Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio has been prepared by Mrs Lakshmi Prasanna
- Mir-36-Baba-Darshan-2-by-Lakshmi-Prasanna 2:51
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
శ్రీమతి సీతారావమ్మ
పిల్లలు పుట్టటానికి బాబా కాలితో తన్ని ఆశీర్వదించుట.
ఈమె భర్త ఒక లెక్చరర్. వీరికి సంతానం లేదు. అందువలన భర్త ఈమెను చులకన చేస్తుండేవాడు.
ఒకసారి ఈమె గాలి శారదాదేవితో కలిసి దసరా ఉత్సవములో షిర్డీ వెళ్లి బాబాను దర్శించారు.
బాబా దుర్గాష్టమి రోజు సీతారావమ్మను తమ వద్దకు పిలచి, తమ పాదాలకు నమష్కరించుకోమని చెప్పారు.
అప్పుడు ఆమె ఆయన పాదాలకు నమస్కారిస్తూ ఉండగా బాబా ఆమె పొట్టపై కాలితో చాచి తన్ని, ఇక ఇక్కడ ఉండవద్దు, మీ ఇంటికి పొండి అని కోపంగా అరిచారు.
నిజానికి వారు షిర్డిలో దసరా ఉత్సవాలు చూడాలని వచ్చారు. అయినప్పటికీ బాబా వెళ్ళిపొమ్మనుటతో వారు ఇంటికి తిరిగి వచ్చారు.
ఈమె భర్త చులకనగా మాట్లాడుతుంటే శారదాదేవి ఆమెతో “సాయిబాబా లీలలకు ఎన్నియో అర్ధాలు ఉంటాయి. కాబట్టి ఎవరి మాటలు లక్ష్య పెట్టక సాయిబాబాను నమ్మియున్న తప్పక మేలు కలుగుతుంది” అని చెప్పింది.
అటు తరువాత 5 నెలలకు గర్భము ధరించి ఒక మగపిల్లవానిని ప్రసవించినది.
ఈ పిల్లవాడు పుట్టిన తొమ్మిదవ రోజు రాత్రి సీతారావమ్మ భర్తకు సాయిబాబా స్వప్నమున దర్శనమిచ్చి “నీ భార్యకు పిల్లలు లేరని నీవు చులకన చేస్తూ నీచాతినీచముగా మాట్లాడినావు.
ఆమె మహా ఇల్లాలు. ఇంతకాలము నోరు మూసుకున్నది. ఇంకను ఆమెకు ఇద్దరు కుమారులు కలుగుతారు. ఈ బిడ్డకు సాయి కుమార్ అని పేరు పెట్టు” అని చెప్పారు.
బిడ్డకు బాబా చెప్పినట్లుగా పేరు పెట్టి అప్పటి నుండి భార్య భర్తలు అన్యోన్యంగా యుండసాగిరి.
సాయిబాబా యొక్క కోపం వలన భక్తునకు మేలు కలుగుతుందని ఎన్నో లీలలలో తెలుసుకున్నాము.
ఈ లీలలో బాబా ఒక స్త్రీని తన్ని కోపంతో వెళ్ళమనుట వలన ఆమెకు పుత్ర సంతతి కలుగుట, భర్త ఆమెతో సరిగా మెలగుట చూడవచ్చు. అ
లా తన్నుటలో ఆమె గర్భసంచి మొదలగు పిల్లలు కలుగు అవయవములు సరిచేయట బహుశ జరిగి యుండవచ్చు.
source: షిర్డీ సాయి సన్నిధి ద్వారకామాయి లీలలు, రచన: అల్లూరి గోపాలరావు గారు
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
Latest Miracles:
- బాబాను దర్శించిన తెలుగు భక్తులు – మొదటి భాగం–Audio
- బాబాను దర్శించిన తెలుగు భక్తులు – మూడవ భాగం—Audio
- బాబాను దర్శించిన తెలుగు భక్తులు – నాల్గవ భాగం—Audio
- సాయిని దర్శించిన తెలుగు మహిళ …..సాయి@366 ఆగస్టు 8…Audio
- శ్రీమతి చంద్రాబాయి బోర్కర్ రెండవ భాగం–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “బాబాను దర్శించిన తెలుగు భక్తులు – రెండవ భాగం–Audio”
వరదా భాస్కరాచార్యులు
August 27, 2017 at 9:43 pmసాయి శరణం