షిరిడీ సాయి వైభవం – నా పరువును నిలబెట్టిన బాబా



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

ఈ రోజు ది గ్లోరీ ఆఫ్ షిరిడీ సాయి లో ప్రచురింపబడిన మరొక బాబా లీలను తెలుసుకుందాము.  భారత దేశం నుంచి ఎక్కడికో వేల మైళ్ళదూరంలో ఉన్న విదేశానికి ముఖ్యమయిన పత్రాలను తీసుకుని వెళ్ళడం మరచిపోతే ఇక ఆవ్యక్తి పడే అవస్థ వర్ణనాతీతం.  వెనక్కి వచ్చి తీసుకుని వెళ్ళే పరిస్థితి కాదు.  అటువంటి పరిస్థితిలో ఎవరు సహాయం చేయగలరు? కాగితాలు ఇంటి వద్ద కూదా కనపడకపోతే ఇక ఏమి చేయాలి?  ఏవిధంగా సహాయం అందుతుంది.  కాగితాలు దొరికి తిరిగి విదేశానికి వచ్చి చేరాలంటే వెంటనే అయే పనేనా?  అటువంటి పరిస్థితిలో ఇరుక్కున్న వ్యక్తి దీన గాధ ఇప్పుడు మీరు చదవబోయేది.  మరి ఈ సమస్య ఎలా పరిష్కరింపబడింది.  చదవండి.
షిరిడీ సాయి వైభవం – నా పరువును నిలబెట్టిన బాబా
అత్యవసర పరిస్థితిలో బాబా నాకు ఏవిధంగా సహాయం చేశారో, మీకు వివరిస్తాను. నాకప్పగించిన ఒక ముఖ్యమయిన పని నిమిత్తం నేను విదేశానికి వెళ్ళాను.  కాని అక్కడకు వెళ్ళిన తరువాత చూసుకుంటే నాపనికి సంబంధించిన ముఖ్యమయిన (డాక్యుమెంట్స్) కాగితాలని యింటిదగ్గరే మర్చిపోయానని గ్రహించేటప్పటికి నాకేం చేయాలో అర్ధం కాలేదు.  ఇంటికి ఫోన్ చేసి నేను చదువుకునే గదిలో కాగితాలు వెతకమని చెప్పాను.  ఎంత వెదికినా నేను చెప్పిన కాగితాలేమీ కనపడలేదని చెప్పారు.  ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఇదే సమాధానం వచ్చింది.  కొన్నివేల మైళ్ళ దూరంలో ఉన్నాను.  ఇక్కడికి రావడానికి అయిన ఖర్చు, సమయం అంతా వృధా అయిపోయిందనే ఆందోళనతో, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాను.  నా సహచరులకి నా మొహం ఎలా చూపించాలి, నా బాస్ కి నేనేమని సమాధానం చెప్పాలి? ఈ ఆలోచనలతో మనసంతా వికలమయిపోయింది. హోటల్ గదిలోనే కూర్చుని బాబాని ప్రార్ధించి, నాతో కూడా తెచ్చుకున్న సాయి సత్ చరిత్రని చదవడం ప్రారంభించాను.
మరునాడు ఇంటికి ఫోన్ చేసి కాగితాలు దొరికాయా అని అడిగాను.  దొరకలేదనే సమాధానం వచ్చింది.  ఇంకా దురదృష్టం వెంటాడుతూనే ఉంది.  ఆ మరుసటి రోజు కూడా యిదే విధంగా జరిగింది. అప్పటికి సత్ చరిత్ర మూడవవంతు పూర్తయింది.  ఆఖరికి ప్రయత్నాన్ని విరమించుకుని సత్ చరిత్ర పూర్తి చేసి మరలా బాబాని ప్రార్ధించడానికే నిశ్చయించుకున్నాను.  
నాలుగవ రోజున జరిగింది అధ్బుతం.  సాయి సత్ చరిత్ర ఆఖరి పేజీ చదవడం పూర్తయిన మరుక్షణమే యింటి దగ్గిరనుంచి ఫోన్ వచ్చింది.  నేనడిగిన కాగితాలు దొరికాయనీ, వెంటనే కొరియర్ ద్వారా పంపుతున్నామని చెప్పారు.  నా కళ్ళనుండి ఆనంద భాష్పాలు రాలాయి.  నా సంతోషానికి అవధులు లేవు.  ఒక్క రోజులోనే నాకు కాగితాలు అందాయి.  నాకప్పగించిన పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకుని యింటికి తిరిగి వచ్చాను. 
 అసలు జరిగిన విషయం, నేను నాసామానులు సద్దుకుంటున్నపుడు. ఈ ముఖ్యమయిన కాగితాలన్నిటిని, నేను తీసుకుని వెళ్ళనవసరంలేని ఫైలు లోపలి కవరులో పెట్టేశాను. మూడవరోజు నాడు మా మామగారికి తెల్లవారుజామున 3 గంటలకు తను నా ఫైలు లోపల వెదకలేదన్నట్లుగా కల వచ్చింది.  ఆయన వెంటనే లేచి ఫైలులో చూడగా అందులో కాగితాలు కనిపించాయి.  ఈ కల ఆయనకి సరిగ్గా, వేలమైళ్ళ దూరంలో నేను శ్రీ సాయి సత్ చరిత్రను పూర్తి చేయబోతున్న సమయంలో వచ్చింది.  
బాబా పాదాలకు ప్రణమిల్లి  ఆయనకు నా కృతజ్ఞతలు తెలుపుకోవడం తప్ప నేనేమి చేయగలను?  కొన్ని కొన్ని సమస్యలకు పరిష్కారాలు చాలా అద్భుతంగా జరుగుతాయి.  
సాయిరాం
అశోక్
గ్లోరీ ఆఫ్ షిర్దీ సాయి అక్టోబరు, 21, 2010వ. సంచికనుండి.
ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles