Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
మానవజీవితానికి శ్రీసాయి సందేశాలు – 3వ.భాగం
ఈరోజు సాయి.బా.ని.స. శ్రీరావాడ గోపాలరావుగారు చెపుతున్న ఉపన్యాసం తరువాయి భాగం వినండి.
మూలం: సాయి.బా.ని.స. శ్రీరావాడ గోపాలరావు
తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు
‘ఆధ్యాత్మిక చింతన అనే నిచ్చెనను కొంతవరకూ ఎక్కిన తరువాత అక్కడే నిలబడి ఉండాలి కాని క్రిందకు జారకూడదు ‘.
ఈసందేశాన్ని మనం శ్రీసాయి సత్ చరిత్ర 21వ.అధ్యాయంలో చూడగలం. వీ.హెచ్.ఠాకూర్ తో బాబా అన్నమాటలు “ఈదారి అప్పాచెప్పినంత సులభమయినది కాదు. నానేఘాట్ లోయలో ఎనుబోతునెక్కి స్వారీ చేసినంత సులభమూ కాదు. ఈ ఆధ్యాత్మిక మార్గం మిక్కిలి కష్టమయినది. ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించాలంటే దానికి ఎంతో కృషి, సాధన, అవసరం. సరియైన పధ్ధతిలోనే ఆచరిస్తే తగిన ఫలితం లభిస్తుంది”.
‘జీవితం ఆటల పోటీ వంటిది. అందులో ముసలివారు కూడా ఎంతో ఉత్సాహంతో చిన్నపిల్లలతో కలిసి ఆటలు ఆడాలి.’
సాయి చిన్న పిల్లలతో కలిసి గోళీలాడేవారు. శ్రీసాయి సత్ చరిత్ర 29వ.అధ్యాయంలో బాబా మద్రాసు భజన సమాజం యజమాని కలలో కనపడి అన్న మాటలు – “నన్ను నువ్వు ముసలివాడిననుకొంటున్నావా? సరే అయితే నాతో పరుగెత్తి చూడు” అని అంటూ బాబా అదృశ్యమయ్యారు.
“జీవితంలో తప్పులు చేసి ఆతరువాత తాము చేసిన తప్పులు సరిదిద్దుకొని మంచి మార్గంలో నడిచేవారు అన్నం పెట్టినా దానిని కాదనకుండా స్వీకరించాలి”
దీనికి ఉదాహరణ: మొయునుద్దీన్ తంబోలీ, జవహర్ ఆలీ, సపత్నేకర్, మేఘా, సోమదేవస్వామి, వీరందరూ యిదే కోవకి చెందినవారు. మొదట్లో వీరందరూ బాబాను విమర్శించేవారు. కాని ఆఖరుకి తమ తప్పులు తెసిలిసికొని తమను తాము సరిదిద్దుకొన్నారు. బాబా వారినందరినీ ఆదరించి ఆశ్రయమిచ్చారు.
“ఈజీవితమనే నాటక రంగస్థలం మీద నీపాత్ర కొంతవరకేనన్న విషయం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఈ రంగస్థలం మీద ఎన్నో పాత్రలు వస్తూ, పోతూ ఉంటాయి. అదే జీవితం”.
దీనికి ఉదాహరణ: గొంతువ్యాధితో సపత్నేకర్ కొడుకు మరణీంచాడు. సపత్నేకర్ దంపతులను ఆదుఃఖాన్నుండి బయటపడవేయటానికి బాబా వారికి మరొక కుమారుని అనుగ్రహించారు. అలాగే రతన్ జీ షాపూర్ జీ కి 12మంది ఆడపిల్లల సంతానం తరువాత బాబా అనుగ్రహంతో మగపిల్లవాడు జన్మించాడు. ఈవిధంగా సంతానం విషయంలో మన పాత్ర పరిమితమని ఈసందేశం ద్వారా మనం గ్రహించుకోవచ్చు.
“జీవితంలో ఆధ్యాత్మికరంగంలో ప్రయాణం ప్రారంభించిన తరువాత జీవిత భాగస్వామి నీకన్నా ముందే భగవంతుని సన్నిధికి చేరితే బాధపడకుండా ఆధ్యాత్మిక మార్గంలో మరింత ముందుకు ప్రయాణించాలి. శేషజీవితాన్ని భగవన్నామ స్మరణతో గడపాలి.”
ఈసందేశాన్ని వివరించే సంఘటన మనం శ్రీసాయి సత్ చరిత్రలోని బాపూసాహెబ్ జోగ్, ఖాపర్దే దంపతుల విషయంలో గమనించవచ్చు. బాపూ సాహెబ్ జోగ్ తన భార్య మరణానంతరం సన్యాసం స్వీకరిస్తే, ఖాపర్దే తన భార్య మరణానంతరం శేషజీవితాన్ని బాబా సేవలో గడిపాడు.
“కష్టాల కడలిలో ఉంటూ జీవిత శిఖరాలపై బాధపడుతూ జీవించేకన్నా, ఆధ్యాత్మిక ప్రపంచంలోని లోయలలోను, సెలయేటి ఒడ్డున జీవించడం మిన్న.”
ఇటువంటి సందేశాన్ని బాబా పండరీపూర్ సబ్ జడ్జీ తాత్యాసాహెబ్ నూల్కర్ జీవితంలో చూడగలము. నూల్క్జర్ పండరీపురంలోని విఠలుని మందిర యాజమాన్యానికి హారతి పళ్ళెంలో వచ్చే ఆదాయానికి హక్కు లేదని మందిర యజమానులకి వ్యతిరేకంగా తీర్పునిచ్చారు.
ఆఖరికి వారితో గొడవలు పడి మనశ్శాంతిని కోల్పోయి తన పదవికి రాజీనామా చేసి షిరిడీలో తన శేషజీవితాన్ని ప్రశాంతంగా గడిపాడు. నూల్కర్ మరణించిన రోజున బాబా శోకంతో అన్నమాటలు “తాత్యా మనకంటే ముందుగానే వెళ్ళిపోయెనే. అతనికిక పునర్జ్మ లేదు” అన్న మాటలను మనం గుర్తు చేసుకొందాము.
“జీవితం పెద్ద నది కానవసరం లేదు. అది ఒక పారే చిన్న ఏరుకావచ్చును. ఆఖరికి ఆచిన్న ఏరుకూడా సముద్రంలో కలవవలసిందే”.
ఈ సందేశానికి సంబంధించి మేఘశ్యాముని జీవితమే ఒక ఉదాహరణ. అతను చదువుకున్నవాడు కాదు. పేదవాడు. కాని, తన జీవితమంతా బాబా సేవలోనే గడిపాడు. అతను చిన్న వయసులోనే మరణించాడు. మేఘుడు మరణించినపుడు బాబా అన్నమాటలు “అతను నా నిజమయిన భక్తుడు”. బాబా దగ్గరుండి అతని అంతిమ సంస్కారాలను జరిపించారు.
(ఇంకా ఉంది)
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments