Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
శ్రీసాయి లీలామృత ధార – నీటి గండంనించి గట్టెక్కించిన బాబా
ఈ రోజు శ్రీసాయిలీల మాసపత్రిక జూలై 1975 వ సంవత్సరంలో ప్రచురింపబడిన ఒక అద్భుతమైన లీల మనందరం చదివి ఆనందిద్దాము. ఆర్తితో పిలిస్తే పలకకుండా ఉంటాడా మన సద్గురువు? ఆపదల నుంచి గట్టెక్కించి తనెవరో తెలుసుకునేలోపులోనే అంతర్ధానమయిపోతారు.
1949వ సంవత్సరం ఆషాఢమాసంలో భక్తుల బృందం ఒకటి హైదరాబాదు నుండి షిరిడీకి బయలుదేరింది. వర్షాకాలం కావడం వల్ల ప్రయాణం ఒక అగ్నిపరీక్షలా ఉంది. 20 గంటల సుదీర్ఘ ప్రయాణం తరువాత రైలు కోపర్ గావ్ స్టేషన్ కు చేరుకుంది.
అప్పటికే దుమ్ము ధూళిలో రైలు ప్రయాణం సాగించిన భక్త బృందం అలసిపోయి, ఎడ్లబండిలో పట్టణానికి బయలుదేరే ముందు, కూడా తెచ్చుకున్న ఫలహారాలు కానిచ్చారు. ఆ రోజుల్లో కోపర్ గావ్ స్టేషన్ నుంచి షిరిడీ వెళ్ళడానికి బస్సులు లేవు. షిరిడీకి బస్సులో వెళ్ళాలంటే మధ్యలో ఉన్న గోదావరి దాటి అవతలి ఒడ్డునుంచి బస్సెక్కి వెళ్ళాలి.
ఇప్పుడు నది మీద ఉన్న వంతెన ఆ రోజుల్లో ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. నదీ తీరానికి చేరుకోవాలంటే మూడు మైళ్ళు ప్రయాణం చేయాలి. దారి అంతా కూడా తారురోడ్డు కాదు, సిమెంటు రోడ్డూ కాదు. మట్టి రోడ్డవడం వల్ల రోడ్డు ప్రయాణం చాలా ప్రయాసతో కూడుకున్నది. నల్లటి మట్టిరోడ్డు వర్షానికి బురద బురదగా ఉండి అడుగు వేస్తే జారిపోయేలా ఉంది. ఎద్దులు కూడా ఆ రోడ్డు మీద పాపం చాలా కష్టంతో బండిని లాగుతున్నాయి.
యాత్రికుల బృందం నది ఒడ్డుకు చేరుకొంది. గోదావరి నది మీద బాగా తక్కువ ఎత్తులో(వాగుల మీద నీటికి దగ్గరగా వంతెన ఉంటుంది అలాంటి వంతెన) ఉన్న వంతెన ఇంక నీటిలో మునగడానికి సిధ్ధంగా ఉంది. నదిలో బోటు ఒకటి ప్రయాణీకులను ఒడ్డు ఇవతల నుంచి అవతలికి, అవతలి ఒడ్డునుంచి ఇవతలి ఒడ్డుకి చేరవేస్తూ ఉంది.
యాత్రికుల బృదంలోని వారందరూ కూడా బోటులోనే నదిని దాటుదామనుకున్నారు. కాని ఎడ్లబండి తోలే అతను, తాను వారినందరినీ తన బండిలోనే నది మీద ఉన్న చిన్నవంతెన మీద నుంచి అవతలి ఒడ్డుకు తీసుకుని వెడతానన్నాడు.
సరే నది దాటడానికి బోటుకి డబ్బులు ఖర్చు చేయడం ఎందుకని సరే అన్నారు అందరూ. అందరూ మళ్ళీ బండిలో ఎక్కి బయలుదేరారు. బండి నెమ్మదిగా వంతెన మీద నుంచి వెడుతూ ఉంది. బండి వంతెన మధ్యలోకి వచ్చేటప్పటికి విపరీతంగా వర్షం ప్రారంభమయింది. నది పరవళ్ళు తొక్కుతూ ప్రవహించసాగింది. వేగంగా నీటిమట్టం పెరగసాగింది.
ఎద్దులు స్వాధీనం తప్పిపోవడంతో బండి తోలుతున్నవాడు వాటిని అదుపు చేయలేకపోయాడు. బండిని లాగుతున్న ఎద్దులకి అడుగు పడటంలేదు. దాదాపుగా అవి నీటిలో తేలుతున్నాయి. నీటి ప్రవాహం చాలా ఉధృతంగా ఉంది. బండి చక్రం ఒకదానికి ఒక పెద్ద బండరాయి అడ్డుపడింది. నదిపై తక్కువ ఎత్తులో ఉన్న వంతెనకి పిట్టగోడ కూడా లేదు. నదీ ప్రవాహం ఎడ్లబండిని నీటిలోకి తోసేసేంతగా పరవళ్ళు తొక్కుతూ ఉంది.
అందరూ గొంతెత్తి ‘శ్రీసాయిబాబా!’ అంటూ ఆయన నామస్మరణ చేయసాగారు. వారందరికి బ్రతుకుతామనే ఆశకూడా పోయింది. పెదవులపై సాయినామ స్మరణ జరుగుతుండగానే జలసమాధి అవడం ఖాయమనుకున్నారు. ఉచ్ఛస్వరంతో బిగ్గరగా వారు చేసే సాయినామం గాలిలో ప్రతిధ్వనిస్తూ ఉంది.
హఠాత్తుగా ఎక్కడి నుండి వచ్చాడో, ఒక మధ్య వయస్కుడు ఎద్దుల ముందుకు వచ్చి బండిని అదుపు చేశాడు. బండితోలే అతను చక్రానికి అడ్డుపడ్డ బండరాయిని తొలగించాడు. అపరిచితుడు మెల్లగా బండిని అవతలి ఒడ్డుకు చేర్చాడు. అందరూ సాయినామస్మరణ కొనసాగిస్తూనే ఉన్నారు. అపరిచితుడు జాగ్రత్తగా బండిని అవతలి ఒడ్డుకు చేర్చగానే నీరు తగ్గిపోయింది.
మబ్బులు తొలగిపోయి ఎండ వచ్చింది. ఒడ్డున నిలబడి ఉన్నవారు, యాత్రికుల బృందం ఎడ్లబండిలో నదిని సురక్షితంగా దాటుకుని రావడం చూసి ఆనందంతో కేరింతలు కొడుతూ.
యాత్రికుల బృందానికి సారధ్యం వహిస్తున్న శ్రీ బాలయ్య చాలా సంతోషించి, తమందరిని ప్రమాదాన్నుండి కాపాడి ఒడ్డుకు చేర్చిన అపరిచితునికి ఇద్దామని పదిరూపాయల నోటు తీశాడు. కాని, ఎక్కడ? ఆ అపరిచితుడు ఎక్కడా కనబడలేదు. బాలయ్యతో సహా అందరూ చుట్టుప్రక్కలంతా వెతికారు. అతనెక్కడా కనబడలేదు. కలవరపడ్డ బాలయ్య తనలో తానే ఇలా అనుకున్నాడు: “అపరిచితుడిగా వచ్చి సహాయం చేసినది మరెవరో కాదు, ఖచ్చితంగా బాబాయే”
సాయంత్రం బాబాను దర్శించుకున్న తరువాత అందరూ బసకు చేరుకున్నారు. బాలయ్య నిద్రపోయాడు. అతనికి కలలో ఒక వ్యక్తి కనపడి, “షిరిడీ క్షేత్రంలో హుండీలో వేయవలసిన సొమ్ముకు సంబంధించిన లెక్కలో తప్పు చేశావు నువ్వు” అన్నాడు.
బాలయ్య ఆతృతగా నిద్రనుండి లేచాడు. కాగితం మీద లెక్కలన్నీ వేశాడు. కలలో ఆవ్యక్తి చెప్పినట్లుగానే లెక్కలో తప్పు జరిగినట్లుగాను, ఎంత సొమ్ముకు తేడా జరిగిందో కూడా కనుగొన్నాడు. కలలో కనిపించిన వ్యక్తి ఎంతసొమ్ముకు తేడా జరిగిందని చెప్పాడో సరిగా అంతే సొమ్ముకు తను పొరబాటు చేసినట్లు గుర్తించి ఆశ్చర్యపోయాడు.
ఇది ఒక అపూర్వమైన సంఘటన…
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- శ్రీసాయి లీలామృత ధార – నీ వెనుక నేనున్నాను – బాబా చేసిన మాయ
- శ్రీసాయి లీలామృత ధార – బంగారు చెవిపోగులు
- శ్రీ సాయి లీలామృత ధార – పోయిన స్కూటర్ దొరుకుతుందా లేదా? – రెండవ బాగం…
- శ్రీ సాయి లీలామృత ధార – పోయిన స్కూటర్ దొరుకుతుందా లేదా? – మొదటి బాగం…
- శ్రీ సాయి లీలామృత ధార – షిరిడీలో నా మొదటి అనుభవం
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “శ్రీసాయి లీలామృత ధార – నీటి గండంనించి గట్టెక్కించిన బాబా”
Maruthi
May 30, 2017 at 11:17 pmSri SaiBaba…Sri SaiBaba…Sri SaiBaba…Sri SaiBaba…Sri SaiBaba.Aapadbhandava Sri SaiBaba…Sri SaiBaba…Sri SaiBaba…Sri SaiBaba