Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
పవహరిబాబా జీవితం యోగ శాస్త్రానికి ఒక ఉదాహరణ. పవిత్రత, వినమ్రత, ప్రేమలకు దృష్టాంతం. అయన జనన తేదీ వివరాలు తెలియవు, సాయిబాబా జన్మదినం వలెనే.
ఐతే సాయిబాబా అక్టోబరు 15, 1918న మహాసమాధి చెందారని అందరికీ విదితమే. పవహారి మరణ తేదీ తెలియదు – స్వామి వివేకానంద తనకు అప్పుడే వచ్చిన ఉత్తరంలోని ఆ విషయాన్ని సోదరి నివేదితకు జూన్ 5, 1898న తెలియచేసారు.
పవహరిబాబా ఘాజీపూర్ కు రెండె మైళ్ళ దూరంలో గంగా ఒడ్డున నివసించేవారు.
ఒకసారి ఆయనను తాచు పాము కాటేసింది. గంటల తరబడి ఆయన చనిపోయినట్టు కొయ్యబారిపోయాడు. తరువాత తేరుకున్నాడు.
“ఏమి జరిగింది?” అని ఆయన స్నేహితులు ఆయనను అడిగారు. “ఆ తాచు పరమేశ్వరుని దూత సుమా!” అన్నారు.
వివేకానంద స్వామి “ఈ లోకానికి సేవచేయటానికి మీరు ఈ గుహను దాటి బైటకు రాకూడదా?” అని అడిగారు బాబాను.
“బాబూ! సహాయమనేది చేతులతోనే చేయదగినదా? మనస్సుతో కూడ సహాయం చేయవచ్చును. శరీరంతో నిమిత్తంలేదు” అన్నారు పవహరిబాబా.
చేసేది ఎంత చిన్న విషయమైనా దానిలో లీనమైపోవాలి అనేవారు. ఆయన శ్రీరామ చంద్రునిపట్ల ఎంత శ్రద్ధ పూనుతాడో, అంతే శ్రద్ధ ఒక రాగి పాత్రను తోమటంలోను కనబరుస్తాడు.
ఆయన ఎన్నడూ బోధించలేదు. అలాచేస్తే తాను ఇతరులకంటే గొప్పవాడనే భావం కలుగుతుంది కనుక.
ఒకసారి ఆయన ఆశ్రమంలోనికి దొంగ వచ్చి, దొరికిన సామాన్లు మూటకట్టుకున్నాడు. పవహరిబాబాను దొంగ చూచాడు.
ఆయన ఏమి చేస్తాడోనని భయపడి పారిపోతున్నాడు. మూటను అక్కడే వదలి.
ఆ మూటను తీసుకుని, దొంగను పరుగెత్తి పట్టుకుని, వాడి కాళ్ళవద్ద ఆ మూటనుంచి నమస్కరించి, కళ్ళవెంట భాష్పాలు స్రవిస్తుంటే, “బాబూ. నా తప్పును మన్నించు, ఈ వస్తువులు తీసుకో, అవి నీవి. నావి కావు” అన్నారు పవహరిబాబా.
ఆయన ప్రేమ, సజ్జనత్వం, మథుర స్వరం సాటిలేనివి. అతి తక్కువ ఆహారాన్ని స్వీకరించేవాడు.
అందరూ గాలినే ఆహారంగా తీసుకునేవాడని అందువల్లనే పవహరిబాబా అని ఆయనను పిలువసాగారు.
వివేకానందులు ఆయనవద్ద హఠ యోగం నేర్చుకుందామనుకున్నారు గాని కుదరలేదు.
ఒకసారి పవహరిబాబా ఆశ్రమం నుండి వచ్చిన హోమ ధూమంలో కాలిన మాంసం వాసన వచ్చింది జనానికి. జనం మూగారు.
వారు అనుమానంతో తలుపులు బద్దలుకొట్టి లోనికి వెళ్ళారు. ఆ మహాయోగి తన శరీరాన్నే తుది హవిస్సుగా హోమాగ్నిలో ఆహుతి చేశారు.
మహాత్ముల చరిత్రలు లోక సామాన్యంగా ఉండవు. వారలా ఎందుకు ప్రవర్తిస్తారో, సామాన్యుల ఊహకందదు అనే మహాకవి కాళిదాసు మాటలు పవహరిబాబాకు సరిపోతాయి.
ఆ పవహరిబాబా స్మృతి చిహ్నంగా ఒక చిన్న పుస్తకాన్ని వ్రాసి అంకితమిచ్చారు. చంద్రునికో నూలుపోగులా.
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- బాధ నుండి ఉపశమనం …. మహనీయులు – 2020… జూన్ 22
- వచ్చినవాడు రాముడు …. మహనీయులు – 2020… జూన్ 11
- యోగ కళాప్రపూర్ణ …. మహనీయులు – 2020… జూన్ 16
- గురువులంతా ఒక్కటే …. మహనీయులు – 2020… జూన్ 29
- “నీ దయ గంగా గౌతమి రామయ్య”… …. మహనీయులు – 2020… జూన్ 6
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments