సచ్చరిత్ర పై అవగాహన పెంచిన సత్సంగం.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


A. త్యాగరాజు గారి అనుభవం మొదటి భాగం

నా పేరు త్యాగరాజు. నేను స్టేట్ బ్యాంకు లో పని చేసి రిటైర్ అయ్యాను. మేము నిజాంపేట్ లో ఉంటాము.

2006 సంవత్సరం లో మా కుటుంబం అంత కలిసి షిరిడి వెళ్ళాము. అక్కడ బాబా వస్త్రాలు వేలం వేస్తారని తెలిసి ఏదైనా ఒక వస్త్రం కొనుకుందామని అనుకున్నాం. కానీ మాకు లోపలికి ఎలా వెళ్ళాలో తెలియలేదు.

అలా అలా అనుకోకుండా, మేము కనీసం పూలు కూడా తీసుకోకుండా క్యూ లైన్ లోకి వెళ్లిపోయాం.

బాబా కోసం కనీసం పూలు కూడా తీసుకోకుండా  అలా లైన్ లోకి వెళ్లి నిలబడ్డందుకు బాధ పడ్డాము. “బాబా నువ్వే ఎదో ఒక లీల చూపవయ్యా!” అని కూడా అనుకున్నాం.

సమాధి మందిరం లోకి ప్రేవేశించాము. ఇంతలో ఒక సెక్యూరిటీ గార్డ్ నన్ను పిలిచాడు. నేను లైన్ లో సరిగ్గా నడవటం లేదోమో అనుకోని సర్దుకున్నాను.

ఈలోపు అతను నన్ను మరల పిలిచాడు. మా ఆవిడా సెక్యూరిటీ ఆతను మిమ్ముల్ని పిలుస్తున్నాడు అంటూ చెప్పింది.

నేను అతని దగ్గరగా వెళ్ళాను. అతను చేతులతో రెండు పూలగుత్తులు నా  చేతిలో పెట్టి బాబా కివ్వండి అని అన్నాడు. నేను ఊహించలేదు అలా బాబా చమత్కారం చేస్తాడని.

2008  సంవత్సరం, అప్పటికి నేను బాబా ‘సచ్చరిత్ర’ 2 ,3 సార్లు చదివాను. ఒక రోజు మా బ్యాంకుకి ఒకావిడ వచ్చి “మేము సాయి భక్తులం, అందరం కలిసి ఒక చోట సత్సంగం చేసుకుంటాము.

శ్రీ సాయి సచ్చరిత్రలో ఒక అధ్యాయం చదివి, విశ్లేషణ కూడా చేసుకుంటూంటాము. ఆ తర్వాత హారతి ఇస్తాము, ప్రసాదాలు పంచుకుంటాము, మీరూ వస్తే బావుటుందండి అంటూ చెప్పి వెళ్ళిపోయింది.

నాకు రెండు మూడు వారలు కుదరక వెళ్ళలేదు ఆ తర్వాత ఒక రోజు వెళ్ళాను. అక్కడ భజన, సత్సంగం నాకు చాలా బాగా నచ్చాయి.

తరచూ వెడుతూంటే నాకూ సచ్చరిత్ర లో బాగా అవగాహన కలగసాగింది.

తర్వాత నాకు కూడా ఏదైనా బాబా గురించి మాట్లాడాలినిపించి, ‘వెబ్ సైట్’ లో ‘బాబా’ గురించి కొన్ని విషయాలు తెలుసుకొని సత్సంగంలో చర్చించటం మొదలు పెట్టాను.

నాకు 2010 సంవత్సరం లో  బై పాస్ ఆపరేషన్ అయింది. ఆసమయం లో మా సత్సంగం వాళ్ళు కొంతమంది షిరిడి వెడుతున్నాం అంటూ నాకు ఫోన్ చేసారు.

ఆ సమయం లో నేను హైదరాబాద్ హాస్పిటల్ లో ఉన్నాను. ఫోన్ చేసినావిడకి, నేను బాబా కి నా నమస్కారాలు తెలియచేయమన్నాను.

బాబా ‘సచ్చరిత్ర’ లో ఎవరైనా దక్షిణ పంపినప్పుడు, వారినుండి బాబా అడిగి తీసుకునేవాడని తెలుసు.

అలాగే మా సత్సంగ సభ్యులు షిరిడి లో బాబా దర్శనానికి వెళ్లి నేను నమస్కారాలు చెప్పమన్న సంగతి మరచి పోయారట.

ఆవిడ కళ్ళు మూసుకోగానే, ఆవిడ మనోనేత్రాల ముందు మా సత్సంగ సభ్యులందరూ బాబా ముందు నిలబడి ఉండటం, అందునా ముందు వరుసలో నేను కనపడ్డానట.

వెంటనే ఆవిడకి నేను పంపమన్న నమస్కారాలు విషయం గుర్తుకు వచ్చిందట. ఆవిడ తన తప్పు తెలుసుకుని చెంపలు వేసుకొని, నా నమస్కారాలు బాబా కి తెలియపరిచిందట.

ఆ రోజు గురువారం, స్తోత్రాలన్నీ చదువుకుని బాబా కి హారతిని కుడా ఇచ్చేసి, నేను మా ఆవిడతో “ఈ రోజు బాబా గారు మనింటికి భోజనానికి వస్తారని నాకనిపిస్తుంది” అని అన్నాను.

దానికి మా ఆవిడ “అదేమిటి? రోజూ మనం బాబాకి నైవేద్యం పెట్టి భోజనం చేస్తాం కదా!, మరల ఎందుకు వస్తారు?” అని అంది.

 ప్రతి గురువారం మా ఆవిడ ఉపవాసం ఉంటుంది. అందుచేత నా ఒక్కడికే ఆ రోజు వంట చేసింది.

నేను ఆఫీస్ కి వెళ్ళే హడావిడిలో నాకు ఒక్కడికే వండింది కాబట్టి యధాలాపంగా గిన్నెలన్నీ ఖాళీ చేసేసాను.

అన్ని ఖాళీ చేసాక అప్పుడు గుర్తుకు వచ్చింది. “అరె! గిన్నెలన్నీ ఖాళీ అయిపోయాయి గదా! ఇప్పుడు బాబా మా ఇంటికి వస్తే ఏం పెడుతుంది?” అని అనుకుంటూ ఆఫీస్ కి వెళ్ళిపోయాను.

మా ఆవిడ పూజ, పారాయణ పూర్తి చేసుకునే సరికి 11 గంటలప్పుడు ఇద్దరు బ్రాహ్మణులు ఇంటికి వచ్చి, మా ఆవిడని ఆశీర్వదించి, నీకు ప్రహ్లదుడు లాంటి , మనుమడు పుడతాడని దీవించారట.

వారిద్దరికి చేరో 11 రూపాయలు దక్షిణగా ఇచ్చిందట. వారు ఆడబ్బులు తీసుకోని మాకిది సరిపోదు చేరో 20 రూపాయలు ఇవ్వండి, మేము హోటల్ లో భోజనం చేస్తాము అని అన్నారట.

నేను ఒక్కడినే వున్నది, వండినది తినేసి, బాబా వస్తే ఎం పెడుతుంది అని నేను అనుకుంటే వాళ్ళు డబ్బులు అడిగి భోజనం హోటల్ లో చేస్తాం అనడం చాలా ఆశ్చర్యం కలిగించింది.

The above miracle has been typed by: Shiva Kumar Bandaru

…..A. త్యాగరాజు గారి అనుభవం మొదటి భాగం తరువాయి…..

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles