‘‘సాయిబాబానే మీ మైనతాయిని రక్షించాడు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!

ముందు భాగం కోసం ఇక్కడ  క్లిక్ చేయండి

(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)

 

సర్వరోగ నివారిణి ఊదీ. దానిని స్వీకరించడం ఔషధసేవనంతో సమానం. అందుకని ఊదీని నీటిలో కలిపి, మైనతాయి చేత తాగించాడు నానాసాహెబ్‌.

తర్వాత బాబా పంపిన ఆరతి పాటని భక్తిగా ఆలపించాడు. పాట పూర్తికానే లేదు, మైనతాయి ప్రసవించింది. పసిబిడ్డ ఏడుపు వినరావడంతో ఆనందంగా, ఆరాధనగా చేతులు జోడించాడు నానాసాహెబ్‌. బాబాని తలచుకుంటూ నమస్కరించాడు.

కాస్సేపటికి బయటికి వచ్చింది డాక్టర్‌. నానాసాహెబ్‌తో ఇలా అంది.‘‘సాయిబాబానే మీ మైనతాయిని రక్షించాడు. పండంటి మగబిడ్డ పుట్టాడు. తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారు.’’‘‘బాబా’’ అంటూ ఆనందాశ్రువులు రాల్చాడు నానాసాహెబ్‌.

తనకి మనవడు పుట్టాడన్న శుభవార్తని చెప్పేందుకు అటుగా కదిలాడు. గోడగడియారాన్నే తదేకంగా చూస్తున్న బాపూగిర్‌ దగ్గరగా వచ్చాడు నానాసాహెబ్‌.

‘‘అయ్యా, మీరు చేసిన సాయం చాలా గొప్పది. సరయిన టైం కొచ్చి ఊదీ ప్రసాదాన్ని అందించారు. దాని సేవనంతో మా అమ్మాయి పండంటి బిడ్డను ప్రసవించింది.

 తల్లీబిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.’’ అన్నాడు నానాసాహెబ్‌.‘‘సరయిన టైంకి రాగలిగానంటే దానికి కారణం మీరే! మీరు టాంగా పంపి ఉండకపోతే నేనొచ్చేది అనుమానమే.’’ అన్నాడు బాపూగిర్‌.

టాంగా తను పంపించాడా? లేదే అనుకున్నాడు నానాసాహెబ్‌. ఆ మాటే అన్నాడు.‘‘నేను టాంగా పంపడమేంటండీ! మీరసలు షిరిడీ నుంచి వస్తున్నట్టుగానే నాకు తెలియదు.’’‘‘మీకు తెలియదా’’ ఆశ్చర్యపోయాడు బాపూగిర్‌.

తర్వాత రకరకాలుగా ఆలోచించసాగాడు. ఆ ఆలోచన లన్నీ ఓ కొలిక్కి వచ్చాయి. అప్పుడడిగాడిలా.‘‘ముందీ సంగతి చెప్పండి. మీ గడియారం బాగానే పని చేస్తోందా?’’‘‘దానికేం! బ్రహ్మాండంగా పని చేస్తోంది.’’‘‘ఇప్పుడు టైమెంతయిందంటారు?’’‘‘గడియారం చూపిస్తోందిగా, సరిగ్గా మూడుగంటయింది.’’ అన్నాడు నానాసాహెబ్‌.

‘‘సాయినాథ్‌ మహారాజ్‌’’ అంటూ కళ్ళు మూసుకున్నాడు బాపూగిర్‌. చేతులు జోడించి ఆరాధనగా పైకి చూశాడు. తర్వాత నానాసాహెబ్‌తో ఇలా అన్నాడు.

‘‘నా దగ్గర రెండు రూపాయలే ఉన్నాయి. నేను జామ్నేర్‌ వెళ్ళలేనంటే, నువ్వు బయల్దేరు, నీ సంగతి నేను చూసుకుంటానన్నారు బాబా. అన్నట్టుగానే చూసుకున్నారు.

అయ్యా, నన్ను టాంగాలో ఇక్కడికి తీసుకొచ్చింది ఎవరో తెలుసా?’’‘‘ఎవరు’’‘‘ఇంకెవరు? స్వయంగా బాబాయే! నేను ఇక్కడికి వస్తున్నట్టుగా మీకు తెలీదు. కాని టాంగా నా కోసం సిద్ధంగా ఉంది. బంట్రోతు కూడా సిద్ధంగా ఉన్నాడు.

అన్నట్టు చెప్పడం మరిచిపోయాను. ఆ బంట్రోతును చూసినప్పుడే అనుకున్నాను, ఇతన్ని ఎక్కడో చూశానని. ఇప్పుడు ఆ ముఖకవళికలూ, కళ్ళూ గుర్తు చేసుకుంటుంటే తెలుస్తోంది, ఆయన బాబాయే! అనుమానం లేదు.’’ అన్నాడు బాపూగిర్‌.

తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Spread the love

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

One comment on “‘‘సాయిబాబానే మీ మైనతాయిని రక్షించాడు.

kishore Babu

మనము గురువుని ప్రతివిషయము లో పూర్తిగా నమ్మినట్లు అయితే, మనకి కావలసినవి అన్ని ఆయనే సమకూరుస్తారు. బాపూగిర్‌ భువ తన దగ్గర డబ్బులు లేకపోయినా గురువు మీద భారము వేసి ముందుకు సాగినాడు. బాబా వారు తన భక్తుని స్థితిని గమనించి సరిగా కావలసిన టైం కి సహాయం చేసినారు.
ఈ లీల ద్వారా మనము గుర్తించవలసిన విషయము ఏమనగా , గురువు ఎప్పుడు కూడా తన భక్తుల అవసరాలను కనిపెట్టుకొని ఉంటారు.
—–సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా.

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles