహాసమాధి చెందిన ‘మండలారాధన’ రోజే గాక గురుపూర్ణిమ రోజు కూడా అవడం వల్ల ఎంతోమంది మహాత్ములు వచ్చారు.
అక్కడ వారందరి సమక్షంలో ఉండగా నాకు కొవ్వూరులో సాయి సత్సంగం ప్రారంభిద్దామని ప్రేరణ కలిగింది. ఆ ప్రేరణతోనే చుట్టుప్రక్కల ఉన్న 5 సం. నుండి 15 సం.వయసు గల పిల్లలనందరినీ కలుపుకుని సత్సంగాన్ని ప్రారంభించాము. ఆ సత్సంగం నేటికీ కొనసాగుతూ వస్తోంది.
ఆ సత్సంగ మహత్యం వల్ల రోజు రోజుకీ సాయి భక్తులలో బాబాపై భక్తి ప్రేమలు పెరుగుతూ వస్తున్నాయి. సమాజంలో కూడా మా సత్సంగాన్ని మెచ్చుకునేవారు. మా అనుభవాన్ని బట్టి, ప్రతి రోజూ సత్సంగ కార్యక్రమాలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయంటే అది బాబా యొక్క మహత్యం వల్లనే.
ఆయన అనుగ్రహమే లేకపోతే సత్సంగ కార్యక్రమాలు సజావుగా జరగవు. మా సాయికుటీర్ లో మేము సత్సంగాన్ని నిర్వహిస్తూ ఉంటాము. మా సాయికుటీర్ లో జరిగిన ఒక అద్భుతాన్ని మీకు వివరిస్తాను.
1983వ సంవత్సరం జూలై నెలలో మా సాయికుటీర్ లో మా సత్సంగ సభ్యులమందరం గురుపూర్ణిమ జరుపుకోవడానికి నిర్ణయించుకున్నాము. మా సత్సంగ ముఖ్య కార్య నిర్వాహకురాలు మా వదినగారయిన శ్రీమతి లక్ష్మీ రామమూర్తి గారు. మా సత్సంగంలో మేమందరం పిల్లలమే.
గురుపూర్ణిమ ఉత్సవం నిర్వహించుకోవాలంటే మా సత్సంగంలో పెద్దవాళ్ళెవరూ లేకపోవడం చేత కావలసిన డబ్బు సమకూరడం కూడా కష్టమే. ఈ ఉత్సవాన్ని ఎలా నిర్వహించాలా అని మా వదినగారు మధనపడుతూ ఉన్నారు.
గురుపూర్ణిమ నిర్వహించాలంటే దాని కోసం ఎన్నో సమకూర్చుకోవాలి. దానికి ధన సహాయం చేసేవాళ్ళెవరూ మా సత్సంగంలో లేరు. మా వదిన గారు ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఉన్నంతలోనే గురుపూర్ణిమని సామాన్యంగానే జరుపుకుందామని చెప్పారు. కాని, మన బాబా గారు తన భక్తులను నిరాశపడనివ్వరు కదా! ఆయన ఎంతో దయకలవారు, ఉదార స్వభావులు.
1983వ సంవత్సరం జూలై నెల 6 వ తారీఖున పోస్టుమాన్ వచ్చి శ్రీమతి లక్ష్మి గారికి రిజిస్టర్ ఉత్తరం వచ్చిందని ఇచ్చాడు. ఆ ఉత్తరం హైదరాబాదులో ఉన్న మా అన్నగారి కొడుకు సత్యప్రసాద్ పంపించాడు.
మా వదిన గారు కవరు తీసుకుని చింపగానే అందులోనుండి పది రూపాయల కాగితాలు 19 (మొత్తం విలువ రూ.190/-) కింద పడ్డాయి. చాలా ఆశ్చర్యంతో ఆమె ఉత్తరం మడత విప్పగానే అందులో రూ.75/- విడిగా ఉన్నాయి.
ఆ ఉత్తరంలో సత్యప్రసాద్ తాను ప్రతి నెల రూ.25/- షిరిడీకి పంపిస్తూ ఉంటానని రాశాడు. కాని కొన్ని అనుకోని కారణాల వల్ల మూడు నెలలనుండి షిరిడీకి డబ్బు పంపడం కుదరలేదనీ, ఆ సొమ్ము మొత్తం రూ.75/- పంపుతున్నానని రాశాడు.
ఈ పంపించే సొమ్ముతో మీరు మీ సాయికుటీర్ లో గురుపూర్ణిమ ఉత్సవం జరుపుకోండి అని కూడా రాశాడు. కాని, కవరులో ఉన్న రూ.190/- గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. బహుశ కవరులో పొరబాటున రూ.190/- పెట్టారేమో అని మా వదిన గారు అనుకున్నారు.
వెంటనే మా వదినగారు, కవరులో రూ.190/- కూడా పెట్టి పంపించారు, దాని సంగతేమిటని ప్రశ్నిస్తూ అతనికి ఉత్తరం రాశారు. వెంటనే తిరుగు టపాలో తాను రూ.75/- మాత్రమే పంపించాననీ రూ.190/- సంగతి తనకు ఏమాత్రం తెలీదని రాశాడు.
అది ‘సాయిలీల’ తప్ప మరేదీ కాదని అర్ధమయింది. ఆ విధంగా బాబాగారే స్వయంగా చేసిన ధన సహాయంతో, గురుపూర్ణిమ రోజున మేము భారీ ఎత్తున బాబావారికి సహస్రనామ పూజ, అన్నదానం మొదలైన కార్యక్రామాలన్నీ నిర్వహించగలిగాము.
పి.ఎస్.ఆర్. విజయభాస్కర్
కొవ్వూరు (ప.గో.జిల్లా)
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- శ్రీ సాయి అమృత ధార – నమ్ము నమ్మకపో….
- శిరిడి యాత్రకు బాబా ధన సహాయం
- శ్రీ సాయి అమృత ధార – పెళ్ళి చూపులు
- సాయి చేసిన సహాయం
- Cheque bounce కాకుండా పరిచయస్తుని రూపంలో భక్తుని వద్దకు వెళ్ళి , ధన సహాయం చేసిన బాబా వారు–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments