Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
అబ్దుల్ బాబా మొదటి బాగం…..
అబ్దుల్ బాబా 1871 లో ఉత్తర మహారాష్ట్రలోని తపతీ నదీ తీరంలో ఉన్న నాందేడ్ లో జన్మించారు. అతని తండ్రి పేరు సుల్తాన్. అతని చిన్నతనంలో తల్లిదండ్రులు అతనిని నాందేడ్ కి చెందిన అమీరుద్దీన్ అని పిలవబడే సూఫీ గురువు యొక్క సంరక్షణలో ఉంచారు.
1889లో అబ్దుల్ 19 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, అమీరుద్దీన్ కి సాయిబాబా కలలో కనిపించి రెండు మామిడిపండ్లను ఇచ్చి, వాటిని అబ్దుల్ కి ఇవ్వమని మరియు అతనిని షిర్డీ పంపించమని ఆదేశించారు. అతను నిద్ర లేచినప్పుడు రెండు మామిడిపండ్లు పక్కన ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. అతడు ఆ మామిడిపండ్లను అబ్దుల్ కి ఇచ్చి, వెంటనే షిర్డీలో సాయిబాబా వద్దకు వెళ్ళమని పంపించారు.
అందువలన, అబ్దుల్ 1889లో, తన 20వ సంవత్సరములో బాబా వద్దకు వచ్చారు. అప్పటికి నానాసాహెబ్ చందోర్కర్ కూడా బాబా వద్దకు రాలేదు. అతనిని చూడగానే బాబా ‘మేరా కావ్లా అలా’ అంటే, ‘నా కాకి వచ్చింది’ అని స్వాగతించారు. బాబా అతనిని పూర్తిగా తమ సేవకు అంకితమవమని చెప్పారు.
అప్పటినుంచి బాబా సేవ చేయడం, శిరిడీ వీధులు చిమ్మి శుభ్రం చేయడం, రాత్రంతా బాబా సన్నిధిలో ఖురాన్ చదవడం వంటి పనులతో రోజంతా గడిపేవాడు అబ్దుల్. అలా తన గురువు పంపగా, అబ్దుల్ బాబా సన్నిధికి చేరి ఆయనను సేవించసాగారు. బాబా శరీరంతో ఉన్నప్పుడు 30 సం :లు, బాబా సమాధి చెందిన తర్వాత 36 సం :లు ఎంతో భక్తి శ్రద్ధలతో బాబాను సేవించారు అబ్దుల అంత సుదీర్ఘ కాలం బాబాను అంటిపెట్టుకొని ఉన్న ముస్లిం భక్తుడు ఇతను ఒక్కడే.
బాబా అతడిని ప్రేమగా, “హలాల్ కుర్” (మా పాకీవాడు) అని కూడా పిలిచేవారు. అతడు ఎక్కువ సమయం బాబా సేవలోను, వీధులను చిమ్మి శుభ్రపరచడంలోను, రాత్రంతా బాబా సన్నిధిలో ఖురాన్ చదవడం వంటి పనులలోను నిమగ్నమై ఉండేవాడు.
“రాత్రి సమయాలలో నిద్రపోకుండా ఖురాన్ చదువుతూ ఉండమని, పవిత్రమైన ఖురాన్ చదువుతూ తూగకూడదని, నిద్రలో జారుకోకూడద”ని బాబా చెప్పేవారు. ఇంకా, “స్వల్పంగా తిను, ఒక్క పదార్ధంతో తృప్తిపడు, రుచులకు పోవద్దు, అతిగా నిద్రపోవద్దు” అని అబ్దుల్లాతో బాబా చెప్పేవారు. ఖురాన్ చక్కగా అర్థం చేసుకుంటూ చదవమని కూడా బాబా చెప్పేవారు. “నేను ఎవరిని?” అని విచారణ కూడా చేసుకోమని బాబా చెప్పేవారు. అతడలాగే చేసేవాడు.
అబ్దుల్ విధులు:
- ద్వారకామాయి చుట్టూ ఉండే ఐదు దీపాలను నిరంతరం చమురుతో నింపటం.
- లెండీ బాగ్ లో బాబా చేత వెలిగించబడిన దీపాన్ని కనిపెట్టుకొని ఉండటం.
- ద్వారకామాయి మరియు చావడి రోజువారీ శుభ్రపరచడం.
వాటితో పాటుగా బాబా తిరిగే వీధులను తుడిచి, మలాలను తొలగించేవాడు. ధునిలో కట్టెలు వేసేవాడు. అతను నది నుండి నీటిని తెచ్చి, ప్రతిరోజూ బాబా బట్టలు శుభ్రపరిచేవాడు. ఈవిధంగా బాబా సేవ చేసుకుంటూ అతడు ప్రతిరోజూ భిక్ష చేసుకొని జీవించేవాడు. మొదట్లో బాబా అతనికి ఆహారం ఇచ్చేవారు కాదు. ఆహారం కొరకు అబ్దుల్ భిక్షకు వెళ్ళేవాడు.
రేపు అబ్దుల్ బాబా రెండవ బాగం…..
తరువాయి బాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి ….
(Source: Life of Sai Baba by Late Shri.B.V.Narasimha Swamiji and www.saiparichai.com)
http://bonjanrao.blogspot.in/2012/09/abdul-baba.html
For More Information about Abdul Baba and for downloading e-book on Abdul Baba log on to http://www.saiparchai.com
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- అబ్దుల్ బాబా మూడవ బాగం…..
- అబ్దుల్ బాబా ఐదవ బాగం…..
- అబ్దుల్ బాబా నాల్గవ బాగం…..
- అబ్దుల్ బాబా రెండవ బాగం…..
- సాయి సేవలో 65 ఏండ్లు …..సాయి@366 ఏప్రిల్ 23….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “అబ్దుల్ బాబా మొదటి బాగం…..”
సాయినాథుని ప్రణతి
June 20, 2017 at 4:01 amచాలా బాగుంది సాయి .నేను అబ్దుల్ అనుభవం చదవాలి అనుకొలేదు సాయి .మీరు ఇది గ్రుప్ లో share చెసినపుడు నేను శిరిడీలో వునాను వచ్చాక అసలు కొది రోజులు బాబా బుక్స చదవాలనే ఆలోచనే లేదు చదవలేదు కూడ సమయం దొరికితె బాబా దెగ్గర కుర్చొని గడిపెదాని. నిన్న మావారు స్కుల్కి కారులో వెలేటపుడు ఎదన లీల చదువు అనారు అదికూడ బాబా వునపటి భక్తుల లీలలు చదువు అనారు అపుడు వెతికాను ఇది కనపడక వెరే లీల చదివాను .ఇపుడు ఉదయానే ఈ లీల చదువుతుంటే ఆనందంగా అనిపించింది సాయి.నిన్న కూడ స్కుల్కి వెలెటపుడు వచేటపుడు కూడ మీరు share చేసిన సాయిలీలలు చదువుతు గురువుగారు చెపినట్లు సమయం ఉపయేగించుకునాం సాయి చాలా సంతోషంగా అనిపించింది నాకు .
Sai Suresh
June 20, 2017 at 10:57 amచాలా సంతోషం సాయి. సాయి భక్తులుగా ఆయన ధ్యాసలో సమయం గడుపుకోవడం కన్నా గొప్ప విషయం ఏముంది. అలా మనం ఆయన సన్నిధిలో ఉన్నట్లే కదా!