Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support by: Mrs. Jeevani
ఇద్దరు మహనీయులను గూర్చి, ఆ ఇద్దరూ ఒకే దివ్య శక్తి వేర్వేరు రూపాలలో, ఆయా ప్రాంతాల్లోని జనులను ధర్మ మార్గాన సంచరించేటట్టు చేసిందని వెలువడిన గ్రంథాలు – అందులోను ఆంగ్లంలో ఉండవచ్చును, ఉండకపోవచ్చును.
మచిలీపట్నం నివాసి శ్రీ ఓ.వి.జి. సుబ్రహ్మణ్యం గారు షిరిడీ సాయిబాబాను, జిల్లెళ్ళమూడి అమ్మను గూర్చి, ‘సాయి ది మదర్ అండ్ అనసూయ, ది అమ్మ’ అనే అద్వితీయ రచన చేశారు.
ఆ ఇద్దరూ సర్వ దేవతామూర్తులుగా – ఎవరు ఏ రూపంలో భావిస్తే ఆ రూపంలో భక్తులకు సాక్షాత్కరించారు. ఇద్దరికి అన్నదానమంటే అమిత ప్రేమ.
తమను నమ్మిన ఆర్తుల బాధలను తామే అనుభవించి, ఆర్తులను బాధా విముక్తులను చేసిన సంఘటనలు ఆ ఇరువురి జీవితాల్లో పుష్కలంగా ఉన్నాయి.
ఇద్దరూ పంచ భూతాలపైన వారికి గల అప్రతిహతమైన అధికారాన్ని సందర్భోచితంగా చూపారు.
ఇద్దరూ దర్శన మాత్రం చేతనే ఇహ పర సుఖాలను, రెండు చేతులా ఆశ్రితులకు పంచారు.
తేడాలు లేకపోలేదు – అందులో ఒక తేడా – జిల్లెళ్ళమూడి అమ్మ వివాహితురాలు.
పెళ్ళిలో పెద్దపులి లేదని రుజువు చేసి, లోకానికి అభయం ప్రసాదించటానికి వివాహం చేసుకొని భర్తతో, సంతానంలో కలిగే కష్ట, సుఖాల కెరటాలపై ఊయలలూగుతూ, లోకాన్నంతా కన్న బిడ్డగా ప్రేమించి పరమ ఉన్నతిని పొందారు.
ఇక సాయిబాబా బ్రహ్మచారిగా ఉండి, విశ్వాన్నే స్వకుటుంబంగా ఎంచుకుని, సర్వజనుల యోగక్షేమాలకు తన యావజ్జీవితాన్ని నిర్విశేషంగా సమర్పించారు.
ఒకసారి సాయిబాబా తనకోసం చేయించుకొనిన రొట్టెలను కుక్కకు పెట్టారు.
జిల్లెళ్ళమూడి అమ్మ తనకు ఇచ్చిన ఆరు పూరీలను సంతోషంగా గంతులు వేసుకుంటూ వెళ్ళి వాటిని ఆకలితో అంటరాని వారికి పెట్టింది. వాళ్ళు తింటే తాను తిన్నట్లే!
అమ్మ మార్చి 28, 1923న జన్మించింది.
జయహో మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- జయహో మాతా! …. మహనీయులు – 2020… జూన్ 12
- సాయి మార్గములో పెద్దలు(జిల్లెళ్ళమూడి అమ్మగారు)
- సంతుల గ్రామం…..సాయి@366 మార్చి 23….Audio
- మూకం కరోతి వాచాలం …..సాయి@366 మార్చి 29….Audio
- నల్లని వాడ! నేను ఫ్రెంచ్ మహిళనోయ్! …. మహనీయులు – 2020…ఫిబ్రవరి 21
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments