Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
నా పేరు రత్నమాల. మాది, మా పుట్టింటి వారిది కూడా సాంప్రదాయకమైన సామాన్య కుటుంబం.
పూజలు, వ్రతాలు, నోములు, ఇంట్లో పెద్దవాళ్ళుంటే వాళ్ళతో పాటు పిల్లలు కూడా అనుసరిస్తారు, అనుకరిస్తారు.
ఏకాదసులు, కార్తీక సోమవారాలు, మాఘపు ఆదివారాలు, పూజలు, ఉపవాసాలు ఇంట్లో అమ్మా, నాన్న, నానమ్మ అందరూ చేస్తుండేవారు.
ఆడపిల్లను కాబట్టి పూజా విధుల్లో ఎక్కువగా పాల్గొనేదాన్ని. అయినా ఇంట్లో బలగం బాగా ఎక్కువగా ఉండేది.
ఆస్తమానం వచ్చేవారు వెళ్లేవారు ఉంటూ ఉండేవారు. వాళ్ళ పురుళ్ళు, పుణ్యాలు, పెళ్లిళ్లు, పేరంటాలు, ఏదోక హడావిడి ఇంట్లో ఉంటూ ఉండేది.
నా కోసం పూజలు కూడా నేనేమీ చేసింది లేదు. ఏవో సంతోషి మాత పూజలు మాత్రం చేశాను. లలితా, విష్ణు సహస్రనామాలు, లక్ష్మి పూజలు ఇంట్లో నిత్య దీపారాధన అదీ ఉంటూనే ఉండేది.
నాకు ముందు నుంచి బాబా పరిచయం ఏమీ లేదు. పెళ్లి అయిన తర్వాత మా అత్తగారింట్లో పూజా మందిరంలో ఒక సాయి బాబా ఫోటో, చిన్న విగ్రహం ఉండటం నేను చూసాను.
మా మామగారు దానికి పూజ చేస్తుండేవారు. అయినా నేను ఎక్కువగా మా వారిని ట్రాన్సఫర్ పరంగా ఆయన ఎక్కడుంటే నేను అక్కడే ఉండేదాన్ని కాబట్టి నాకు బాబా గురించి అంతగా తెలియదు.
1982 మార్చి లో, మా ఆఖరి అబ్బాయి కడుపుతో ఉన్నాను, మాతో ఎవరూ లేరు, మా ఇంటి ఎదురుగా దగ్గరలోనే మా మేనత్త ఒకావిడ ఉన్నారు.
ఆవిడ మాకు సాయంగా ఉంటారనుకుంటే ఆవిడకి ఏదో అవసరమైన పని తగిలి ఊరికి వెళ్ళిపోయింది. చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు కానీ ఇంట్లో మనవాళ్లంటూ ఉండాలిగా!
ఇంట్లో అల్లర్లు చేస్తూ ఇద్దరు పిల్లలు. ఈ లోగా మా వారికి జ్వరం, మూసిన కన్ను తెరవకుండా చలి జ్వరం తో బాధపడుతున్నారు.
ఎవర్నో దింపి రావాలని స్టేషన్ కి వెళ్లి జ్వరంతో తిరిగి వచ్చారు. భోజనం చెయ్యమంటే ”నాకు వద్దు నేను చేయను నాకు బాగా జ్వరం గా ఉంది” అని పడుకున్నారు.
మర్నాడు ఉదయం నీరసంగా ఉంది కాఫీ ఇమ్మన్నారు, మొహం కడుక్కోవడానికి కూడా ఓపిక లేదు, రాత్రేమీ తినలేదు, పైగా జ్వరంగా ఉంది, మరి మొహం కడుక్కోకుండానే బెడ్ కాఫీ తాగి మళ్ళీ పడుకున్నారు.
కాసేపయ్యాక లేపి చారన్నం పెట్టాను. నేను అన్నం తిన్నాక పడుకుంటే మళ్ళీ జ్వరం వస్తుందంటే, ఆయనకు వాళ్ళ నాన్నగారు రోజుకొక అధ్యాయం అయినా లేక ఒక పేరా అయినా చదివితే మంచిదని చెప్పి ఇచ్చిన ”శ్రీ సాయి సచ్చరిత్ర” గుర్తుకొచ్చింది.
అది బీరువా పైనుండి నాతో తెప్పించుకుని నన్ను చదవమన్నారు. నాకు దానిపైన పెద్దగా అవగాహన లేకున్నా ఆయన చదవమన్నారని చదివాను.
ఆ రోజు ఆదివారం కావటం చేత ఆ రోజుటి పారాయణ చదివాను. అంతా గర్భిణీ స్త్రీల గురించే వచ్చింది.
నాకేమిటో పారాయణ మంచిగా అనిపించింది. కొంచెం ధైర్యం వచ్చినట్టు అయ్యింది.
మర్నాడు ద్వితీయ విఘ్నం ఎందుకు అని అంటే మళ్ళీ రెండవ రోజు పారాయణ చదివాను.
పెద్దగా ఓపిక, ఇంట్రెస్ట్ లేకపోయినా చదివాను. ఆ రోజు సాయంత్రం మా మరిది అత్తగారు కాకినాడ నుండి వచ్చారు.
మా బావగారికి ఎవరో చెప్పారట నీ మరదలు అవస్థ పడుతోంది, మీ తమ్ముడు జ్వరంతో ఉన్నాడు, ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి సాయంగా మీ అమ్మని పంపమని ఎవరో చెప్పారు అన్నారుట.
అందుకని వీళ్ళని బావగారు పంపించారట. వాళ్ళు నాకు కాస్త సాయం వచ్చాక నాకు బాబా మీద గురి కుదిరి, మిగతా రోజుల పారాయణ కూడా పూర్తి చేయాలి అని అనుకున్నాను. అలా అవస్థ పడుతూనే మిగతావి కూడా భారంగా పారాయణ పూర్తి చేశాను.
The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni
Latest Miracles:
- సచ్చరిత్ర పారాయణ ఫలితం – కలలో వచ్చి వైద్యం చేసి ఆపరేషన్ అవసరం లేకుండా చేసిన బాబా గారు.
- బాబా సచ్చరిత్ర పారాయణం లీల
- సచ్చరిత్ర పారాయణం సకల శుభ ప్రదాయం ….!
- సాయి వారసత్వం! …..సాయి@366 మే 3….Audio
- బాబా వారి అనుమతి లేకుండా చేసిన పనిలో నష్టాల పాలైన భక్తుడు…Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
3 comments on “అవగాహన లేకుండా చేసిన సచ్చరిత్ర పారాయణం, కానీ ఫలితం మాత్రం అమోఘం ……”
Sai Baba
May 17, 2020 at 4:22 amబాబా వారి పలుకు:
” నా చర్యలు అగాధాలు. వాటిని అర్ధం చేసుకోవాలి అంటే మానవ మాత్రులకి సాధ్యపడదు.”
ఆ భక్తురాలి కి ఎప్పుడయితే తనలో ఒక అలజడి మొదలైందో, అప్పుడే తన భర్తకి జ్వరము రావడము, తద్వారా ఆయనకి సాయి సచ్చరిత్ర పారాయణము చేయాలి అనిపించి తన భార్య ద్వారా పారాయణము చేయించారు.
ఆమె ఎప్పుడైతే పారాయణము ఆరంభించిందో, అప్పుడే ఆమె బంధువులు సాయముగా వచ్చి ఉండడము అనేది బాబా వారి లీల అనడములో సందేహము లేదు.
బాబా నే చాల సార్లు తన భక్తులతో
” తన భక్తులను జన్మ జన్మలకు వారికి వెంటే ఉండి కష్టకాలంలో అన్ని విధాలా ఆదుకుంటాను అన్నారు ”
మనము ఈ జన్మలో భక్తులము కాకా పోయిన గత జన్మలో బాబాతో మనకు ఉన్న అనుబంధమే మనలని కాపాడుతుంది.
Sai Baba
May 17, 2020 at 4:22 amBaba’s Quote:
“My ways are inscrutable. It’s not possible to understand them by human beings.”
When she starts to worry about the company of own relatives during that time.
She recited Sai Satcharitra when her husband requests the recitation of Sai Satcharitra as He got a fever.
There is no doubt that when she started the recitation, her relatives had come to help. That is the power of Sai Satcharitra.
Baba’s word:
The moment, I help them all the way in difficult situations even in all births of life.
We are not necessarily devotees in this birth but our devotion on Baba in the past births also protects us.
Srinivasa Murthy
May 17, 2020 at 5:48 pmSai Baba….Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba