Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
మనకు కష్టాలలో ఉన్నప్పుడే దేవుడు గుర్తుకు వస్తాడు. అందుచేత ఎన్నో మ్రొక్కులు మ్రొక్కేస్తూ ఉంటాము. కాని ఒకోసారి కష్టాలు తీరగానే మ్రొక్కులు మరచిపోవడం గాని, వాయిదా వేయడం గాని జరుగుతూ ఉంటుంది. అందుచేత మ్రొక్కులు మ్రొక్కేటప్పుడే వాటిని మనం తీర్చగలమా లేదా అన్నది ఆలోచించుకోవాలి.
కాని కఠినమైనా గాని అమలు చేయాలి. ఒక్కోసారి మనం మర్చిపోతే భగవంతుడే మనకి ఏదో విధంగా అడ్డంకులు కల్పించి మనకి గుర్తు చేస్తాడు. అది మనని మంచి మార్గంలో పెట్టడానికే తప్ప మరేమీకాదు. లేకపోతే కోరిక తీరిన తరువాత మానవుడు మ్రొక్కిన మ్రొక్కుని తీర్చకుండా గడిపేస్తాడు. మ్రొక్కు విషయంలో భగవంతుడిని మనం మోసం చేయకూడదు.
మనం బాబా మీద యెన్నో ఆశలు పెట్టుకుంటాం, ప్రతీ చిన్న విషయానికి ఆయన సహాయాన్ని అర్థిస్తాము, ఎందుకంటే మనం ఆయన బిడ్డలం కనక. పిల్లలు ఎప్పుడు ఏది అవసరమొచ్చినా, లేక కష్టాలలో గాని తల్లిని సహాయమడుగుతూ ఉంటారు. మనం బాబాకి అప్పుడప్పుడు మాట ఇస్తూ ఉంటాము (మ్రొక్కులు మ్రొక్కుకోవడం వంటివి). మనం ఆయనకి అలా చేసి శరణువేడడం వెనుక కారణం ఉంటుంది.
మన కోరిక తీరిన మరుక్షణంలోనే, బాబా గారు ఏమనుకుంటారనే రెండో ఆలోచన లేకుండానే, మనమిచ్చిన మాటని మర్చిపోతాము. కొన్ని సంవత్సరాలుగా నేను నేర్చుకున్నడేమంటే, మనం కనుక ఆయనకిచ్చిన మాట తప్పితే, సాయిమా మనలని దండించి మనకొక గుణపాఠం నేర్పుతారు,
ఎందుకంటే మనము ఆయన బిడ్డలం కనుక. కనుకనే మనము మన సాయిమాని మోసం చేయకూడదు. ఒకవేళ మనం ఆ తప్పు కనుక చేస్తే, ఎదురయ్యే పరిస్థితులని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇదంతా మన మంచికోసమే, ఎందుకంటే, తల్లి తన బిడ్డలమీద ఎక్కువ కఠినంగా ఉండలేదు. నమ్మకం లేకుండా మనము సాయిమాని సంతృప్తి పరచలేము.
ఈ రోజు మీకు విక్రం స్నేహితుని బాబా లీలని మీకు చెపుతున్నాను.
ఈ రోజు మీకొక అనుభవాన్ని చెపుతున్నాను. ఇది నా అనుభూతికన్నా ఎక్కువ. మానవమాత్రుడిగా, ఒక సాయి భక్తునిగా ఇది నా జీవితంలో ఒక గుణపాఠం. ఇది నాకు మంచి స్నేహితుడు, తోటి సాయి భక్తుడు నాకు చెప్పిన లీల.
అతని అనుమతితో నేను కూడా ఈ అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. 2010, ఏప్రిల్ లో నా స్నేహితుడు (సాయి భక్తుడు) తన ఎంప్లాయర్ ద్వారా యూ.ఎస్. లో వర్క్ పెర్మిట్ కి అప్లయ్ చేశాడు. అతని అప్ప్లికేషన్ ప్రాసెస్ లో ఉండగా, అతను తన వర్క్ పెర్మిట్ పని జరిగితే, బాబాకి, తన చెడు అలవాటయిన సిగరెట్టు కాల్చడం గురువారములలో మానివేస్తానని మాట ఇచ్చాడు.
తొందరలోనే అతని వర్క్ పెర్మిట్ అప్రూవ్ అయింది. ఈ వార్త తెలిసిన వెంటనే అతను సంతోషంతో ఎగిరి గంతేయడం నాకు గుర్తుంది. ఒక నెల వరకు అతను తన ఇచ్చిన మాటను నిలబెట్టుకుని, గురువారములలో పొగత్రాగడం మానివేశాడు. కాని ఒక గురువారమునాడు, పని వత్తిడిలో, ఆ వత్తిడిని తట్టుకోలేక సిగరెట్టు కాల్చాడు.
నైరాశ్యం బాగా ఎక్కువగా ఉండటం చేత, తనకి మనస్థైర్యం లేకపోవడంవల్ల, బలహీనత వల్ల తన మాట నిలబెట్టుకోలేకపోయానని ఒప్పుకున్నాడు. ఇక ఆ గురువారం మొదలు తను ఇచ్చిన మాట మరచిపోయి ప్రతీ గురువారం పొగత్రాగడం మొదలు పెట్టాడు.
సచ్చరిత్రలో చెప్పినట్టు, తల్లి పిల్లవాని మంచికోసం, చేదు మందు గొంతులో పోస్తుంది. అలాగే మహాత్ములు కూడా, ఒక్కోసారి కఠినమైన పద్ధతులని అవలంబిస్తారు, అది వారి మంచి కోసమే.
అదేవిధంగా ఇతనికి జరిగింది. అతను బాబాకిచ్చిన మాటని జవదాటిన రెండు వారాల తరువాత, అతని యజమానితో సమస్యలు వచ్చాయి, అందుచేత అతని ఎంప్లాయరు అతని వర్క్ పర్మిట్ ని వెంటనే రద్దు చేసే నిర్ణయం తీసుకున్నాడు. ఇక అతను భంగపడిపోయి చపల చిత్తుడై, తరువాత ఏమి చేయాలో తెలీకుండా అయిపోయాడు.
తన వర్క్ పర్మిట్ రద్దు కాబడిందనే వార్త తెలిసిన తరువాత, అతని మనసులోకి వచ్చిన మొదటి ఆలోచన, తెలివి తక్కువగా తను బాబాకిచ్చిన మాట తప్పడమే అని. అతను బాబా విగ్రహం ఎదుట పశ్చాత్తాప పడ్డాడు, రోదించాడు. ఇదంతా సరి అయితే కనుక తాను మళ్ళీ మానుతాననే ఉద్దేశ్యంతో బాబాని క్షమించమని వేడుకున్నాడు.
తన ఎంప్లాయరు, ఏదో పొరపాటువల్ల జరిగింది, మరలా తిరిగి జాయిన్ అవ్వమని తనని పిలుస్తాడని, రోజుల తరబడి ఎదురు చూశాడు. కాని ఆవిధంగా ఏమీ జరగలేదు. అతను ఉద్యోగం పోగొట్టుకుని ఇంటి వద్దే నెల రోజులు ఉన్నాడు. బాబా తన గొంతులో చేదు మందును బలవంతంగా పోసింది తన మంచికేనని అతనికి తెలుసు. తిరిగి తను ఇచ్చిన మాట ప్రకారం గురువారములునాడు పొగత్రాగడం మానేశాడు.
తల్లి పిల్లవాణ్ణి, కొట్టినా తిట్టినా, వాడు మళ్ళీ మళ్ళీ ఆ తప్పును చేయకుండా ఉంటాడని నిర్ధారించుకోవడానికే. కాని, పిల్లవాడు, పిల్లవాడే; వాడికి మంచికి చెడుకి వున్న తేడాను తెలియ చెప్పాలి. కాని, తిట్టిన తరువాత, దండించిన తరువాత, తల్లి పిల్లవాణ్ణి కౌగలించుకొని, వాడిని క్షమించి వాడిని అక్కున చేర్చుకుని ప్రేమని కురిపిస్తుంది.
ఇదే అతని విషయంలోనూ జరిగింది. అతను తిరిగి ఉద్యోగావకాశాలకోసం వెతుక్కోవడం మొదలుపెట్టాడు. ఆఖరికి ఒకనెల తరువాత అతను క్రిందటి ఉద్యోగంకన్నా మంచి ఉద్యోగంలో చేరాడు.
అతనికి వర్క్ పర్మిట్ తాత్కాలిక ప్రాతిపదిక మీద జీతం తీసుకునేలా వచ్చింది. అతని ప్రస్తుత కంపెనీ సరియైన వర్క్ పర్మిట్ ఇవ్వాలా వద్దా అనే నిర్ణయాన్ని యింకా తీసుకోవలసి ఉంది. అతని భవిష్యత్తు సందిగ్ధం, కాని బాబా గారు తనతో ఉన్నారని, అంతా ఆయనే చూసుకుంటారని తెలుసు. అతను కఠినమైన మంచి గుణపాఠం నేర్చుకున్నాడు.
కాని బాబా మంచి దయాసముద్రుడు. ఒకోసారి ఆయన పద్ధతులు కఠినంగా ఉన్నా గానీ, ఆఖరికి విజయ తథ్యం. మనం బాబా చెప్పినట్లు నడుచుకోవడమే. కాని మధ్యలో వదిలి వెళ్ళిపోవద్దు.
నా స్నేహితుని విషయంలో ఏమి జరిగింది, బాబా తనమీద కోపగించినందువల్ల కాదని మనం అర్థం చేసుకుందాము. అలా జరగడానికి కారణం దారితప్పి కొట్టుకుపోతున్న వానిని బాబా గారు సరియైన మార్గంలో పెడదామనే ఉద్దేశ్యం.
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- దక్షిణ రక్షణ కల్పిస్తుంది, మానసిక వేదన నుండి ఉపశమనం కలిగిస్తుంది మరియు మంచి ఆదాయం లభిస్తుంది–Audio
- శంకర్ లాల్ కె. భట్
- ‘‘దేవుణ్ణి దర్శించుకునేందుకు వేళలు ఉండవు. సమయాసమయాలు మనం నిర్ణయించుకున్నవే!’
- గురువారం నాడు గృహప్రవేశం పెట్టుకో
- తమ యొక్క సగుణ రూపాన్ని చూసేందుకు దృష్టిని ప్రసాదించారు బాబా–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments