Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్మహరాజ్కీజై.
సాయిబంధువులందరికీ సాయిరాం. నేను సాయిమూర్తిని. నేను నా కుటుంబముతో మొదటి సారి అక్టోబరు 2006 లో షిరిడీ వెళ్ళాను. సమాధి మందిరంలో బాబాగార్ని దర్శించి భోజనానికి గుడి ఎదురుగా ఉండే ప్రసాదాలయానికి వెళ్ళాము. అప్పట్లో భోజన కూపన్ రూ.5/–. కూపన్ల గురించి లైనులో నించున్నాను. బయట నిలబడిన నా శ్రీమతి దగ్గరికి పొడుగాటి మనిషి జోలె వేసుకొని వచ్చి “ముజే ఏక్ కూపన్” లేవోనా అని అడిగారు. వెంటనే తాను నాకు చెప్పి మొత్తం 5 కూపన్లు తీసుకోమంది. అలాగే తీసుకున్నాను. నాలుగు కూపన్లు నా దగ్గర ఉంచుకొని ఒకటి అతనికి ఇచ్చాను. మేము భోజనానికి హాలులోనికి వెళ్ళి నలుగురము ఒక దగ్గర కూర్చున్నాము. హాలు మొత్తం భక్తులతో కిటకిటలాడింది. అంతమందిలో ఆ తండ్రి మా ప్రక్కనే కాళీగా ఉన్న సీట్లోకి వచ్చి కూర్చున్నారు. పంచకట్టుకొని మాసిన బట్టలతో ఉన్నారు. అందరికీ అన్నం వడ్డించారు. ఆ తండ్రి అన్నం పెట్టుకోలేదు. తన జోలెలో ఉన్న రొట్టెలను తీసి ముక్కలు ముక్కలు చేసి పళ్ళెములో వేసుకొని పప్పుపులుసు పోయించుకొని మొత్తం కలిపి తిన్నారు. ఇదేంటి ఈయన ఇలా తింటున్నారు అనుకున్నామే తప్ప ఆ “సాయిబాబా” యే మా ప్రక్కన కూర్చున్నారు అనే ద్యాస మా మదిలోనికి రాలేదు. మేము తినేవరకు మాతో పాటే ఉండి మా మధ్యలోంచే అదృశ్యం అయినారు. ఎంత వెతికినా కనబడలేదు. రొట్టె అలా కలపడం వలన మేమేమైనా చిరాకు పడుతామని అనుకున్నారో ఏమో, కాని మేము ఆయన చేసినదంతా మేము తింటూనే చూస్తున్నాము. మొదటి సారే మాకు ఆయన “నిజదర్శన” భాగ్యం కలిగినందుకు చాలా సంతోషించాము. ఇంకా ఇలానే రెండు సార్లు వేరే విధంగా దర్శనమిచ్చారు. అవి తరువాత మీకు షేర్ చేస్తాను.
సాయిబందువులందరూ షిరిడీకి క్షేమంగా వెళ్ళి బాబాగారి దర్శనము చేసుకొని గురువుగారి ఆశీర్వాదముతో లాభంగా రండి.
జై సాయిరాం.
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- సాయి బాబా నా సోదరుడిని రక్షించారు
- భక్తురాలి బాధను విజమర సేవ ద్వారా తొలగించిన బాబా వారు
- భవ్యష్యత్తుని ముందుగానే సూచించిన బాబా.
- మా ఇంటికి వచ్చిన బాబా
- నా కోరికను తీర్చిన బాబా.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments