Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
ఒకసారి సాయి సిద్ధుని దర్శనానికి కొందరు భక్తులు వచ్చారు. వారిలో ఒకరు చందోర్కర్. అతడు కలెక్టర్ వద్ద సెక్రటరీగా ఉద్యోగం చేస్తున్నారు. అంతా అతన్ని సాహెబ్ అని అంటారు. రెండవ వాడు వాయీస్ వాస్తవ్యుడైన రాందాసి హరిదాసు. మూడవ వాడు బాపూనగర్ కర్. నాల్గవవాడు కాన్ గాంకర్. వీరంతా కలిసి షిర్డీ గ్రామానికి వచ్చారు.
రాందాసి బువాకు ఆ మరురోజే ఆంజనేయ స్వామి జయంతి ఆరాధనకు అర్జంటుగా నగర్ కు వెళ్ళిపోవాల్సి ఉంది. అందుచేత అతడు సాయి సద్గురు దర్శనమైన వెంటనే తిరుగు ప్రయాణానికి బయలుదేరాలని త్వరపడసాగాడు.
అప్పుడు సాయి మహారాజు నానాసాహేబ్ తో “ముందు భోజనం చేసి తరువాత నగరుకు వెళ్ళండి” అని చెప్పారు. ఈ మాట విని నానా కాన్ గాంకరును వెంటబెట్టుకుని భోజనానికి వెళ్లారు.
కాని రాందాసికి తొందర ఎక్కువ. “బావూ నగర్ కర్! రేపు నగర్ లో నా హరికధ ఉంది కదా ఇప్పుడు నేనేం చేయాలి? ఇక్కడ ఈ వెఱ్రి ఫకీరు దగ్గరుంటే ఏం దొరుకుతుంది. చెప్పు! చిల్లి గవ్వైనా లభించదు. నానాసాహేబ్ కేం బోలేడంత డబ్బుంది. అతనివలె ఈ సాయి వెంట ఉంటే నేను భిక్ష మెత్తుకోవలిసిందే. అందువల్ల మనం స్టేషన్ కెళ్ళి బండి అందుకుందాం పద” అని చెప్పి ఆ ఉభయులు స్టేషన్ కు వెళ్లారు.
నానాసాహేబ్ కాన్ గాంకర్ ఇరువురూ షిర్దిలోనే ఉన్నారు. నానాసాహేబ్ కాన్ గాంకర్ ఇరువురూ భోజనం చేసి మశీదుకు వచ్చారు. అప్పుడు సాయి మహారాజు నానా తో “చూసావా లోకుల రీతి ఎలా ఉందో. జతగాళ్ళను వదిలి పెట్టి తమ స్వార్ధాన్ని చూచుకున్నారు. పరిమళం పూవును యెట్లా యెట్లా విడిచిపోదో అట్లే ఎన్నడూ విడిపోని జతగాన్ని ఎన్నుకోవాలి. మీ భోజనాలయ్యాయి కదా! ఇప్పుడు ఇక తాపీగా బయలుదేరి వెళ్ళండి. రైలు బండి కింకా చాలా సమయం ఉంది. నేను చెప్పిన దాన్నంతా బాగా గుర్తుంచుకోండని” చెప్పారు.
నానా వారి మాటను పాటించి, వారి చరణాల యందు మస్తాకన్నుంచి నమస్కరించి రైల్వే స్టేషన్ కు బయలుదేరి వెళ్లారు. అక్కడ రాందాసి మరియు బావూ తిండి లేక కడుపు మాడి పోతుండగా ఉపవాసంతో తమ లోలోపల ఏడ్చుకుంటూ కూలబడ్డారు. పాపం వాళ్ళకక్కడ తినడానికి ఏమి దొరకలేదు.
నానాను చూచి వారు ఇద్దరు కరిగి నీరైపోయారు. తమ తలలను క్రిందకు వాల్చేసి మట్టిని కెలుకుతూ కూర్చున్నారు. వారి పరిస్థితి గమనించి నానా “ఏమి? మీరింకా నగరుకు వేల్లిపోలేదా? బండి ఇంకా వచ్చినట్లు లేదే” అని అంటే వారు “ఇవాళ బండి 3 గంటలు ఆలస్యంగా వస్తుందట. మేమిక్కడ ఆకలితో చచ్చిపోతున్నాం. ఆ సాయి మహారాజు ఆజ్ఞను పాటించనందుకు మాకు మాబాగా శాస్తి జరిగింది. వారు చెప్పినట్లు విని మీరు బాగుపడ్డారు” అని అన్నారు. అట్లా ముచ్చటించుకుంటూ ఆ నలుగురూ నగరు రైలు బండిలో చేరుకున్నారు. అట్టి త్రికాలజ్ఞుడైన సద్గురు సాయికి నా నమస్కారములు.
అందుకే సద్గురువు చెప్పినట్లు నడుచుకోవటం ఎవరికైనా మంచింది. వారు త్రికాలజ్ఞానులు కనుక మనకు ఏది శ్రేయస్సుకరమో అదే చెప్తారు.
source: దాసగణు గారి రచన భక్తలీలామృతం చాప్టర్ 31
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- పోగొట్టుకున్నది ఏది?…..సాయి@366 నవంబర్ 19….Audio
- దాహం! దాహం!!…..సాయి@366 మే 24….Audio
- సాయి ‘పిచ్చుక’ నానా …..సాయి@366 ఆగస్టు 21….Audio
- బాబా భోదామృతం (భక్తలీలామృతం చాప్టర్ 32) రెండవ భాగం….
- ‘‘సద్గురువు కటాక్షం లభించిన వారికి కష్టాలు ఉండవు. బాబా మన సద్గురువు.’’
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “ఎప్పుడు మనల్ని విడిపోని వారినే మన స్నేహితులుగా ఎన్నుకోవాలి”
Maruthi
May 31, 2017 at 12:46 pmNamaskaramu Sai thamdri.Sai Baba…Sai Baba