Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
మా చెల్లెలి పెళ్ళికి నేను బాబా పారాయణం చేశాను కదా, ఆ సమయంలో నాకు బాబా ఏదో ఒక రూపంలో చెల్లెలి పెళ్ళికి వస్తాడని అనిపించింది.
చెల్లెలి పెళ్ళిలో మండపం దగ్గర చెల్లెల్ని మండపం పైన కూచోబెట్టిన దగ్గర నుండి మండపం దగ్గరే ఒకతను ఉన్నాడు. అతను తెల్ల ప్యాంటు ఒకటి వేసుకున్నాడు. పైన ఏం వేసుకోలేదు, ఉండి మా చెల్లెలికి దీవెనలు ఇస్తూనే ఉన్నాడు .
మండపం ఒక దగ్గర చిన్న కాలువల ఉంది. దానికవతల నేనున్నాను. ఇవతల వైపు మా తాతగారు ఉన్నారు.
మా తాతగారు కనపడేసరికి ఆ కొత్త వ్యక్తి వచ్చి మా తాతగారికి దండం పెట్టాడు. నేనా వ్యక్తిని ఇతనేంటి ఈ మండపంలో ప్రతిపనికి ఉదయం నుండి అడ్డంపడిపోతున్నాను. అతనికి అన్నం పెట్టి పంపించేయండి అంటూ నేను కసురుతూ అతన్ని వీపు పైన చిన్నగా చరిచాను.
దానికతని కాలు కాలువలో పడింది . తుళ్ళిపడ్డాడు. మళ్లి చూస్తే కనపడలేదు. కాలనీ అంతా వెతికాము. ఎక్కడా అతను కనపడలేదు.
ఆ తర్వాత బాబా అనిపించి నేను చాలా బాధపడ్డాను. ఆ సంఘటన నేను ఎప్పుడు తలచుకున్నా చాలా బాధపడతాను. అతని టచ్ చేసినప్పుడు నా చెయ్యంతా తిమ్మిరి ఎక్కింది. అదొక చిత్రమైన అనుభూతి.
2012 లో నేను ఒక స్నేహితుడ్ని కలవడానికి ఒక చోట బండి పెట్టి రోడ్ దాటి ఎదురుగా ఉన్న ఆఫీసుకి వెళ్లి అతన్ని కలిసి వస్తుంటే, ఆ పైన ఉన్న మరో ఆఫీసులోకి మరో స్నేహితుడు నాకు కలిసాడు.
ఇద్దరమూ రోడ్ దాటి ఇవతలికి వచ్చాము. నేను ఆ ఇద్దరి స్నేహితులతోటి కాసేపు మాట్లాడే సరికి ఒక గంటన్నర సమయం అయ్యింది.
నా బండి నాతో కూడా వచ్చినతని బండి పక్కపక్కనే ఉన్నాయి . నాకు ఒకతను ఎదురువచ్చాడు. నేను జేబులోనుండి తాళం కోసం వెతుకుతున్నాను.
ఆ వచ్చినతను ” ఏంటండీ ! వెతుకున్నారు ” అన్నారు . ” తాళం కోసం ” అన్నాను. ” తాళం ఆలా మీ దగ్గర వెదికితే కనపడదు ఎందుకంటే తాళం నా దగ్గర ఉంది.
ఇప్పటిదాకా మీ బండికే ఉంది. మీ బండి దగ్గర ఒక ముసలాయన కాపలా కూర్చొని ఇప్పుడే ఆయన వస్తే ఇచ్చేయమని తాళం నా చేతికి ఇచ్చి వెళ్ళాడు ” అని చెప్పాడు.
” నువ్వు ఎవరివి ” అని అడిగావు. నేను మెకానిక్ ని , ఆ టీ బండి వాడికి చుట్టాన్ని అని ఎదురుగా ఉన్న టీ బండిని చూపించాడు, నా చేతిలో తాళం పెట్టాడు .
మా ఇంటి దగ్గర ఒకళ్ళున్నారు. వారు చాలా బీద బ్రాహణులు. వాళ్ళ అమ్మాయికి పెళ్లి కుదిరింది.
డబ్బులేదు. వాళ్ళు బాబా భక్తులు. ఏం చేయాలో తెలియక వారు మనసారా బాబాని ప్రార్ధించారు .”
బాబా ఏం చేస్తావో, ఏమో పిల్ల పెళ్లి, మా పరిస్థితి నీకు తెలుసు మా దగ్గర నయా పైసా లేదు. ఎలా జరిపిస్తావో ఏమో అంతా నీదే భారం తండ్రి అనుకున్నారా ” దంపతులు.
ఇలా వీళ్ళు అనుకున్నారో లేదో ఎవరో ఫోన్ చేసి మీ బ్యాంకు అకౌంట్లో డబ్బులు వేస్తున్నాను, ఆ డబ్బు తీసుకుని పెళ్లి పనులకి అడ్వాన్సులు ఇవ్వండి అని చెప్పారట.
ఇంకెవరో ఫోన్ చేసి, స్టేషన్ కి ఎవరో వస్తున్నారు వాళ్ళని కలుసుకోండి అని చెప్పారు. వీళ్ళు స్టేషన్ కి వెళ్లారు.
ఆయన వీళ్ళని కలిసి నేను షిరిడి నుండి వస్తున్నాను, మీ ఇంట్లో పెళ్లి ఉందట కదా అందుకే నేను వచ్చాను, ఇదిగో పెళ్లి బట్టలు, ఇవిగో పెళ్లి సామాన్లు అంటూ ఇచ్చి వెళ్ళిపోయాడు.
వాళ్ళు వాళ్ళ అమ్మాయి పెళ్లి అంగ రంగ వైభవంగా జరిపించారు. బాబా ని నమ్మి చెడిన వాడు లేడు.
సర్వం శ్రీ సాయినాథ చరణారవిందార్పణ మస్తు
శుభం భవతు
The above miracle has been typed by: Mrs. Rajarajeswari Sainathuni
Latest Miracles:
- అయన మామూలు వాడు కాదు. బాబా యే అయివుంటాడు.—Audio
- నమ్మి కొలిచినందుకు నిజదర్శన మిచ్చిన సాయిబాబా
- నా పెళ్లిని , చెల్లి పెళ్లిని చక్కబెట్టిన బాబా ….!
- గురుబంధువుతో కళ్యాణ బంధం
- దిల్ సుఖ్ నగర్ కోణార్క్ థియేటర్ దగ్గర జరిగిన బాంబ్ పేలుడు నుండి కాపాడిన బాబా వారు–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
2 comments on “బాబాని నమ్మి చెడిన వాడు లేడు.”
Sai Baba
April 22, 2020 at 4:33 pmబాబా తన భక్తులతో ఈ విధముగా చాల సార్లు చెప్పారు.
ఎవరైతే ప్రతిక్షణము నన్ను స్మరించి, మనస్ఫూర్తిగా నన్ను పిలిచి, నా ఉనికిని గుర్తించడానికి ప్రయత్నిస్తారో , నేను వారిచెంతకు చేరెను. సదా అన్నివేళలు నేను కాపాడతాను అన్న మాటలకూ ఫై లీల నిదర్శనము.
Sai Baba
April 22, 2020 at 4:34 pmBaba told his devotees many times that
Whoever remembers me, and calls me wholeheartedly and seeks refuge in me then I will reach out to them and will protect them always in all directions.