Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
శ్రీ సాయి దర్శనం – రక్షించువాడను నేనే
బాబాగారు తాము జీవించి ఉన్నప్పుడు తన భక్తులెందరికో తన లీలలను చూపించారు, అలాగే తాను షిరిడీలోనే ఉండి ఎక్కడో దూరంగా ఉన్న తన భక్తులకు దర్శనం కూడా ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆయన సమాధి అనంతరం కూడా తన భక్తులకు దర్శనాలను ఇచ్చిన అద్భుతమైన సంఘటనలు కూడా మనకందరకూ తెలుసు.
ఈ రోజు, మొట్టమొదట భగవంతునిపై నమ్మకం లేని వ్యక్తి బాబా మార్గంలోకి ఏవిధంగా వచ్చాడో అతనికి బాబా తన దర్శన భాగ్యాన్ని ఏవిధంగా కలిగించారో చదవండి. ఈ అద్భుతమైన లీల సాయిలీల పత్రిక నవంబరు – డిసెంబరు 2003 వ.సంవత్సరం సంచిక నుండి గ్రహింపబడింది.
నేను సాయి భక్తుడిగా ఏవిధంగా మారానో నా అనుభవాలే తెలుపుతాయన్నదే నా అభిప్రాయం. నా ఈ అనుభవాలను చదివిన పాఠకులు కూడా బాబా పై భక్తిని మరింతగా పెంచుకుంటారనే నమ్మకం నాకుంది.
బాల్యంలో ఉండగా నాకు దేవుడంటే నమ్మకం ఉందేది కాదు. దేవుని మీద నాకు నమ్మకం లేకపోవడంపై నాకున్న ఆలోచనలకి మానాన్నగారు నామీదెప్పుడూ కోపగించుకుని పరుషంగా మాట్లాడలేదు. నా ఆలోచనా పధాన్ని మార్చడానికి, ఆయన తెలివిగా తన స్నేహితుల ద్వారా ప్రయత్నించారు. వారంతా నాకు సహాయం చేయడానికి వచ్చారు.
వారు, తమకి వృధ్ధాప్యం వచ్చిందనీ, అందువల్ల తమకు కాస్త మత గ్రంధాలను, పురాణాలను చదివి వినిపించమని నన్నడిగారు. దాని ఫలితమే భగవంతుని గురించి, సాకార, నిరాకార విషయాల మీద నా అభిప్రాయాలలోమార్పు వచ్చింది. నా జీవితంలో భగవంతునిపై నమ్మకం లేని రోజులలో పాలరాతి భగవంతుని విగ్రహాలని వట్టి రాతి విగ్రహాలుగా భావించేవాడిని. ఇపుడు ఆవిగ్రహాలే నాజీవిత పరమావధిగాను, ప్రేరణగాను మారాయి.
అది 1927 వ.సంవత్సరం, అపుడు నాకు 16 సంవత్సరాల వయస్సు. పాఠశాలలో చదువుకుంటున్న రోజులవి. గుజరాత్ లోవచ్చిన భయంకరమయిన వరదల్లో చిక్కుకున్నాను. ఆసమయంలో నేను మానాన్నగారితో బరోడాలో ఉన్నాను.
వెల్లువెత్తుతూ వస్తున్న వరదలు పట్టణాన్ని రెండు భాగాలుగా చేసి ప్రవహింపసాగాయి. మా నాన్నగారు, నేను ఒకవైపున ఉన్నాము, మా అమ్మమ్మగారు, మా తమ్ముడు రెండవ వౖపున ఉన్నారు. నదిపై ఎత్తుగా ఉన్న వంతెన మీదుగా నేను మా నాన్నగారు వెళ్ళడానికి ప్రయత్నించాము. కాని అక్కడ కాపలాగా ఉన్న పోలీసులు మమ్మల్ని వెళ్ళనివ్వలేదు.
ఎలాగయితేనేం మేము నీటిలోకి దిగి నడవసాగాము. నీళ్ళు నామెడ దాకా వచ్చి నీటిలో చిక్కుకుపోయి వెనక్కు వెళ్ళలేని పరిస్థితిలో ఉండిపోయాము. అది జీవన్మరణ సమస్య. ఆసమయంలో తలకు రుమాలు కట్టుకుని, బాగా పెరిగిన గడ్డంతో 7అడుగుల పొడవు ఉన్న ఒక వ్యక్తి మా వైపు చూస్తూ ఎక్కడయితే ఉన్నారో అక్కడే నిలబడి ఉండండని అరుస్తూ అన్నాడు.
