Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
షిరిడీలో కొంతకాలం ఉన్న కపర్డే జనవరి 6 (1912 ) బాలా సాహెబ్ భాటే వద్దకు వెళ్ళి మరాఠీలో రంగనాథస్వామి వ్రాసిన యోగవాశిష్టం అరువు తెచ్చుకున్నాడు పఠించటానికి.
సాయిబాబా తన భక్తులను పఠింపుమని చెప్పిన గ్రంథాలలో ఒకటి యోగవాశిష్ఠము.
శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఎలాగున గీతా ధర్మమును బోధించెనో, ఆలాగున వసిష్ట మునీంద్రుడు శ్రీరామచంద్రునికి బోధించినదే ఈ యోగ వాశిష్టము.
వసిష్టులు ఎన్నో కధలను ఉటంకిస్తూ ఉపదేశామృతాన్ని చిలికించారు.
ఒకనాడు శుకునకు మాయ ఆవిర్భావమును గూర్చి తెలుసుకోవాలనే కోరిక కలిగింది. తన తండ్రిని సమీపించాడు. తన సందేహాలను తెలిపాడు.
తండ్రి తగిన ప్రత్యుత్తరము ఇచ్చినను శుకుడు సమాధానపడలేదు. పెరటి చెట్టు వైద్యమునకు పనికిరాదు గదా! కుమారుని వాలకమును చూసి “కుమారా! నీకింకా శంకపోకుంటే, విదేహరాజ్యం చేరి జనకుని ఆశ్రయించు” అన్నాడు.
శుకుడు జనక రాజ్యం చేరి అంతఃపుర ద్వారమువద్ద నిలిచాడు. పరిచారకులు శుకుని ఆగమన వార్త తెలిపినా, జనకుడు కదలిరాలేదు.
ఒక గంట, రెండు గంటలు కాదు, ఒక రోజు, రెండు రోజులు కాదు, ఏడూ రోజులపాటు జనకుడు కదలలేదు.
శుకుడు సహనం కోల్పోలేదు. జనకుడు సంతోషించాడు. శుకుని సందేహాలకు జవాబులు చెప్పినాడు.
ఇంకా శుకుడు తన తండ్రి కూడా అలాగే శలవిచ్చాడని, తన సంశయము అప్పుడు తీరలేదని చెప్పాడు.
“అసలు ఈ మాయయే నిన్ను మాయావిర్భావమును తెలుసుకొనునట్లు ప్రేరేపించింది. ఈ మాయయే నిన్ను, తండ్రి చెప్పినను, నిన్నిక్కడకు తెచ్చినది.
ఆత్మను తప్ప మరేదైనను తెలుసుకొనగోరుట మాయయే” అన్నాడు జనకుడు. ఇప్పుడు మాయాజాలం నుండి బయటపడ్డాడు శుకుడు.
సాయిబాబా ఒకసారి మాయ శక్తిని గూర్చి మాట్లాడుతూ “ఈ భగవంతుని మాయ, బ్రహ్మ మొదలగు వారినే చికాకుపరచుచున్నప్పుడు, నావంటి ఫకీరు దానికి (మాయ) ఎంత?” అన్నారు.
స్వామి రామతీర్థ “నా దృష్టితో ప్రపంచమునందంతటిలో ఇంతవరకు వెలువడిన గ్రంధరాజములన్నిటిలో యోగావశిష్టము ఒకటి.
ఈ భూమండలమున దానిని పఠించిన వారెవరును, దైవ సాక్షాత్కారము నొందకుండ, బ్రహ్మైక్యము బడయకుండా నుండజాలరు” అంటాడు.
మాయకు చిక్కకుందుము గాక, యోగవాశిష్టము పఠింతుము గాక!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- గ్రాంఫోన్…..సాయి@366 జనవరి 11….Audio
- జలగండం…..సాయి@366 సెప్టెంబర్ 6….Audio
- నిర్భయుడవుకమ్ము! …. మహనీయులు – 2020… ఏప్రిల్ 10
- బుద్ది నొసగుమా, శక్తి నొసగుమా…..సాయి@366 జనవరి 2…Audio
- సాయి వేసిన బేడీ…..సాయి@366 నవంబర్ 23….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments