శ్రీ సాయిలీలామృతధార – శ్రీ సాయి దర్శనం



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

శ్రీ సాయిలీలామృతధార – శ్రీ సాయి దర్శనం

ఈ రోజు సాయిలీల మాసపత్రిక ఫిబ్రవరి, 1975 వ సంవత్సరంలో ప్రచురింపబడిన మరొక అద్భుతమైన సాయి చమత్కారాలను చూద్దాము.

బెల్గాం దగ్గర హిడ్ కల్ డ్యామ్ దగ్గర నేను నా ప్రాణ స్నేహితునితో కలిసి ఉంటున్నాను. అతను బ్రాహ్మిన్. అతని వల్లనే నాకు 1967వ సంవత్సరం డిసెంబరులో సాయిని పూజించడానికి ప్రేరణ కలిగింది.

మొదటిసారిగా నేను గురుచరిత్ర వారం రోజులు పారాయణ చేసి, అనుకున్న ప్రకారమే గురువారం నాటికి పూర్తి చేశాను. అదే రోజు రాత్రి నాకు కలలో బాబా దర్శనమిచ్చి, మరుసటిరోజు ఇంటర్వ్యూకి వెళ్ళమని ఆదేశించారు. బాబా నేను చేసే పూజను, నా నమ్మకాన్ని స్వీకరించారని నాకు వచ్చిన కలను బట్టి గ్రహించుకున్నాను.

మరుసటి రోజు శుక్రవారం.  ఉదయాన్నే యథావిధిగా నా కార్యక్రమాలన్నిటినీ పూర్తి చేసుకుని శివాలయానికి వెళ్ళి వచ్చాను. నేను వచ్చేటప్పటికి ఒకతను నేను ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ఒక పరిచయ పత్రం తీసుకుని వచ్చి నాకోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. ఎటువంటి నియమ నిబంధనలు (ఫార్మాలిటీస్) లేకుండానే నాకు ఉద్యోగం వచ్చింది.

నేను ఇంతకు ముందు చేసిన ఉద్యోగంతో పోల్చుకుంటే ఈ కొత్త ఉద్యోగం అంత ఆకర్షణీయంగా ఏమీ లేదు.  దానివల్ల నా మనసుకు తృప్తి లేకపోయింది. వీటిని తట్టుకునే ధైర్యాన్ని ప్రసాదించమని సాయినాథుని ప్రార్థించాను.

నేను సాయిని పూజించే పధ్ధతి కూడా చాలా సామాన్యంగానే ఉంటుంది. ఎప్పుడూ ఆయన నామాన్ని స్మరించుకుంటూ, ఆయన రూపాన్ని గుర్తుంచుకుంటూ ఉంటాను అంతే. ఈ పధ్ధతివల్ల నా ఆలోచన విధానాలు మారి, నా మనసు పరిశుధ్ధపడి, నా మానసిక పరిస్థితి ప్రశాంతత పొందింది.

సాయి ప్రేరణతో నాలో ఉన్న సందేహాలన్నిటినీ ప్రక్కన పెట్టి, క్రొత్త ఉద్యోగంలో మనసు పెట్టి శ్రధ్ధగా పని చేయసాగాను. నా నిరంతర ప్రయత్నం వల్ల ప్రాథమికంగానే ఎక్కౌంటింగ్ (ఖాతాల నిర్వహణ) లో నా నేర్పరితనానికి సంస్థలో మంచి గుర్తింపును తెచ్చుకున్నాను.

నల్ల పిల్లి రూపంలో బాబా నైవేద్యాన్ని స్వీకరించుట:

మూడు నెలల తరువాత నా వివాహం నిమిత్తమై కేరళ వెళ్ళాను. పెళ్ళికి ముందు నేను ఉంటున్న ఊరిలోనే పారాయణ మరొక సప్తాహం చేశాను.  ఆఖరిరోజున నా స్నేహితులని, బంధువులని అందరినీ ఆహ్వానించాను.

ఆరతికి అన్ని ఏర్పాట్లు చేసినప్పుడు, సాయి ఫోటో ముందు ఒక నల్ల పిల్లి వచ్చి, సాయికి సమర్పించిన నైవేద్యాన్ని ఒక్క గుటకలో మింగేసి మాయమయిపోయింది. ఆ దృశ్యం, ఆ చమత్కారం చూసి అక్కడున్న వారందరూ చాలా ఆశ్చర్యపోయారు.

మొదటిసారిగా అనుభవించిన ఈ ఆధ్యాత్మికానుభూతిని వారందరూ అందరితోనూ పంచుకుని ఎంతో ఆనందాన్ని పొందారు. అన్ని ప్రాణులలోను సాయి ఉన్నారనే విషయాన్ని ఈ సంఘటన ద్వారా సాయి మహిమను వీక్షించి ఆనందాశ్చర్యాలను పొందారు.

నా పుట్టిన రోజునాడు సాయి పాముగా దర్శనమిచ్చుట

రోజు రోజుకి సాయి మీద నా భక్తి పెరగసాగింది. 1969వ సంవత్సరంలో నా పుట్టిన రోజునాడు, సాయి మంత్రాన్ని జపిస్తూ నా భార్యతో కలిసి సాయి ఫోటోకి ఆరతినిస్తున్నాను. అప్పుడు అక్కడ సాయి వచ్చి ఉన్నారనే భావన కలిగింది.

అదే సమయంలో సాయి ఫోటో ముందు బంగారు రంగులో మెరుస్తున్నట్లుగా ఏదో కనిపించింది. మా దృష్టి అటువైపు మళ్ళింది. అది ఆరు అంగుళాల పొడవున్న పాము. నా ఆనందానికి అంతులేదు. ఆ సాయి లీలను చూసిన నా భార్యకి నోట మాట లేదు.

పాముకి కాసిని పాలు తెమ్మని చెప్పాను. నా భార్య పాలు తీసుకురాగానే దానికి సమర్పించాము. కొద్ది నిమిషాలలోనే అది మాయమయిపోయింది.  నాలోని నమ్మకాన్ని, భక్తిని ఆయన ఆవిధంగా గుర్తించారు. అప్పటినుండి సాయి భక్తులందరికీ నా చిన్న పూజా గది  ఒక పూజనీయ స్థలంగా మారిపోయింది.

యజ్ఞాలు నిర్వహించడానికి వచ్చిన ఒక సాధువు ఇవి సాయినాథులవారు చూపించిన అపూర్వమైన, అరుదైన సన్నివేశాలని తెలియచేశారు.

కె.ఆర్.   గోపీనాధ్, బీ.కామ్

హుబ్లి, కర్ణాటక

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “శ్రీ సాయిలీలామృతధార – శ్రీ సాయి దర్శనం

Maruthi

Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba.Sri SaiBaba leelalu adbhutham.

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles