అన్నింటా గురువే! …. మహనీయులు – 2020… సెప్టెంబరు 25



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిబాబా హేమాడ్ పంతును గూర్చి “ఇతడు నాస్తికుల, దుర్మార్గుల సహవాసాన్ని విడువ వలెను” అన్నారు. సాయి బోధ ఇతర యోగుల కన్నా భిన్నంగా ఉండదు.

టిబెట్ యోగి గంపోపా గురువు మిలారేపా. గత జన్మలలో గంపోపా బోధిసత్వుని 4వ అవతారమైన శాక్యముని వద్ద శిష్యుడు.

వైద్య శాస్త్ర విద్యార్థి. అతడు ఏమి ఇచ్చినా వ్యాధి తగ్గేది. అసలు అతని పేరు చెప్పినా వ్యాధులు పోయేవి ఆ గత జన్మలో.

ఈ జన్మలో కూడా వైద్యునిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఒక ఆమెకు అంతిమ ఘడియలు వచ్చాయని గంపోపాకు తెలుసు.అయినా ఆమె ప్రాణం నిష్క్రమించటం లేదు.

“ఏమిటి నీ కోరిక?” అని భార్యను అడిగాడు. మరణ శయ్యపై ఉన్న ఆమె “నీ వయస్సు 24 ఏండ్లు. చాలా అందగాడివి. నీపై ఆకర్షణతో ఉన్నాను” అంది.

అతడు వెంటనే గ్రహించాడు. “నీ మరణానంతరం నేను మరల వివాహం చేసుకొనను. బౌద్ధ సన్యాసిగా మారతాను” అన్నాడు. ఆమె నిశ్చింతగా కన్ను మూసింది.

అతడు బుద్ధ పథంలో ఉన్నాడు. ధ్యానం నేర్చాడు. సరైన గురువే దొరకలేదు.

ఒక రోజున బౌద్ధ ఆరామం వద్ద ఉన్నాడు. అక్కడ ముగ్గురు బిచ్చగాళ్ళు మాట్లాడుకొంటున్నారు.

అక్కడ నిలబడి వారి మాటలు విన్నాడు. మొదటి బిచ్చగాడు కడుపునిండ తిండి, బుట్టెడు ఫలాలు పనిచేయకుండా దొరికితే చాలు అన్నాడు.

రెండవ వాడు రాజు వలే సర్వ సౌఖ్యాలు అనుభవిస్తే చాలు అన్నాడు.

మూడవ బిచ్చగాడు మహారాజైనా మరణం తప్పదు. సింహం వలె ఆకాశంలో విహరిస్తూ, దేవతలు ఇచ్చే మధువు త్రాగే మిలారేపా జీవితమే జీవితం అన్నాడు.

మిలారేపా పేరు వినగానే గంపోపా పరవశించిపోయారు. ఆ ముగ్గురిని తన ఇంటిని భోజనానికి రమ్మన్నాడు.

భోజనాల అనంతరం మిలారేపాను గూర్చి అడిగాడు. మూడవ వాడు తాను మిలారేపాను చూడలేదని. అందరూ చెబుతుండగా వినటమేనని, కానీ అయన ఉండే ప్రదేశాన్ని తెలిపాడు.

గంపోపా తన ఆస్తిని అమ్మి, బంగారు నాణేలు సమకూర్చుకుని, 45 రోజులు కాలి నడకన మిలారేపా గ్రామానికి చేరాడు.

ఆ గ్రామపు పొలిమేరల్లో మిలారేపా శిష్యులు కనపడి మీరేనా గంపోపా అని అడిగి, గంపోపాను గురువైన మిలారేపా దగ్గరకు తీసుకుపోయారు.

గంపోపా తన ధనాన్ని సమర్పించాడు. “నీవే ఉంచుకో, అవసరం వస్తుంది” అన్నారు మిలారేపా.

మిలారేపాను కలిసినందుకు సంతోషం వెలిబుచ్చాడు గంపోపా. “అదేమిటి నేను నీతో లేనా? అన్నాడు మిలారేపా.

ఆ ముగ్గురు భిక్షకులు మిలారేపా అని గ్రహించి సంతసించాడు గంపోపా.

“దుష్ట జనులతో సావాసం చేయవద్దు” అని తీవ్రమైన హెచ్చరిక చేశాడు మిలారేపా గంపోపాకు.

తేదీ వివరాలు లభించలేదు.

అన్నింటా గురువే.

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles