జయహో మాతా! …. మహనీయులు – 2020… జూన్ 12



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


హైదరాబాద్ రామచంద్రాపురం నుండి ముగ్గురు వ్యక్తులు జిల్లేళ్ళమూడి అమ్మను దర్శించటానికి వెళ్ళారు. అమ్మ దివ్యత్వాన్ని గూర్చి వారికీ సూర్యనారాయణ అనే వ్యక్తి చెప్పాడు.

వారందరూ శుక్రవారం రాత్రి 10 గంటలకు జరిగే అమ్మ పూజ, భజనలలో పాల్గొన్నారు.

అమ్మవద్ద కూర్చున్న వారిలో ఒకరు ఇప్పుడు రాత్రి 10 గంటలైంది. సూర్యనారాయణగారు పూజ మొదలెట్టి ఉంటాడన్నారు.

అమ్మ వెంటనే “కాదు నాన్నా, ఇవ్వాళ తొమ్మిదిన్నరకే పూజ మొదలైంది, సూర్యనారాయణకు జర్వం వచ్చింది. ప్రసాదంగా పంచిన శనగ గుగ్గిళ్ళలో ఉప్పు ఎక్కువైంది” అంది.

ఆ ముగ్గురు అమ్మ తమకు కాశీ మజిలీ కథలు చెబుతోందనుకున్నారు. మరునాడు ఉదయమే రామచంద్రాపురం వెళ్ళి అమ్మ చెప్పిందంతా చెప్పారు ఆయనకు.

సూర్యనారాయణ అమ్మ చెప్పిందంతా నిజమేనని చెప్పాడు. ఆ ముగ్గురు తెల్లబోయారు. అమ్మ పటానికి సాగిలపడి, చెంపలు వాయించుకున్నారు. ఇంతకు  అమ్మ ఉన్నది రామచంద్రాపురంలోనా? జిల్లెళ్ళమూడిలోనా?

శేషగిరిరావు అనే భక్తుడు “మద్రాసు మౌంట్ రోడ్డులో నీ నామం స్మరిస్తూ వెళుతున్న భక్తుడు నీకేమనిపిస్తాడు?” అని ప్రశ్నించాడు. “నా ఎదురుగా నడచి వెళుతున్నట్లుంటుంది” అని జవాబిచ్చింది అమ్మ.

వసుందర అనే భక్తురాలు “మా ఆలోచనలు నీకెలా తెలుస్తాయమ్మా?” అని అడిగింది. “మీరు నేను కాకపొతే గదా!” అన్నది అమ్మ.

శేషశాయి విశాఖ పట్టణవాసి. అమ్మ భక్తుడు. ఒకసారి ఆయనకు జబ్బు చేస్తే, కే. జి. హాస్పిటల్ కు వెళ్ళాడు.

డాక్టరు ప్రసాదరావు గారు ‘X Ray’ తీసి కడుపులో అల్సర్ ఉంది వెంటనే ఆపరేషన్ చేయించుకో” అన్నారు.

ఆపరేషన్ తేదీ నిర్ణయించుకుని, ఆ విషయాన్ని చెప్పటానికి శేషశాయి జిల్లెళ్ళమూడి అమ్మ దగ్గరకు వెళ్ళాడు. అమ్మ శేషశాయి పొట్టను చేతితో తడిమి “నీకు అల్సర్ లేదు, ఆపరేషన్ వద్దు” అంది.

అయన విశాఖపట్నం వెళ్ళి డాక్టరు కు ఈ విషయం చెప్పాడు. “ఆమె ఎలా పరీక్షించింది?” అడిగాడు డాక్టరు. చెప్పాడు శేషశాయి.

“అమ్మలు, బాబాలు ఇలాగే చెబుతారు. ఆధారంలేకుండా వాళ్ళ మాటలు నమ్మితే, మీరు ప్రాణాలు పోగొట్టుకుంటారు” అని హెచ్చరించాడు.

శేషశాయి ఆపరేషన్ కు అంగీకరించాడు. ఆపరేషన్ చేయబోయారు. X Ray తీసారు. అల్సర్ ఎక్కడా కనబడలేదు.

పాత X Ray చూచాడు అల్సర్ ఉంది. కానీ ఇప్పుడు శేషశాయికి అల్సర్ లేదు. అమ్మ వాక్కే ఆపరేషన్ గా, అమ్మ అనుగ్రహమే ఔషధంగా పనిచేసిందని డాక్టరు గ్రహించాడు. అమ్మకు భక్తుడయ్యాడు ఆ డాక్టరు.

సాయిబాబా వలెనె అమ్మకు అన్ని మతాల నుండి భక్తులున్నారు. అందరికి అన్నం పెట్టె అమ్మ జూన్ 12, 1995 తనువు చాలించింది.

నేడు జూన్ 12 అమ్మ వర్థంతి.

ఇమాం అనే ముస్లిం యువకుడు రచించిన ఈ నామాన్ని స్మరిద్దాం……

“జయాయో మాతా శ్రీ అనసూయ రాజా రాజనేశ్వరి శ్రీ పరాత్పరి…”

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles