Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
మా అమ్మకి ఒంట్లో బావుండక (కిడ్నీలు పాడయితే అప్పటికి ఒక కిడ్నీ అక్క ఇచ్చింది) వారానికి ఒక సారి బస్సు ఎక్కించి హాస్పిటల్ కి తీసుకువెళ్లడం, ఆవిడ బస్సు ఎక్కలేక అవస్థ పడటం,
బస్సు ఎక్కేటప్పుడు తోటి ప్రయాణీకులు తిట్టడం , ఎంత సేపు అంటూ విసుక్కోవడం చూసాక నాకు బాధ అనిపించింది,
ఆలా కాకుండా ఒక కారు ఉంటే అమ్మను కారులో హాస్పిటల్ కి తీసుకు వెళ్ళవచ్చు అనిపించింది.
తిన్నగా వైదేహి నగర్ బాబా మందిరానికి వెళ్ళాను, కింద సెల్లారులో పెద్దదైన బాబా ఫోటో ఒకటి ఉంది, ఆ ఫోటో ముందు నిలబడి బాబాతో నా ఈ బాధను చెప్పాను,
ఇంకా పూర్తి అయ్యిందో లేదో నా భుజం మీద ఒక చెయ్యి నన్ను తడుతోంది, వెనక్కి తిరిగి చూసాను, నాకు పరిచయం ఉన్న మనిషే! నేను మీతో మాట్లాడాలి అన్నాడు.
” ఏంటో చెప్ప మన్నాను ” ” బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం” అన్నాడు. ఫరవాలేదు ఇక్కడే చెప్పండి అన్నాను.
ఏం లేదండి ”! మా ఆఫీసులో వాళ్ళందరూ లోన్లు పెట్టి కార్లు తీసుకుంటుంటే నాకు తీసుకోవాలనిపించి నేను కూడా ఒక కారు తీసుకున్నాను. కొత్తది 30 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది.
ఇంటికి తీసుకువచ్చాక మా వాళ్ళు నన్ను తిడుతున్నారు, ఇప్పుడు కారు అవసరమా? అంటున్నారు. అందుకని ఆ కారు మీరు తీసుకుంటారా? అన్నాడు.
నా ఆనందానికి అవధులు లేవు. నేను ఇంకా బాబా కి చెప్పుకొని 30 సెకండ్లు కూడా కాలేదు. ఈ లోగా నా కోరిక తీర్చడానికి రెడీ గా ఉన్నాడు బాబా ! ”ఎంత ఇమ్మంటారు” అన్నాను.
” ఏం అక్కరలేదు ” అన్నాడు. అతనలా అన్నాక నేను మరీ ఆశ్చర్య పోయాను.
అతను పరిచయమే కానీ పెద్దగా తెలియని వ్యక్తి ! చివరికి మీరు కారు తిప్పుకోండి నాకు నెలకి వెయ్యి రూపాయలు ఇవ్వండి అన్నాడు.
నాకు పెద్దగా డ్రైవింగ్ కూడా రదప్పటికీ అయినా, కారు తీసుకువచ్చి ఇంటి ముందు ఉంచాడు. అపోలో హాస్పిటల్ కి రోజూ అమ్మని కారులో తీసుకెళ్లే వాడిని.
4 నెలల తర్వాత ఆ కారు అమ్మే పరిస్థితి అతనికి వచ్చి, కారు తీసేసుకున్నాడు.
నాకేమో కారు బాగా అలవాటు అయిపోయింది. నేను మళ్ళీ కారు కొనే ఆలోచనలో పడ్డాను.
బాబా ఎలా? అనుకున్నాను ఇంతలో HSBC బ్యాంకు వాళ్ళు కార్ లోన్ ఇస్తున్నారని తెలిసి 50 వేల రూపాయలు కట్టేసి కార్ తెచ్చుకున్నాను.
2009 సెప్టెంబర్ 2 వ తారీకు వై స్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన రోజు, అమ్మకి బాగా సీరియస్ అయింది.
నేను యశోద హాస్పిటల్ లో చూపించడానికి అపోలో హాస్పిటల్ నుండి పర్మిషన్ తెచ్చుకున్నాను.
చాలా క్రిటికల్ గా ఉంది అమ్మ కండిషన్ 2 , 3 రోజులకి ఒకసారి డయాలిసిస్ చేస్తున్నారప్పటికీ, ఒక నెల కంటే బ్రతకదని 2 సం|| ల ముందే చెప్పేసారు.
ఆ రోజు 133 వ డయాలిసిస్ జరిగింది , లక్షలు ఖర్చు అయిపోతున్నాయి నేను ఇంట్లో ఎవరికీ చెప్పలేదు డబ్బు విషయం.
పల్స్ పడిపోయింది కావాల్సిన వాళ్ళని పిలుచుకోండని చెప్పేసారు ” నేను బాబా ని తలచుకొని ఏం కాదు డాక్టర్ గారూ! మీరు డయాలిసిస్ చేయండి అన్నాను .”
”పల్స్ అందడం లేదంటుంది ఆవిడ, మీరు చేయండి అంటూ చెప్పి ” ఎప్పటిలాగే నేను ఇంటికి వచ్చేసాను.
డయాలిసిస్ చేయడానికి 2 గంటల సమయం పడుతుంది అందుకని నేను అమ్మని హాస్పిటల్ లో దింపి ఇంటికి వచ్చి తిరిగి 2 గంటల తర్వాత వెళ్లడం చేస్తుంటాను.
వస్తూ వస్తూ దారిలో ”బాబా !అమ్మని తీసుకు పో, బాబా! ఆమె బాధని చూడలేక పోతున్నాను” అని అనుకొని
మళ్ళీ వెంటనే ” వద్దు బాబా ! ఇప్పుడే వద్దు నేను మొదటి సారిగా ఇంట్లో నీ భజన పెట్టుకుంటున్నాను, అది కాస్తా అమ్మ చూసాక అప్పుడు తీసుకు పో బాబా !” అని గట్టిగా అరిచి మరీ చెప్పాను.
డయాలిసిస్ ఆ రోజు ముగిసింది ఆ తర్వాత మూడవ రోజు మరో డయాలిసిస్ కూడా అయ్యింది, ఆలా ఇంటికి తెస్తున్నాను, మూడవ రోజు మళ్ళీ తీసుకువెడుతున్నాను.
” ఏం చేసి తీసుకువస్తున్నావయ్యా! మీ అమ్మని ”అని అడిగింది డాక్టర్. చివరికి 40 లక్షలు ఖర్చు అయ్యింది. ఎటువంటి రెస్పాన్స్ లేని బాడీ కి డయాలిసిస్ చేసారు.
ఇప్పటికి కూడా ఆశ్చర్యమే 2 సంవత్సరాల క్రితమే ఒక్క నెల కూడా ఉండదు అన్న మనిషి 2 సంవత్సరాల కాలం ఆలా ఉండటమే ఆశ్చర్యం, అయితే పల్స్ కూడా అందని పేషెంటుకి డయాలిసిస్ చేయడం మరో విచిత్రం.
ఈ రెండు సంవత్సరాలలో 8 మంది చనిపోయారు ఆ డాక్టర్ కి వచ్చిన కేసులలో, ”నీ సంకల్పం ఏమిటో ? నువ్వు ఏ దేవుణ్ణి పూజ చేస్తున్నావో కానీ ఆమె అలా బ్రతుకుతోంది ” అన్నారు డాక్టర్స్.
మా ఇంట్లో పూజ, భజన మొదలైంది. అంతకు ముందు బాబా నాకు ఒక ప్రామిస్ చేసారు అదేమంటే ” నేను మీ ఇంటికి వస్తాను ” అని.
అదెలాగా అంటే ఒక చోట నేను భజన చేస్తున్నాను, ఆ భజనకి చాలా మంది వచ్చారు, ఆ ఇంటి వాళ్ళు పిలుచుకున్నారు.
అందులో ఒకాయన పేరు పాండురంగా రావు. ఆయన బ్లడ్ బ్యాంకులో పని చేస్తాడు.
నేను భజనలో ” పాండురంగా హరి విఠలా” అంటూ ఒక పాట పాడాను.
చాలా తన్మయత్వంతో పడుతున్నాను, ఇంతలో ఆ చివర ఎక్కడో కుర్చున్నారాయన (పాండురంగా రావు) భజన మధ్యలోకి వచ్చి అడ్డంగా పడుకొని తన్మయత్వంతో ఊగుతున్నాడు.
పాట అయిపోయింది , ” మళ్ళీ ఆ పాట పాడు భాను అన్నాడు ”, నేను పాడాను.
అయిన తర్వాత ”మళ్ళీ పాడు భాను ” అన్నాడు. అందరూ బాబా వచ్చాడు ”బాబా వచ్చాడు ” అంటున్నారు.
నాకు అలాంటివి అప్పటిదాకా తెలియదు. నేను పాడుతున్నాను, ఆయన ఏడుస్తున్నాడు,
భజన అయిపోయిన తర్వాత, ఆయన మీదకి బాబా వచ్చారని అందరూ అంటున్నారుగా ఆయన్ని తీసుకువెళ్లి ఒక రూములో పెట్టారు.
ఆయన్ని అందరూ ప్రశ్నలు అడుగుతున్నారు. ఆయన ఏవో సమాధానాలు చెపుతున్నాడు అలా ఇంతకు ముందు కూడా ఆయనకీ, జనాలకి అలవాటట.
అది నాకు తెలియదు, ఉన్నట్లుండి ఆయన ‘ఇందాక పాడాడే వాడిని పిలవండి అన్నాడట’.
నేను భజన అయిపోగానే బయటకి వచ్చేస్తాను, నిన్ను బాబా పిలుస్తున్నారు అంటే లోపలకి వెళ్ళాను.
” ఇందాక పాడిన పాట ఎక్కడ నేర్చుకున్నావు రా?”అన్నాడు పాండురంగా రావు, ఆయన్ని అందరూ బాబా అంటున్నారు.
నాకయితే ఆ విషయం తెలియదు కానీ అందరూ అంటున్నారని నేను అనాలి కదా అందుకని ”నువ్వు నేర్పావు గా బాబా ”అన్నాను .
ఇంకోసారి పాడమన్నాడు నన్ను బాబాయే అడుగుతున్నాడన్న భావంతో పాట మొదలు పెట్టాను.
రెండు చరణాలు పాడి ఇంకా పాడలేక గొంతు పూడుకుపోయింది . ఆపేసాను ,
” చాలా బావుందిరా ఏం కావాలి రా నీకు ” అన్నాడు , నాకేమి వొద్దు బాబా అన్నాను.
నా పక్కనే మా ఆవిడ దీప ఉంది, తనని అడిగాడు నీకేం కావాలి? అని , ” నాకేమి వొద్దు బాబా” అంది దీప .
”నన్ను ఎంతో మంది ఎన్నో అడిగారు, మీరిద్దరే ఏం అడగలేదు ఏదయినా అడగండి ” అన్నాడు.
మేమిద్దరమూ ”మాకేమి వద్దు బాబా! మీరు మాతో ఉండండి చాలు” అన్నాము.
నేను మీ ఇంటికి వస్తానన్నాడు , సరే బాబా తప్పకుండా రండి మళ్ళీ నెలలో భజన ఉంది, ఆ రోజుకి తప్పకుండా రమ్మని చెప్పాము .”
వస్తాను ! ఏం పెడతావు !”అని అడిగాడు. మీకేమి కావాలో అది పెడతాను అంది దీప.
” నాకు బెల్లం వేసిన గోధుమ రవ్వ పరమాన్నం పెడతావా” అన్నాడు ,’ తప్పకుండా పెడతాము బాబా ‘ అన్నాము.
దాదాపు అక్కడ ఉన్న వారంతా ఏడుస్తూనే ఉన్నారు, అదీ జరిగింది.
అమ్మకి బాగా లేదు భజన మొదలైంది బాబా వస్తానన్నాడు ఏ రూపంలో వస్తాడు? ఎలా వస్తాడు?
ఇదే నా ఆలోచన క్రిందటి నెలలో మా ఇంటికి వస్తానన్నాయన కి (పాండు రంగా రావు) ఫోన్ చేశాను ”వస్తున్నారా?” అని అడిగాను (మా ఇంటికి వస్తాను అన్నది ఆయన కాదు బాబా),
“నేను వస్తాను, మా ఇంటికి కారు పంపించు” అన్నాడు నా కేదో తేడాగా అనిపించింది.
బాబా అయితే ఆయనకీ ఎటువంటి వాహనాలు అవసరం లేదు, మరి ఈయనేంటి కావాలి అంటున్నాడు ఛ! ఈయన బాబా కాదు అనిపించింది .
”నువ్వేదో రూపం లో వస్తావు నేను వెయిట్ చేస్తాను” అనుకున్నాను, భజన మొదలైంది. ఈ లోగా ఒక స్వామిజీ వచ్చారు.
ఆయన భజన పాడుతూ తన పాటకి అనుగుణంగా తబలా అతన్ని వాయించమని సైగ చేస్తే, అతను కూడ తాను సరిగ్గా వాయిస్తున్నట్లుగా సైగ చేసాడు.
ఆ సైగను ఆయన వేరే విధంగా అర్ధం చేసుకొని చాలా హంగామా చేసి వెళ్ళిపోయాడు.
” బాబా నువ్వు ఈయన రూపంలో వచ్చి హంగామా చేసి వెళ్లిపోయావా”? అని అనుకున్నాను.
12 గంటలకి (రాత్రి) హారతి అయిపోయింది, భజన అప్పుడు ఎవరో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి 10 : 30 గంటలకి ఒక భార్యా భర్తలు ఇక్కడ భజన జరుగుతోందని ఎవరో చెప్పారట తిన్నగా మా ఇంటికి వచ్చారు.
ఆ భార్యా భర్తలు మాకు ఎవరో తెలియదు, వాళ్ళ రూపంలో బాబా వచ్చాడా? అని అనుకున్నాను.
వాళ్ళు భజనవ్వగానే వెళ్లిపోయారు, భోజనాలు అయ్యాక ఒంటి గంట సమయానికి కాసేపు పడుకున్నాను.
కాసేపటికి అన్నయ్యా అంటూ మా స్టూడెంట్ అక్క గట్టిగా అరిచినంత పని చేసింది.
అన్నయ్యా బాబా వచ్చాడంటూ, నా స్టూడెంట్ అక్క నన్ను లేపింది (నా తో భజన లో మా స్టూడెంట్స్ పాల్గొంటూ ఉంటారు) భజన ఆలస్యం అయ్యేసరికి అందరూ అక్కడే ఉన్నారు.
లాప్ టాప్ లో ఫోటోలు చూస్తున్నారట. అందులో భజన అనంతరం బాబాకి ఇచ్చిన హారతిలో బాబా కనపడ్డాడు.
నేను ఉదయం నుండి ఎదురు చూస్తున్న బాబా ఈ విధముగా వచ్చాడా అనుకుంటూ అందరం ఏడ్చేసాము.
అమ్మ కూడా భజనలో పాల్గొంది. పల్లకి సేవలో కూడా పాల్గొంది.
3 , 7 తారీకులు అమ్మని తీసుకొని డయాలిసిస్ కి వెళ్ళాను. 8 వ తారీకున నేనే బాబా ని అడిగాను, బాబా ఇక అమ్మని తీసుకెళ్ళిపో అని.
సాయంత్రానికి అమ్మలో చలనం లేదు, మా అమ్మమ్మ గుర్తుకు వచ్చింది. అమ్మమ్మ కి అమ్మ ఒక్కతే కూతురు. ఆమెకి అమ్మని చూపించాలి అనిపించింది అంతే,
” బాబా! అమ్మమ్మ ని తీసుకు వస్తాను అందాక అమ్మని ఉంచు ,” అంటూ బయటికి వెళ్ళిపోయాను.
అమ్మమ్మని తీసుకొని వచ్చేసాను, అందాక అమ్మ ఉంది అందర్నీ చూసుకుంది.
సాయంత్రం అవ్వంగానే ఇక ” అయిపోయింది”.
నాకు చాలా హ్యాపీ గ ఉంది నేను చాలా సంతోషం గా ఉన్నాను నేను ఎలా చెపితే ఆలా, నేను పిల్లలకి ఎలా హోమ్ వర్క్ చెబితే పిల్లలు ఏలా చేస్తారో బాబా కూడా ఎలా చెబితే అలా చేసాడు.
The above miracle has been typed by: Mrs. Rajarajeswari Sainathuni
Latest Miracles:
- ఈ మధ్య నేను బాబా ను నమ్ముకున్నాను , అప్పటి నుండే నాకు ఈ భోగం
- కారు గుద్దగానె నేను బాబా బాబా బాబా …అంటూ బాబా నామం చెబుతూ సృహ కోల్పోయాను.–Audio
- మార్గమద్యములో కారు ఆగిపోతే, విమాన మార్గము ద్వారా గమ్యము చేర్చుట.
- ఆ రోజు బాబా నన్ను కాపాడి ఉండకపోతే ఈ రోజుకి నేను లేను.
- చిన్ని నా బొజ్జకు …..సాయి@366 డిసెంబర్ 17….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments