Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
శ్రీసాయి లీలామృత ధార – నీ వెనుక నేనున్నాను – బాబా చేసిన మాయ
ఈ రోజు సాయిలీల మాసపత్రిక జూన్ 1975వ సంచికలో ప్రచురింపబడిన ఒక సాయి లీలను ప్రచురిస్తున్నాను. చదవండి. బాబా లీలలు అనంతం, అనూహ్యం. ఎప్పుడు ఎవరిని ఎలా కాపాడతారో మనం గ్రహించుకోలేము. ఆయన తన భక్తులను అనుక్షణం కనిపెట్టుకుని వుంటూ ఉంటారని ఈ లీల చదివితే మనకి అర్థమవుతుంది.
మా రైలు కోపర్గావ్ స్టేషన్ చేరుకునే సమయానికి అర్ధరాత్రి కావస్తూ ఉంది. జనవరి నెల కావడం వల్ల చలిగాలులు శరీరానికి వణుకు పుట్టించేలా ఉన్నాయి. రైలు నెమ్మదిగా స్టేషన్ లో ఆగుతూ ఉంది. ప్లాట్ ఫారం అంతా నిర్మానుష్యంగా ఉంది. ప్లాట్ ఫారంలో వెలిగించిన నూనె దీపాలు మాకు స్వాగతం చెబుతున్నట్లుగా మిణుకు మిణుకుమంటూ చిరు కాంతులను వెదజల్లుతూ ఉన్నాయి.
రైలు ఆగగానే మా సామానుతో సహా అందరం ఫ్లాట్ ఫారం మీద దిగడానికి తొందరగా తలుపు వద్దకు వచ్చాము. శ్రీసాయిబాబా వారిని దర్శించుకోవడానికి ఇపుడు మేమంతా రెండవసారి షిరిడీకి వచ్చాము. మనకు స్వాతంత్ర్యం రావడానికి కొద్ది రోజుల ముందుగా వచ్చాము.
ఇపుడు శీనుకు 11 సంవత్సరాల వయసు. శీను, అతని తల్లిడండ్రులకు ఒక్కడే సంతానం. శీను తల్లిదండ్రులకి రెండవసారి షిరిడికి రావడం చాలా చెప్పుకోదగ్గది. శీను తరువాత ఇంకొక సంతానం కలగాలనే కోరికతో ఉన్నారు. గత పది సంవత్సరాలుగా కన్యాకుమారి నుంచి కాశ్మీరు వరకు, బెంగాల్ నుండి బొంబాయి వరకు అన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారు.
మధ్యవయసులో ఉన్న శీను తల్లిదండ్రులు అందరి దేవుళ్ళ ముందు సాగిలబడి తమకు మరొక సంతానాన్ని ప్రసాదించమని ప్రార్ధించుకున్నారు. భగవంతుడు తమని ఎప్పుడు కరుణిస్తాడా అనే ఆశతో ఎక్కడ గుడి కనపడితే అక్కడికి వెళ్ళి దేవీ దేవతలను ప్రార్ధించుకుంటూ ఉండేవారు. మొట్టమొదటిసారిగా వారు, రెండవ ప్రపంచ యుధ్ధం పూర్తయిన సంవత్సరం తరువాత షిరిడీ వచ్చి బాబాను దర్శించుకున్నారు.
ఆ తరువాతనే వారి చిరకాల వాంఛ నెరవేరింది. కాని మొదటిసారి షిరిడీ వచ్చినపుడు శీను తల్లికి అది నిరాశను మిగిల్చింది. ఆ సమయంలో ఆమె బహిష్టవడం వల్ల బాబాను దర్శించుకోలేకపోయింది. భర్తకు ఇక శెలవలు పొడిగించడానికి కూడా లేదు. కొద్దిరోజులుండి బాబా దర్శనం చేసుకుందామన్న భార్య మాటని ఆమోదించలేదు.
శీను తల్లి బాబాను దర్శించుకోలేకపోయానే అని చాలా బాధపడి కన్నీళ్ళతో ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది. కాని ఎన్నాళ్ళనుంచో వారు పడుతున్న వేదనకి ముగింపు వచ్చింది. బాబా అనుగ్రహంతో శీను తల్లి గర్భవతయింది. ఆయన అనుగ్రహంతోనే ఇపుడు తన రెండవ సంతానానికి బాబావారి మొదటి దర్శనం ఇప్పిద్దామని షిరిడీకి తీసుకునివచ్చింది.
సరిగా అప్పుడే ఒక విచిత్రం జరిగింది. అందరూ తొందర తొందరగా రైలు నుండి ఫ్లాట్ ఫారం మీదకు దిగారు. రైలు నెమ్మదిగా బయలుదేరింది. శీను అమ్మమ్మ శీను చెల్లిలిని (శిశువుని) తనచేతులలో ఎత్తుకుని ఇంకా రైలులోనే ఉంది. ఆమె తొందరగా దిగలేకపోయింది. శీను నాన్నగారు ఆమెతో, ‘చెయిన్ లాగు చెయిన్ లాగు’ అని అరుస్తూ ఉన్నారు. రైలు నెమ్మదిగా వేగాన్ని పుంజుకుంది.
శీను అమ్మమ్మ చైన్ లాగకుండా గాబరాగా దూకేసింది. ఎవరో ఆమె చేతుల్లోని శిశువును అందుకున్నారు. శీను నాన్నగారు ఆమెను పట్టుకుందామని ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో ఇద్దరూ రైలు కిందకి జారిపోభోతున్నారు. వెనకాల ఇంకా రైలు బోగీలు ఉన్నాయి. అందరూ చాలా భయంతో నిలబడి చూస్తూ వున్నారు.
క్షణాల వ్యవధిలో బలహీనంగా అనారోగ్యంగా ఉన్న శీను తల్లి రైలు వెంబడే పరుగెత్తి రైలు కిందకి జారిపడిపోతున్న బలిష్టంగా ఉన్న తన భర్తని పట్టుకుని పైకి లాగేసింది.
శీను అమ్మమ్మకి ఏమయింది? ఇంకా వెనకాల ఉన్న బోగీలు ముందుకి కదలుతూనే ఉన్నాయి. ముసలావిడ రైలు కింద పడి ముక్కలయిపోయి ఉంటుందనే అనుకున్నారు అందరూ. రైలు వెళ్ళిపోగానే అందరూ ప్లాట్ ఫారం దగ్గిరకి వెళ్ళి పట్టాలమీదకి తొంగిచూశారు. అందరూ ఏమయిందోననీ చాలా భయంగా, ఉద్వేగంగా చూస్తూ ఉన్నారు. విచిత్రం, ఆమె బతికే ఉంది. ఆ ముసలావిడ చక్కగా లేచి నుంచుంది. శరీరం మీద ఒక్క గాయం కూడా కాలేదు. ఎంతటి అద్భుతం! ఒకేసారి రెండు అత్యద్భుతాలు.
240 పౌండ్ల బరువున్న తన భర్తని సెకన్ల వ్యవధిలో అనారోగ్యంతో బలహీనంగా ఉన్నప్పటికీ అంత సులువుగా ఎలా లాగగలిగావని శీను తల్లిని అడిగారు. సాధారణంగా 10 పౌండ్లు కూడా బరువెత్తలేవని ఆమె 240 పౌండ్ల బరువున్న భర్తని సునాయాసంగా లాగిందంటే దానికి జవాబు– “అది బాబా చేసిన మాయ”.
అనంతుల పద్మజ
సికిందరాబాదు
సాయిలీల మాసపత్రిక జూన్1975
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- శ్రీసాయి లీలామృత ధార – నీటి గండంనించి గట్టెక్కించిన బాబా
- శ్రీసాయి లీలామృత ధార – బంగారు చెవిపోగులు
- డ్రైవర్ ఇంజనును నడుపుటకు ప్రయత్నించినాడు. కాని రైలు కదలలేదు.–Audio
- నా భర్తను శారీరక బాధలనుండి విముక్తి చేసిన బాబా!
- బాబా “6 నెలలు వేచి ఉండు, అప్పుడు చూడు తప్పు చేసిన వారి పరిస్తితి” అన్నారు.—Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “శ్రీసాయి లీలామృత ధార – నీ వెనుక నేనున్నాను – బాబా చేసిన మాయ”
T.V.Madhavi.BBSR
June 5, 2017 at 1:46 pmsai..baba leela adbutham..amazing asalu..chalabaaga raasavu..kallalo neellu..aa seen uhinchukunte…karunaapayonidhi..mana baba..god bless u sai..