Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
పేరు తెలియని ఒక బాబా భక్తుడు చెప్పిన లీల
బాబావారి అనుగ్రహపు జల్లు నామీద నిరంతరం ఎంతగా కురుస్తోందంటే, ఆయనతో నాకు కలిగిన అనుభూతిని, వాటిలో నుండి ఏది నిర్ణయించుకొని చెప్పాలో కష్టం.
సాయిబాబా నాకు దర్శనమిచ్చిన వాటిలో మహదీ బువాగారికి కి కూడా సంబంధించినది ఒకటి ఉంది.
నేను మహదీ బువా గారి వద్దకు వెళ్ళి కొంత సమయం ఆయనతో గడిపి వస్తూ ఉండేవాడిని.
1943 ప్రాంతంలో ఒకరోజు నేను మహదీ బువాగారిని కలుసుకున్న తరువాత, అక్కడినుంచి నేనొక్కడినే హోటల్ లో భోజనం చేయడానికి బయలుదేరాను.
బ్రహ్మచారిని అయినందువల్ల, హోటల్లో భోజనం చేయవలసిన పరిస్థితి వచ్చి, నేను స్వయంగా వండి బాబాకు నైవేద్యం పెట్టే అవకాశం లేకుండా పోయిందే అని ఒక్కక్షణం అకస్మాత్తుగ నామనసుకు అనిపించింది.
ఇలా ఈ పరిస్థితి వచ్చినందుకు చాలా ఖిన్నుడినయి, వంటరిగా నేనొక్కడినే భోజనం చేస్తున్నందుకు క్షమించమని బాబాను ప్రార్థించాను.
అకస్మాత్తుగా, నా ఆశ్చర్యానికనుగుణంగా, నా బల్లకెదురుగా మహదీబువ గారు, బాబా, ఇద్దరూ భోజనం చేస్తూ ఉండటం చూశాను.
మొట్టమొదటగా నాకెంతో సంతోషం కలిగింది. తరువాత నన్ను నేనే నిందించుకొన్నాను. అఱచేతులతో కణతలు నొక్కుకొని, కన్నీళ్ళతో “బాబా నేను పాపిని” అన్నాను బాబాతో. ఇక్కడ మీరు భోజనం చేస్తున్నట్లుగా నాకు దర్శనమిచ్చి , నాకు మీరు ప్రసాదించిన ఇంతటి గొప్ప గౌరవానికి నేను తగను.
కొద్ది సమయంలోనే బాబా, మహదీబువా ఇద్దరూ అదృశ్యమయారు. ఆరోజున బాబా, మహదీబువా వాస్తవంగా హోటల్ కి వచ్చారా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలని నిశ్చయించుకొని హోటల్ నుండి బయటకు వచ్చాను. అలా నిశ్చయించుకొని నేను మహదీ బువా గారి వద్దకు వెళ్ళి జరిగిన విషయాన్నంతా వివరంగా చెప్పి, “ఆ దృశ్యం నిజమేనా” అని ఆయనను అడిగాను.
బాబా మీద నాకున్నటువంటి అత్యంత భక్తి, బాబాతో నాకున్నటువంటి తీవ్రమయిన, నిరంతరమయిన ఏకాగ్రత వల్లనే ఆయన దర్శనం కలిగిందని, అది నిజమేనని చెప్పారు.
అయినప్పటికీ నేనాయనను ఒక ప్రశ్న అడిగాను “మీరు కూడా కనిపించారు కదా? మీరెందుకు వచ్చారు?” తాను ఆరోజు భౌతిక శరీరంతో హోటల్ కు రాలేదని ఒప్పుకున్నారు.
ఇంకా ఆయన, బాబా తన అద్భుతమయిన శక్తితో ఒకే సమయంలో రెండు శరీరాలను ధరించగలరని చెప్పారు.
క్రింద శ్రీ బీ.వీ.నరసిం హ స్వామీజీ గారి వివరణ:
బొంబాయిలో నివసిస్తున్న, పేరు చెప్పడానికిష్టపడని ఈ నిజమైన భక్తుడిని నేను చూశాను. ఆయన చెప్పినదంతా నిజమని నేను నమ్ముతున్నాను.
సాయిసుధ
మార్చ్, 1950
శ్రీ సాయి భక్తుని గురించిన సమాచారం ఈ లింక్http://telugublogofshirdisai.blogspot.co.ke ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- ఉధితో ఐదింతలైన ఆహారం–Audio
- బాబా దయ వలన పునర్జన్మ
- సచ్చరిత్ర పారాయణ వలన ప్రాజెక్ట్ వచ్చింది
- బాబా కృప వలన మా అమ్మగారి కాళ్ళలో పుండ్లు మాయమైనాయి–15
- బాబా రక్షక వలయం లో ఉండటం వలన మృత్యువు కోరల వరకూ వెళ్ళిపోయినా నేను బతికి బయటపడటం జరిగింది.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments