Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice support by: Mrs. Jeevani
ఒకసారి బేలూరు మఠానికి భార్యను కోల్పోయిన ధనిక వర్తకుడు వచ్చాడు. కొంతకాలం అక్కడే ఉన్నాడు.
అక్కడ ఉండే స్వామి సత్సంగం విని తన ఆస్తిని మఠానికి రాసి ఇస్తానన్నాడు. స్వామి బ్రహ్మానంద ఆయన కోరికను సున్నితంగా తిరస్కరించారు.
ఆ ధనికునికి వచ్చిన మార్పు తాత్కాలికమని, క్షణికమని స్వామి బ్రహ్మానంద గ్రహించాడు.
ఒకసారి సాయిబాబా వద్దకు నాయక్, శాంతారాం అనే ఇరువురు వ్యక్తులు వచ్చారు. శాంతారాం త్రాగుబోతు.
త్రాగకుండా ఒక్క రోజు కూడా గడపలేడు. షిరిడీ లో ఉన్నంతకాలం త్రాగలేదు. షిరిడీ నుండి గ్రామానికి వెళ్ళిన తరువాత శాంతారాం త్రాగుడు జోలికే పోలేదు.
నాయక్‌కు మరొక స్నేహితుడున్నాడు. పేరు సోనార్. సోనార్ కుమారుడు త్రాగుబోతు.
త్రాగుడు మాన్పించేందుకు సోనార్ విశ్వప్రయత్నం చేశాడు. ఫలితం లేదు. చివరకు త్రాగుబోతు ”నేను త్రాగకుండ బ్రతకలేను” అని చెప్పాడు.
నాయక్ సలహాపై సోనార్ కుమారుని తీసుకుని సాయి వద్దకు బయలుదేరాడు. దారిలో మన్మాడు నుంచి ఆ త్రాగుబోతుకు వమనం అవటం మొదలుపెట్టింది.
వాంతులు షిరిడీలో కాలు పెట్టేవరకు వస్తూనే ఉన్నాయి. షిరిడీకి చేరగానే ఆగిపోయాయి.
తండ్రి, కుమారులు సాయి దర్శనం చేసుకున్నారు. సాయి వారిని దీవించారు. షిరిడీలో ఉన్నప్పుడు ఆ త్రాగుబోతు త్రాగుడంటే అసహ్యించుకున్నాడు.
సాయి అనుమతితో వారు గ్రామం చేరారు. త్రాగుబోతు త్రాగటం మానివేశాడు. అది అందరికి వింతగా అనిపించింది.
భాద్రపద (సెప్టెంబరు) మాసంలో గౌరీ పూజ చేసుకున్నారందరూ. నిమజ్జన సమయంలో త్రాగుడు మానివేశానని ఎంత చెప్పినా ఇతరులు వినకుండా, అతనిచే త్రాగించ ప్రయత్నించారు.
”నేను త్రాగను సారాలో సాయి కనిపిస్తున్నాడు” అన్నాడతను. అయినా అతనిని స్నేహితులు వదలలేదు. వద్దని మొత్తుకుంటున్నా త్రాగించారు.
అతను స్పృహ కోల్పోయాడు. త్రాగటాన్ని వదలివేసిన అతడు శ్లాఘనీయుడు. బుడ్డి చూడగానే స్నేహితుల బలవంతం అనే సాకుతో త్రాగకుండా, తనంతట తాను త్రాగటానికి వ్యతిరేకత చూపాడు. ఇదే సాయి కోరే పట్టుదల
మనం నిశ్చయ బుద్ధితో ఉంటే చాలు.
అంతా సాయియే చూచుకుంటాడు.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- శ్రీ సాయి శాంతారం మరియు సోనార్ కొడుకులను వ్యసనాల నుండి తప్పించుట
- ఓం కర్మ ధ్వంసినే నమః…..సాయి@366 సెప్టెంబర్ 3….Audio
- ఓం శేష సాయినే నమః …..సాయి@366 సెప్టెంబర్ 24…Audio
- ఏమి నీ కోరిక? …..సాయి@366 సెప్టెంబర్ 4…Audio
- పేరు మార్పు – అంతే …..సాయి@366 జూలై 25…Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments