బాబా మాట జవదాటవద్దు రెండవ బాగం…



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

ముందు బాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి….

బాబా మాట జవదాటవద్దు రెండవ బాగం…

ఆ క్షణంలోనే ఒక మిలటరీ ట్రక్ వస్తూ ఉంది. ఆపమన్నట్లుగా మా నాన్నగారు చేయి ఊపారు.  వెంటనే ఆ ట్రక్ ఆగింది.  అందులో నుండి ఒక సిపాయి దిగి ఏమయింది, ఏమిటి సమస్య అని అడిగాడు.  జరిగినది విని అతను ట్రక్ లోకి వెళ్ళి ఒక పెద్ద ఫ్లాష్ లైట్ ను తీసుకుని వచ్చాడు.  ఇద్దరూ కారు ఆగిపోయిన చోటుకు వచ్చారు.  సిపాయి కారు బోయ్ నెట్ ఎత్తి లోపలికి తొంగిచూశాడు.  బహుశ కారులోపల ఎటువంటి లోపం కనిపించలేదేమో, డ్రైవర్ సీటులోకి వచ్చి ఇగ్నిషన్ కీ తిప్పాడు.  ఓహ్! కారు స్టార్ట్ అయి హెడ్ లైట్లు వెలిగాయి.

ఆ సిపాయి కాస్త ఊపిరి పీల్చుకుని గట్టిగా “అయ్యా! మీరు ఎంతో అదృష్టవంతులు,  లేకపోతే ఇక్కడ ముందున్న బావిలో పడి మీ అందరి ప్రాణాలు పోయి ఉండేవి” అన్నాడు.  కారు హేడ్ లైట్ల కాంతిలో కారుకు ముందు ఒక పెద్ద బావి కనపడుతోంది.  ఆ నుయ్యికి ఒక్క అడుగు దూరంలో మాకారు ఆగిపోయింది.  ఆ బావి నేలకు సమాంతరంగా ఉంది.  బావి చుట్టూరా ఎటువంటి గోడ లేదు.

దానిని చూడగానే నా గుండె చాలా వేగంగా కొట్టుకుంది.  కారే కనుక ఆగకపోయి ఉంటే మేమంతా జలసమాధి అయిపోయి ఉండేవాళ్ళం.  ఆ దృశ్యాన్ని తలుచుకుని నా ఒళ్ళు జలదరించింది.  సిపాయి వెంటనే కారును వేగంగా వెనక్కు త్రిప్పి రోడ్డుమీదకు తీసుకుని వచ్చాడు.  సమయానికి వచ్చి సహాయం చేసినందుకు కృష్ణారావుగారు ఆ సిపాయికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నారు. 

అప్పుడు ఆయన ఆ సిపాయిని ఇలా ప్రశ్నించారు. “ఇపుడు మేమెక్కడున్నామో చెబుతారా?” అప్పుడా సిపాయి నవ్వుతూ “మీరు షిరిడీ సరిహద్దుల దగ్గర ఉన్నారు” అని సమాధానమిచ్చి వెంటనే తన ట్రక్కులోకి దూకి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు.  ఆ క్షణంలో బాబానే సిపాయి రూపంలో వచ్చి సమయానికి సహాయం చేశారని మా నాన్నగారికి అర్ధమయింది.

కృష్ణారావుగారు వాచీలో టైమ్ ఎంతయిందోనని చూశారు.  అర్ధరాత్రి దాటి అయిదు నిమిషాలయింది.  చేతులెత్తి తనను క్షమించమని బాబాని మనసులోనే ప్రార్ధించుకున్నారు.  తనకు సహాయం చేసి రక్షించినందుకు బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.  ఆ తరువాత ఎటువంటి సమస్యలు లేకుండా కారు ముందుకు సాగింది.  మేమంతా క్షేమంగా ఇంటికి చేరుకున్నాము.

సంవత్సరం తరువాత కృష్ణారావుగారికి కలలో బాబా దర్శనమిచ్చారు.  ఆ కలలో బాబా ఆయన ముందు నుంచుని కోపంగా, “నన్ను నువ్వు అస్థిరంగా వ్రేలాడదీశావు.  నన్ను కూడ నిన్ను అదే విధంగా వ్రేలాడదీయమంటావా?” అన్నారు.  ఆ వెంటనే కృష్ణారావుగారికి మెలకువ వచ్చింది.

“బాబా నన్ను ఈ విధంగా కోప్పడటానికి కారణం ఏమిటి?  నేనేమి అపరాధం చేశాను” అని ఆలోచించారు.  మరునాడు ఉదయాన్నే ఆయన తన పూజాగదిలో గోడకు వ్రేలాడుతున్న బాబా ఫొటో వదులుగా ఉండి ఏ క్షణంలోనయినా పడిపోవడానికి సిద్ధంగా ఉండటం గమనించారు.  వెంటనే ఆరోజే వడ్రంగిని పిలిపించి, గోడకు గట్టిగా మేకులు కొట్టించారు.  ఫొటో క్రిందకు జారిపోకుండా ఫొటో క్రింద ఒక చిన్న పొడవాటి చెక్క బల్లను కూడా ఏర్పాటు చేశారు.

గ్రామస్థుల ద్వారా, పూజారి గారి ద్వారా, రాబోయే ప్రమాదాన్ని నివారించడానికి బాబా ముందరే  హెచ్చరిక చేశారు.  మన ఆత్మని (జీవాత్మ) మోసేది మన శరీరం.  అందుచేత ఈ శరీరాన్ని గౌరవిస్తూ ఉండాలి  మన శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుతూ ఉండాలి. దానికి సాధన చేయాలి.  అప్పుడు బాబా మనలని ప్రమాదాల బారిన పడకుండా తప్పక రక్షిస్తారు. 

సైనికులు సరిహద్దులలో ఉండి దేశాన్ని రక్షిస్తున్నట్లుగానే బాబా కూడా మన కర్మలనన్నిటినీ ధ్వంసం చేసి మనలను రక్షిస్తూ ఉంటారు.

మూలం : శ్రీసాయి సాగర్ పత్రిక 2010 వ సంవత్సరం దీపావళి సంచిక.

Baabaa’s divine manifestation – by VinnY Chitluri

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles