Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయిబాబా ఒకసారి వర్షం కురుస్తుంటే, డెంగ్లే పొలంవద్ద నున్న ఒక చిన్న పాపాయిని వర్షం నుండి కాపాడాడు. విశేషం ఏమిటంటే, సాయిబాబా అదే సమయంలో షిరిడీలో ఉండటం.
ఒకే రూపంతో అనేక చోట్ల ప్రత్యక్షమవటం మహనీయులకు విశేషం కాదు.
తీన్ కుడిబాబా తన శిష్యుడైన మధురదాసతో నీలాచలంలో ఉన్నాడు.
“నేను ఇప్పుడే మీ అమ్మవద్ద రొట్టె తిని వచ్చాను. ఇప్పుడు మీ అమ్మ ఆకుపచ్చ రంగు చీర కట్టుకున్నది” అన్నారు.
బృందావనంలో ఉన్న అమ్మకు ఉత్తరం వ్రాసి కనుక్కున్నాడు మధురదాస.
తీన్ కుడిబాబా చెప్పిన విషయాలన్నీ సత్యమని జాబు వచ్చింది. ఒకే రూపంలో అనేక చోట్లలో ప్రత్యక్షమవగలరు మహాత్ములు.
తీన్ కుడిబాబా అసలు పేరు కిశోరీ కిశోరానందబాబా. తండ్రి హరిమోహన గోస్వామి. తండ్రికి ఎందరో శిష్యులు. ఆ శిష్యులు ఇచ్చే కానుకలతో దర్జాగా జీవిస్తోంది ఆ కుటుంబం.
విలాసవంతమైన జీవితం కొంతకాలం బాగుంది తీన్ కుడి బాబాకు. ఇక మనసు ఆధ్యాత్మికం వైపు మళ్ళింది.
రాధా, కృష్ణుల సాక్షాత్కారం ఎంతకూ కాలేదాయనకు. తపించిపోయాడు వారి సాక్షత్కారానికి.
ఎత్తుగా ఉన్న ఒక పీఠం పైన శోభాయమానంగా రాధా కృష్ణులు దర్శనమిచ్చారు.
రాధాకుండం (సరస్సు) పాల కడలిలా కనిపించింది. ఆ దృశ్యం క్షణికమే. తీన్ కుడిబాబా మనస్సంతా ప్రేమ మయమైంది. మహా భక్తుడైనాడు.
ఎందరెందరో ఆయనను దర్శించటానికి వచ్చేవారు. వారందరకు ఆహారాన్ని సమర్పించేవాడు.
ఆయన వద్దకు ధనవంతులు, బీదవారు వచ్చేవారు. ఒకసారి ధనవంతులు బాబాను దర్శించటానికి వచ్చారు. ఆ రాత్రి అక్కడే ఉన్నారు వారు.
ధనవంతులను పసిగట్టిన దొంగలు వారిని దోచుకోవటానికి రాత్రి వచ్చి కుటీరం తలుపు తట్టారు.
రండి కూర్చోండని వారికి (దొంగలకు) ఆసనం చూపాడు తీన్ కుడిబాబా.
తినేందుకు తెస్తానని, హరి నామం జపిస్తూ వంటచేసి వారికి కడుపు నిండా భోజనం పెట్టారు. ఆ దొంగలు మారిపోయారు.
తాము వచ్చిన పనిని కూడా చెప్పి “ఇక మీకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు” అని ఆ దొంగలు వంద రూపాయలు దక్షిణ ఇచ్చి వెళ్ళారు.
బాబా ప్రశాంత వదనం, ప్రేమ, హరినామ కీర్తనం మార్పు తెచ్చింది ఆ దొంగలలో.
వ్రజవాసి అయోధ్యదాస కేవలం తీన్ కుడిబాబా సేవను మాత్రమే చేసేవాడు.
బాబా అవసరాలన్నీ ముందే గ్రహించి ఏ లోటు రానిచ్చేవారు కాదు. ఆ సేవకుడు కలరా వచ్చి మరణించాడు.
అతడు కేవలం నా సేవను మాత్రమే చేశాడు. అతని గతి ఎలాగుంటుందో అని అనుకున్నాడు.
ఆయన నిద్రిస్తుంటే రాధారాణి స్వప్నంలో సాక్షాత్కరించి, “నీకంటే ముందుగానే అతను మావద్దకు వచ్చాడు” అన్నది.
ఆయన మనసు శాంతించింది. సేవ ఎవరికి చేసిన అది దైవానికే చెందుతుంది.
1984 ఫాల్గుణ బహుళనవమి నాడు (25 .3. 1984) రాధాకృష్ణుల సన్నిధి చేరాడు తీన్ కుడిబాబా.
“జయ నిత్యానందరాం, జయ నిత్యానందరాం….”
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- జయ జయ శ్రీరఘవీర సమర్థ …. మహనీయులు – 2020…ఫిబ్రవరి 22
- జయ, జయ నరసింహ!.. …. మహనీయులు – 2020… డిసెంబరు 30
- సాధన చేయుమురా నరుడా! …. మహనీయులు – 2020… మార్చి 17
- పుత్రోత్సాహం… మహనీయులు @2020 – జనవరి 2
- జయ జగదీశ హరే! … మహనీయులు – 2020… జూలై 27
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments