Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
నా కలలో – షిరిడీ షిరిడీ షిరిడీ
ఈ లీలలను చదివుతున్నప్పుడు బాబాగారు తన బిడ్డలపై యెంతటి అనుగ్రహాన్ని కురిపిస్తారో మనకి అర్థమవుతుండి. నా భక్తులని పిచ్చుకకి దారము కట్టి లాగునట్లు, నేనే నావద్దకి రప్పించుకుంటాను అన్న మాటలు అక్షర సత్యాలని మనకి గ్రహింపుకొస్తుంది.
ఈ రోజు నేను పోస్ట్ చేయబోయే లీలా శ్రీమతి ప్రియాంకా రౌతేలాగరి లీల, ఈ లీలలు 2008 సంవత్సరము నవంబరు నెలలో జరిగినవి. ఆమె మాటలలోనే తెలుసుకుందాము.
నేను మాకుటుంబము నవంబరు 7 తారికున షిరిడీ ప్రయాణము పెట్టుకున్నాము. 9 తారీకున మేము షిరిడీ లో ఉంటాము. దీనితో పాటుగా మీ అందరితో మూడు సాయి లీలలను పంచుకుంటాను.
లీల నం.1 : జూలై నెలలో నేను బాబా గారికి సాయంత్రము ఆరతి యిస్తుండగా శాలువా మీద 108 బాబా నామాలతో ఉన్నట్లుగా నా దృష్టికి గోచరించింది. ఈ దృశ్యం దేనిని సూచిస్తోందో నాకు అర్థము కాలేదు. క్షణంలోనే బాబాగారు, 108 నామాలతో శాలువాని సమర్పించమని సూచిస్తున్నట్లుగా నాకర్థమయింది. 108 నామాలతో శాలువాని సమర్పించడమంటే చాలా కొత్తగా ఉంది, ఆ దృశ్యం చూడడం కూడా యెంతో వింతగా ఉండి, నాకు చాలా సంతోషం వేసింది. నా గుండె చాలా వేగంగా కొట్టుకుంది. బాబా గారు మమ్మలని షిరిడీ రమ్మని ఆహ్వానిస్తున్నారు. మరునాడు గురు పూర్ణిమ గురువారము నాడు, నేను, మా అత్తగారు బజారుకి వెళ్ళి 108 నామాలతో బాబా గారికి శాలువా తయారు చేయడానికి గుడ్డ కొనడానికి వెళ్ళాము. మేము షిరిడీ యెప్పుడు వెడతాము అని ఆలోచిస్తున్నాను. ఒకవేళ వచ్చే నెలలో వెడితే కనక, ఈశాలువా యెప్పటికి తయారు అవుతుంది, కాని అంతా బాబా గారే చూసుకుంటారు, పూర్తి కావడానికి తగిన సమయం కూడా ఆయనే ఇచ్చారు. శాలువా పూర్తాయింది, మేము షిరిడీ వెళ్ళడానికి రోజులు లెక్కపెట్టుకుంటున్నాము.
లీలా నం. 2 : ఇప్పుడు ఈ కలకి మా షిరిడీ యాత్రకు సంబంథం ఉంది. మూడు వారాల క్రితం మా భర్తగారు, మా అమ్మాయి టి.వీ. చూస్తున్నారు. మా ఆయనకి సెలవు దొరకలేదు, బాబా గారి ఫోటొ ముందు నిలబడి మమ్మలని షిరిడీ తీసుకెడుతున్నావా లేదా అని అడిగారు. మమ్ములని షిరిడీ రప్పించదలిస్తే మీ అంగీకారము యేదయిన సూచనతో తెలియచేయమని అడిగారు. ఫోటో లో బాబా గారు నవ్వుతున్నట్లుగా చూశారు, మా అమ్మాయి కూడా ఆయన నవ్వడం చూసింది. అప్పుడే, నేను వేరే గదిలో కంప్యూటర్ మీద పని చేసుకుంటుండగా, సెల్ ఫోను మోగింది. నేను ఫోను తీసేటప్పటికి అది రాంగ్ కాల్. మా ఆయన , ఫోను యెవరు చేశారు అని అడగ్గా, నేను రాంగ్ నంబర్ అని చెప్పాను. ఇది వినగానే మా ఆయన 5 నిమిషాల క్రితం తను బాబా గారిని మనలని షిరిడీ రప్పిస్తుంటే కనక యేదయినా సూచన చేయమని చెప్పాను, అప్ప్దుడే నీ సెల్ ఫోను మోగింది అని చెప్పారు. అందులో వచ్చిన రింగ్ టోన్ :
షిరిడీవాలే సాయిబాబా ఆయా హై తేరే ఘర్ పే సవాలీ…
ఈ రింగ్ టొన్ రావడంతో బాబా గారు తమ అంగీకారాన్ని ఈవిథంగా తెలియచేశారు.
లీల నం.3 : క్రితం వారము నుంచి నాకు ఒక విథమయిన కల రావడం మొదలు పెట్టింది. ఆ కలలో నాకుయేమీ కనపడలేదు, కాని రాత్రంతా ఒకటే మాట వినపడింది, అది షిరిడీ, షిరిడీ, షిరిడీ. నిన్న మటుకు నేను బాబా గారిని యింకేమి ప్రశ్నించక ముందే నాకు ఈకల రాలేదు. నిన్న గురువారము నాడు మా షిరిడీకి టిక్కట్ రిజర్వేషన్ కన్ ఫర్మ్ అయింది.
ఈ మూడు లీలలన్నిటిని తలుచుకుంటే నాకు రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి. నాకు ఈరోజు చాలా అనందంగా ఉంది, బాబా గారు మమ్ములను షిరిడీ రప్పించుకుంటున్నారు. నేనెప్పుడు సాయి లీలలను వ్రాసినా బాబా గారు నాపక్కనే ఉన్నట్లుగా ఉంటుంది నాకు.
అల్లామాలిక్
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- రిక్షాలో తీసుకెళ్లి షిరిడీ చూపించిన బాబా !
- షిరిడీ సాయి వైభవం – నా పరువును నిలబెట్టిన బాబా
- షిరిడీ వచ్చి వెళ్తే తప్పకుండ ఉద్యోగం దొరుకుతుంది
- కొత్త దంపతులకు షిరిడీ ద్వారకామాయి లో బాబా వారు చేసిన లీల….
- పదవీచ్యుతుడైన పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ షిరిడీ దర్శించగానే పదవి లభించుట–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “నా కలలో – షిరిడీ షిరిడీ షిరిడీ”
Maruthi.Velaga
January 21, 2017 at 10:33 amJai Saibaba..