ఆ వ్యక్తి వరద నీటిలో నడచుకుంటూ మా దగ్గరకు వచ్చి మమ్మల్ని సురక్షితంగా అవతలి వైపుకు మా చేయిపట్టుకుని నడిపించుకుంటూ తీసుకొని వెళ్ళాడు. అప్పటికే అక్కడ మా అమ్మమ్మగారు, మా తమ్ముడు మాకోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు.
మమ్మల్ని ఆ వరద నీటిలో నడిపించుకుంటు క్షేమంగా చేర్చిన వ్యక్తి కోసం అంతటా వెతికాము కాని ఎక్కడా అతను కనిపించలేదు. నేను చాలా ఆశ్చర్యానికి లోనయ్యి అతను కనపడతాడేమోననే ఆశతో ఎంతగానో ప్రయత్నించాను కాని ఎక్కడా అతని జాడ లేదు. నా జీవితంలో 1927 వ.సంవత్సరంలో శ్రీసాయిబాబా నాకు మొట్టమొదటగా ఇచ్చిన ఆధ్యాత్మిక దర్శనం అది.
1943 వ.సంవత్సరంలో మా పెద్ద కుమార్తెకి టైఫాయిడ్ తిరగబెట్టి 42 రోజులు బాధపడింది. ముగ్గురు వైద్యుల బృందం పరీక్షించి అది చాలా ప్రాణాంతకమయినదని నిర్ధారించారు. 41 వ.రోజున వారంతా ఇక దేవుడే రక్షించాలి మనం చేయగలిగిందేమీ లేదని చెప్పారు.
ఆ సమయంలో బరోడాలో ఉన్న నాస్నేహితుడికి తెలిసిన ఒక వృధ్ధుడు చెన్నై నుండి మమ్మల్ని చూడటానికి రావడం తటస్థించింది. ఆయనకు గడ్డం ఉంది. ఆయన మా అమ్మాయిని చూసి ఏమీ భయపడవద్దని అన్నారు. నా జీవితంలో ఇటువంటి విపత్కర పరిస్థితిలో ఆయన నోటంబట ఈ మాటలు విని నాకాశ్చర్యం వేసింది. కాని ఆయన నాకెంతో నచ్చ చెప్పి నాలోని భయాన్ని పోగొట్టాడు.
ఆయన వెళ్ళిపోయిన తరువాత ఆరోజు రాత్రి మా అమ్మాయికి కలలో శ్రీసాయిబాబా దర్శనమిచ్చారు. ఆ తరువాతనించి ఆమె ఆరోగ్యం మెరుగవసాగింది. నేను బరోడాలో ఉన్న నా స్నేహితుణ్ణి, మమ్మల్ని చూడటానికి వచ్చిన వృధ్ధుడి గురించి వాకబు చేశాను కాని ఆయన వివరాలేమీ తెలియలేదు. ఆ వృధ్ధుని రూపంలో వచ్చి భయపడవద్దని నాకు దైర్యాన్ని ప్రసాదించినది శ్రీసాయిబాబా తప్ప మరెవరూ కాదని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఆ విధంగా నాకు శ్రీసాయిబాబా రెండవసారి దర్శనమిచ్చారు.
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- శ్రీ సాయిలీలామృతధార – శ్రీ సాయి దర్శనం
- శ్రీ షిరిడీ సాయి వైభవం – అందరి హృదయాలను పాలించువాడను నేనే
- రాంబాబు గారికి దీపావళి రోజు శ్రీ కృష్ణా, వినాయక స్వామి గా బాబా దర్శనం–Audio
- నీ రాధాకృష్ణుణ్ణి నేనే! నేనే నిన్నిక్కడకి రమ్మన్నాను. సేవించుకుంటావో, సాధిస్తావో అంతా నీ ఇష్టం.’’
- శ్రీ సాయి దత్తావతారం రెండవ బాగం – శ్రీ గాడ్గే మహరాజ్ ని శ్రీ సాయి అనుగ్రహించుట
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments