బాబా ధైర్యాన్నిస్తారు



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

బాబా ధైర్యాన్నిస్తారు

జీవితంలో మానవుడికి కష్టాలు, సమస్యలు సహజం. మన పూర్వజన్మలో మనం చేసుకున్న పాప పుణ్యాలను బట్టే ఈ జన్మలో మన జీవితం గడుస్తుంది.  ఎవరి జీవితం వడ్డించిన విస్తరి కాదు.  జీవితం వడ్డించిన విస్తరిలా కలిగివున్నవాడికయినా కొన్ని కొన్ని కష్టాలు, సమస్యలు తప్పవు.  వీటినుండి బయటపడటానికి ఒక్కటే మార్గం.  అదే నిరంతరం భగవన్నామస్మరణ. భవబంధాలనుండి, భవసాగరాన్ని సులువుగా దాటించేది ఆ భగవన్నామస్మరణే.

ఈ రోజు ఒక సాయి భక్తురాలైన విజయ గారు తమ అనుభవాన్ని ఈ-మెయిల్ ద్వారా పంపించారు.  ఆమె పంపించిన ఈ-మెయిల్ ని యథాతథంగా ప్రచురిస్తున్నాను.  మన సమస్యలకి సమాధానాలు శ్రీసాయి సత్ చరిత్రలో లభిస్తాయి కదా! అలాగే  సమస్యలకి సైట్లో సమాధానాలు దొరికి ఉపశమనం కలిగితే అంతకన్నా కావలసిన ఆనందం ఏముంటుంది?  బాబా ఆమెకి ప్రతిక్షణం తోడూ నీడగా ఉండి శుభాశీస్సులు కలుగచేయాలని ప్రార్ధిస్తున్నాను.

ఓం సాయిరాం

సర్వం సాయిమయం. బాబా సమాధి చెందక ముందు తమ భక్తులను కంటికి రెప్పలాగ కాపాడినట్లే, సమాధి చెందిన తరువాత కూడా అనుక్షణం తమ భక్తుల వెంట ఉండి అనేక ప్రమాదాల నుంచి కాపాడుతూ వస్తున్నారు. బాబాగారు చూపించే వాత్సల్యానికి, ప్రేమకి కొలమానం లేదు. ఎన్నో జన్మల పుణ్యం ఉండటం వల్లనే వాటిని  పొందగలుగుతున్నాము. బాబా నా జీవితములో చూపిన చిన్న లీల మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

బాబా గారికి తమ భక్తుల మనసులో మెదిలే ప్రతి ఆలోచన తెలుసు. వాటికి అనుగుణముగా వారు నిదర్శనాలు చూపిస్తూ ఉంటారు. దానిని బట్టి భక్తులకి బాబా తమతో పాటే ఉన్నారని ఎంతో ఆనందాన్ని అనుభవిస్తుంటారు. అలాంటి వారిలో నేను ఒక్కదాన్ని.

నేను కష్టాలలో ఉండి నిరాశకు లోనయినప్పుడు బాబా గారు ఏదో ఒక రూపములో గాని లేదా సలహా ద్వారానో లేదా తమ లీలలు చదివించడం ద్వారా ఇలా ఎన్నోరకాలుగా మార్గం చూపించి కావల్సినంత ధైర్యాన్ని నింపేవారు. నేను వెబ్ సైట్ లో సాయి లీలలు ఎప్పుడూ చదువుతూ ఉంటాను. ఎప్పుడన్నా నిరుత్సాహనికి లోనయినప్పుడు సైట్ లో చూస్తాను. నా మనసులో మెదిలే ఆలోచనకి బాబా గారి సమాధానం దొరికేది. ఆ సమాధానమే నాలో ఎంతో ధైర్యాన్ని నింపేది.

డిసెంబర్ 2014 లో నేను చాలా సమస్యలలో ఉన్నాను. జీవించడం ఎందుకు? అని ఒక ప్రశ్నగా మారింది.ష్టాలు తట్టుకొలేక శిరిడీ వెళ్ళడం జరిగింది. బాబా దారి చూపిస్తారేమో అని ఆశతో వెళ్ళాను. నాకు ఎలాంటి సమధానం దొరకలేదు. ఆ 4 రోజులు అన్నీ మరిచిపొయి ఎంతో ఆనందాన్ని పొందాను.

శిరిడీ నుంచి తిరిగి వచ్చాక రాత్రి కలలో బాబా గారు కనిపించి, “దీక్ష తీసుకొని మాల వేసుకో! ఇంకొన్ని సమస్యలు చుట్టుముట్టబోతున్నాయి, మాల వేసుకొవడం వలన చాలా సమస్యల నుంచి బయటపడగలవు” అని సలహా  ఇచ్చారు.

నేను మాల వేసుకోవడం మా ఇంట్లో ఒప్పుకోరు. ఆడపిల్ల, అందులోనూ పెళ్ళికావల్సిన పిల్ల మాల వేసుకొవడం ఏమిటి అని మా అమ్మ తిట్టేది. దానికి భయపడి నేను ఇంట్లో చెప్పలేదు. మనసులో ఇదే ఆలోచన మెదులుతూ ఉండేది. బాబాగారు చెప్పినట్టే అనేక సమస్యలు మీద పడ్డాయి. నా పరిస్థితుల్లో ఇంకెవరన్నా ఉంటే ఆత్మహత్య చేసుకునేవారు. నాకూ అలానే అనిపించింది.

బాబా కలలో కనిపించి, జీవితములో కష్టాలు ఎన్నో వస్తాయి, చనిపోవాలని ఆలోచించడం తప్పు, ఎప్పుడూ పాజిటివ్ గా  ఆలోచించాలని చెప్పారు. కొన్ని రోజుల తరువాత కొన్ని సమస్యల నుంచి బయటపడటం జరిగింది. మిగత వాటిని ఎదుర్కోవడానికి నాలో ధైర్యాన్ని ప్రసాదించారు.

అప్పటి నుంచి బాబాగారు చెప్పిన సలహాలని  అలక్ష్యం చెయ్యకూడదు, చేస్తే ఎన్ని సమస్యలలో పడబోతామో తెలుసుకున్నాను. బాబా గారు చూపించే మార్గములో పయనించే జ్ఞానాన్ని ప్రసాదించమని కోరుకుంటున్నాను. బాబా ఇచ్చే సలహా  పాటించక ఎంతోమంది భక్తులు ప్రమాదాల బారినపడి తిరిగి బాబా అనుగ్రహము పొంది బయటపడటము జరిగిందని సచ్చరిత్రలో చదివాము. మనమందరము బాబా సలహాను పాటించి బాబాగారు చూపించే దారిలో నడుద్దాము.

—-విజయ

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “బాబా ధైర్యాన్నిస్తారు

kishore Babu

Why Fear..I am here…Sai Baba…Sai Baba

Sreenivas

Sai Baba…Sai Baba…Sai Baba

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles