Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!
ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)
‘‘బాపూగిర్‌బువా మీరేనా?’’ అడిగాడు బంట్రోతు.‘‘అవును’’‘‘జామ్నేర్‌కే కదా మీరొచ్చేది. మీ కోసం టాంగా సిద్ధంగా ఉంది. రండి’’ అన్నాడతను.టాంగాని నానాసాహెబ్ పంపించి ఉంటాడు. అనుమానం లేదనుకున్నాడు బాపూగిర్.
తనొస్తున్నట్టుగా నానాకి కబురంపి ఉంటారు బాబా అనుకున్నాడు. టాంగా ఎక్కాడు బాపూగిర్.‘‘జై సాయిరాం’’ అన్నాడు. టాంగా పరుగందుకుంది. సన్నగా వాన, కమ్మగా మట్టివాసన హాయి హాయనిపించింది బాపూగిర్‌కి. కళ్ళు మూసుకున్నాడతను. నిద్రలోకి జారుకున్నాడు.
మనసా వాచా కర్మణా బాబానే నమ్ముకున్నాడు తను. కష్టానికీ సుఖానికీ అన్నిటికీ బాబానే దిక్కు అనుకున్నాడు. నిద్రలో మెలకువలో బాబానే స్మరించే తనకి ఎందుకింత కష్టం? తను చేసిన అపరాధం ఏమిటి? బాబా ఎందుకు తనని పట్టించుకోవడం లేదు?-నానాసాహెబ్ ఆందోళనకు అంతు లేకుండా పోయింది.
మైనతాయి నొప్పులు పడుతూనే ఉంది. ఇంకా ప్రసవం జరగలేదు. ఆమెను పరీక్షించి వచ్చిన డాక్టర్ దగ్గరకి రెండడుగుల్లో వచ్చి నిలిచాడు నానాసాహెబ్.‘‘ఏం చెప్పాలో నాకు తెలియడం లేదు. బిడ్డ అడ్డం తిరిగింది. దాంతో ప్రసవం కష్టంగా ఉంది.
ఇక ఆ దేవుడే దిక్కు.’’ అన్నది డాక్టర్. నానా సాహెబ్‌కి కన్నీరాగలేదు. పరుగున పూజామందిరంలోకి వచ్చాడు. మందిరంలో ఉన్న బాబా ఫోటోకి చేతులు జోడించాడు.‘‘అన్నిటికీ నిన్నే నమ్ముకున్నాను. నా నమ్మకాన్ని వమ్ము చెయ్యకు.’’ ప్రార్థించాడు నానాసాహెబ్.
కళ్ళు మూసుకున్నాడు. ధ్యానించసాగాడు. ఇంతలో నౌకరు వచ్చాడక్కడకి.‘‘అయ్యా’’ పిలిచాడు.ఏమిటి? అన్నట్టుగా కళ్ళు తెరిచి చూశాడు నానాసాహెబ్.‘‘మీ కోసం షిరిడీ నుంచి ఎవరో వచ్చారు. బాబా పంపించారట.’’ చెప్పాడు.
ఇంత రాత్రివేళ షిరిడీ నుంచి ఎవరు వచ్చి ఉంటారు? బాబా పంపించారంటే అభయం లభించినట్టే అనుకున్నాడు నానాసాహెబ్. గబగబా బయటికి వచ్చి చూశాడు. ఎదురుగా బాపూగిర్ నవ్వుతూ నిల్చుని కనిపించాడు.
తనెప్పుడూ అతన్ని చూడలేదు. ఎవరితను? సందేహంలో పడ్డాడు నానాసాహెబ్.‘‘నా పేరు బాపూగిర్. బాబా నన్ను అలాగే పిలుస్తారు. వారు పంపగా వచ్చానిక్కడికి.’’‘‘రండి, కూర్చోండి.’’ అన్నాడు నానాసాహెబ్.‘‘ముందు ఈ ఊదీ, ఆరతి పాటా అందుకోండి. వీటిని బాబా మీకిమ్మన్నారు.’’ అన్నాడు బాపూగిర్.
అందించాడు. అందుకుని లోనికి పరిగెత్తాడు నానాసాహెబ్. పరిగెడుతున్న అతన్ని చూస్తూ అప్రయత్నంగా అక్కడి గోడగడియారం కేసి చూశాడు బాపూగిర్. పావు తక్కువ మూడయిందప్పుడు.
ఆశ్చర్యపోయాడు. రెండున్నరకి జల్‌గామ్‌లో తానున్నాడు. ఇప్పుడు పావు తక్కువ మూడయింది. అంటే పావుగంటలో జల్‌గామ్ నుంచి జామ్నేర్‌కి రాగలిగాడా? ఇదెలా సాధ్యం? జామ్నేర్‌కి జల్‌గాం ముప్పయి మైళ్ళ దూరంలో ఉంది.
ముప్పయి మైళ్ళు ప్రయాణించాలంటే, టాంగాలో ప్రయాణించినా ఎంత లేదన్నా మూడుగంటలు పడుతుంది. అంటే రెండున్నర గంటలకి తాను జల్‌గామ్‌లో టాంగా ఎక్కితే జామ్నేర్‌కి చేరుకునే సరికి అయిదున్నర గంటలవుతుంది. కాని ఇప్పుడు ఈ గడియారంలో పావు తక్కువ మూడే అయింది.
అంటే ఈ గడియారం తప్పు. ఒకవేళ ఇది తప్పు కాకుంటే అక్కడ జల్‌గామ్‌లో గడియారం తప్పయి ఉంటుంది. ఈ తప్పొప్పుల సంగతి తర్వాత ముందసలు టైం ఎంతయి ఉంటుంది? తెలుసుకోవాలనుకున్నాడు బాపూగిర్.
తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- “నానాసాహెబ్‌కి ఈ ఊదీనీ, ఈ ఆరతి పాటనీ అందించాలి. ఆ బాధ్యత నీదే.’’
- ‘‘సాయిబాబానే మీ మైనతాయిని రక్షించాడు.
- ‘‘బాపూగిర్ అని బాబా ఒక్కరే నన్ను పిలిచేది. ఇంకెవరూ నన్నలా పిలవరు.
- బాబా ఇక్కడా ఉంటారు. అక్కడా ఉంటారు.
- నానాసాహెబ్ అన్నది నా ముద్దుపేరు. ఆ పేరుతో నా తల్లిదండ్రులొక్కరే నన్ను పిలుస్తారు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments