ఆస్పత్రిలో సుహాస్ కు బాబా దర్శనమిచ్చుట—Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


This Audio has been prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-38-Baba-Suhas-by-Lakshmi-Prasanna 8:19

అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

సాయి బంధువులందరికీ గురు పొర్ణమి శుభాకాంక్షలు

మనసు ఎప్పుడయితే స్వచ్ఛంగా ఉంటుందో అప్పుడే భగవత్ సాక్షాత్కారానికి గొప్ప అవకాశం ఉంటుంది.

సుహాస్ నాలుగున్నర సంవత్సరాల బాలుడు. 

అతని తండ్రి శ్రీ జయవంత్ పవార్ థానే జిల్లాలో జిల్లా పరిషత్ వైస్ ప్రెసిడెంట్. 1981 ఫిబ్రవరి 14న పరేల్ లో ఉన్న వాడియా ఆస్పత్రి (పిల్లల ఆస్పత్రి) లో సుహాస్ ని చేర్పించారు.

అతని పరిస్థితి ప్రతి నిమిషానికి ప్రమాదకరంగా మారుతోంది. పరిస్థితి ప్రమాదకరంగా ఉండటం వల్ల ఆ పిల్లవాడిని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంచి, ఆక్సిజన్ కూడా పెట్టారు. శక్తినివ్వడానికి సెలైన్ కూడా పెట్టారు.

డాక్టర్ జయవంత్ రావ్ యాదవ్ నర్సుతో సహా సుహాస్ ప్రక్కనే ఉన్నారు. అప్పుడు సమయం ఉదయం 3 గంటలయింది.

సుహాస్ తలిదండ్రులు ఊపిరి బిగబట్టి చాలా ఆతృతగా అతని పరిస్థితిని గమనిస్తూ ఉన్నారు. పిల్లవాని పరిస్థితి క్షణాలు గడిచే కొద్దీ చాలా ఆందోళనకరంగా మారుతూ ఉండటం వారికి చాలా బాధ కలిగిస్తోంది.

డా.జాదవ్ అతని పరిస్థితిని నిరంతరం గమనిస్తూనే ఉన్నారు. అకస్మాత్తుగా సుహాస్, “డాక్టర్ కాకా, మీరు కూర్చున్న కుర్చీమీదనించి లేవండి. చూడండి సాయిబాబా వచ్చారు. ఆయనకు మనం మర్యాద చేయాలి.

ఆయన కూర్చోవడానికి కుర్చీ చూపించండి” అన్నాడు. సుహాస్ అన్న ఈ మాటలు విన్న డా.జాదవ్ కి ఒక నిమిషం పాటు ఏమీ అర్ధం కాలేదు. 

బహుశా సుహాస్ మగతలో ఉండి పరాకు మాటలు మాట్లాడుతున్నాడేమోనని అనుమానం కలిగింది.

“బాబూ! ఏమిటి నువ్వు చెపుతున్నది? ఎక్కడున్నారు సాయిబాబా? నాకెందుకు కనబడటంలేదు?” అన్నారు డాక్టర్.

ఆయన ప్రశ్నలకు సుహాస్ స్పృహలోనే ఉండి సమాధానమిచ్చాడు.

“డాక్టర్ కాకా, సాయిబాబా ఇక్కడ ఉన్నారు. ఆయన మీ ప్రక్కనే నిలబడి ఉన్నారు. నేనాయనను చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాను. ఆయన కూర్చోవడానికి మీరెందుకని కుర్చీ చూపించటంలేదు?”

సుహాస్ వయసును బట్టి చూస్తే అతను తన పెద్దవాళ్ళ ద్వారా సాయిబాబా పేరు విని ఉండవచ్చు.

కాకపోతే ఆయన ఫోటోనయినా చూసి వుండవచ్చనుకున్నారు డాక్టర్. కాని సుహాస్ చాలా అదృష్టవంతుడు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్లాడుతున్న ఈ దురవస్థ సమయంలో సాయిబాబా అతని వద్దకు వచ్చారు.

  ఏమయినప్పటికి శ్రీసాయిబాబా దర్శనంతో అతని పరిస్థితి కొంచెం మెరుగై, సాయినాథులవారి ఆశీర్వాదబలంతో కుదుటపడ్డాడు. 

నిజానికి 1981 జనవరి 24 నుండి సుహాస్ అనారోగ్యంగా ఉన్నాడు.  అతని తండ్రి థానేలోనే ఉండటంవల్ల సుహాస్ ని జనవరి 24న థానేలో ఉన్న డా.అగర్వాల్ ఆస్పత్రిలో చేర్పించారు.

ఆ బాలుడు ఫిబ్రవరి 13, 1981 వరకూ ఆ ఆస్పత్రిలోనే ఉన్నాడు. రాత్రి సమయంలో అతని పరిస్థితి ఏమీ బాగుండకపోవటంతో, ప్రతిరాత్రి ఆక్సిజన్, సెలైన్ రెండూ పెట్టవలసి వచ్చేది.

నిద్రపోయే సమయంలో శ్వాస పీల్చుకోవడం చాలా యిబ్బందిగా ఉండేది.  అన్నిరకాల ఎక్స్- రే పరీక్షలు చేసి, మందులు వాడినా గాని, అతని పరిస్థితిని ఏవిధంగానూ మెరుగు పరచలేకపోయారు.

పగలు మాత్రం సుహాస్ బాగానే ఉంటూ ఆటలు కూడా ఆడుతూ ఉండేవాడు.  కాని, రాత్రి నిద్రపోయిన గంట తరవాత శ్వాస పీల్చుకోవడానికి యిబ్బంది పడేవాడు.

ప్రతిరోజూ జరిగే ఈ వైద్యం వల్ల సుహాస్ నిరాశతో బలహీనంగా తయారయ్యాడు.

ఆఖరికి ప్రముఖ పిల్లల వైద్యుడు డా.మర్చంట్ గారిని సంప్రదించడానికి నిర్ణయించుకున్నారు. ఆయన పరేల్ లోని వాడియా చిన్నపిల్లల ఆస్పత్రిలో గౌరవ డాక్టర్ గా పనిచేస్తున్నారు.

డా.మర్చంట్ గారు సుహాస్ ని పరీక్షించారు.  కాని ఎంతో జాగ్రత్తగా పరీక్ష చేసిన తర్వాత కూడా అతని రోగానికి తగిన కారణం కూడా ఇదమిత్థంగా చెప్పలేకపోయారు.

అందుచేత ఆయన సుహాస్ ని  ఆస్పత్రిలో చేర్చుకోవడానికి అయిష్టత వ్యక్తం చేశారు. సుహాస్ ని బాంద్రాలో ఉన్న మరొక బంధువుల యింటికి తీసుకొని వెళ్ళారు.

అక్కడ సుహాస్ కి శ్వాస పీల్చుకోవడంలో యిబ్బంది కలిగేటప్పటికి వెంటనే ఆస్పత్రిలో చేర్పించడానికి నిర్ణయించుకొన్నారు.  డా.జయంత్ రావ్ జాదవ్ గారికి సుహాస్, అతని తల్లిదండ్రులు అందరూ తెలుసు. అందుచేత ఆయన కూడా వెళ్ళి సుహాస్ ని ఆస్పత్రిలో చేర్పించారు.

ఆ అబ్బాయి పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉండటంతో ఆక్సిజన్, సెలైన్ పెట్టాల్సి వచ్చింది. మరునాడు డా.మర్చెంట్ గారికి, సుహాస్ కి వచ్చిన జబ్బు గురించి, రాత్రి చేసిన వైద్యం గురించి వివరంగా చెప్పారు.

అన్నిరకాల వైద్యం అప్పటికే జరిగిపోయినందువల్ల యిక ఆఖరి ప్రయత్నంగా బ్రాంకోస్కోప్ చేసి చూద్దామని డా.మర్చంట్ గారు చెప్పారు.

కాని ఈ వైద్యం చేయాలంటే ఒక బాధ్యత గల వ్యక్తి యొక్క అనుమతి అవసరం అని చెప్పారు. ఆ సమయంలో అక్కడ సుహాస్ తలిదండ్రులు లేరు. అందుచేత వైద్యం వాయిదా వేయవలసిన పరిస్థితి.

అదేరోజు రాత్రి సుహాస్ యింటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉన్నాడు.

అతని ప్రక్కనే డా.జయంత్ రావ్ జాదవ్ కూడా వున్నారు. అప్పుడే అతను బాబాను తన మంచం ప్రక్కన చూడటం, వెంటనే డా.జాదవ్ తో బాబా కూర్చోవడానికి కుర్చీ చూపించమని అడగటం జరిగింది. 

కొంతసేపయిన తరువాత డా.జాదవ్ ఐ.సీ.యూ. లోనుంచి బయటకు వచ్చి, సుహాస్ మంచం ప్రక్కన ఏమి జరిగిందో అంతా వివరంగా అతని తల్లిదండ్రులకు వివరించారు.

ఈ సంఘటన శ్రీసాయిబాబా ఆశీస్సులు సుహాస్ కు లభించాయని చెప్పడానికి సంకేతం.

ఆస్పత్రిలో ఉన్నవారందరూ కూడా యిక ఆందోళన చెందనవసరం ఏమీలేదని సుహాస్ తల్లిదండ్రులతో చెప్పారు.

మరునాడు ఉదయం  గం.10.30 కు సుహాస్ ని కెం ఆస్పత్రికి తీసుకొని వెళ్ళారు. డా.కార్నిక్, డా.జయంత్ జాదవ్ గార్లు బ్రాంకోస్కోపీ పరీక్ష విజయవంతంగా నిర్వహించారు.

సాయంత్రానికి సుహాస్ బాగా కోలుకొని ఆడుకోవడం మొదలుపెట్టాడు. బ్రాంకో స్కోపీ పరీక్షలో చిన్న రబ్బరు గొట్టాన్ని శ్వాసనాళంలోకి పంపి, శ్వాసకోశంలో శ్వాసకు అడ్డంపడి అవరోధం కలిగించేవి ఏమన్నా ఉన్నాయేమోనని పరీక్షిస్తారు.

లోపల ఏ అవయవాలకి ఎటువంటి హాని కలుగకుండా ఈ పరీక్ష చాలా జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది.

ఈ పరీక్షలో, శ్వాసనాళంలో ఇరుక్కున్న చింతగింజ యొక్క చిన్నముక్క ఒకటి బయటకు వచ్చింది. అది బయటకు తీసిన వెంటనే సుహాస్ కు శ్వాస పీల్చుకోవడంలో ఎటువంటి యిబ్బందీ కలుగలేదు.

అంత చిన్నవయసులోనే బాబా దర్శనం కలగడం సుహాస్ అదృష్టం.

శ్రీసాయినాథులవారు వచ్చారనడానికి డా.జాదవ్ గారికి  సాక్ష్యం దొరికింది. మనం కూడా శ్రీసాయిబాబాపై స్వచ్ఛమయిన భక్తిని తెలుపుకొని ఆయన అనుగ్రహానికి పాత్రులవుదాము.

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles