Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
బాబా కృప వలన మా అమ్మగారి కాళ్ళలో పుండ్లు మాయమైనాయి ….
సాయిబాబా సాయిబాబా సాయిబాబా …
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధి రాజ యోగిరాజ
పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
ఈ రోజు బాబా భక్తులు అయిన వీరేష్ గారి జీవితంలో బాబా ప్రసాదించిన అనుభవం ఆయన మాటల్లో …
నా పేరు వీరేష్.మేము కరీంనగర్ జిల్లా,ఆదోనిలో నివసిస్తున్నాము.
మా అమ్మగారి పేరు రంగమ్మ.ఆమెకు రెండు సంవత్సరాల క్రితం రెండు పాదాలలో పుండ్లు లేచి 5నెలలు చాల బాధపడ్డారు.
ఈ సమస్య చాల ఎక్కువై కనీసం నడవలేకపోయారు.మేము చాల మంది డాక్టర్స్ దగ్గర చూపించిన ఫలితం కొంతవరకే అయ్యింది.అవిపెద్దగా అయిపోయి వ్యాధి తీవ్రతరం అయి పోయింది.డాక్టర్స్ కూడా దీనికి కారణం చెప్పలేకపోయారు.
అప్పుడు అకస్మాత్తుగా ఒకరోజు నా స్నేహితుడు అయిన దొరబాబు అనే వ్యక్తి నాకు ఒక సలహా ఇచ్చారు.నీ సమస్యను బాబాకు చెప్పుకుని,మీ అమ్మగారి వ్యాధి తగ్గితే వెండి పాదుకలు చేయించి,షిర్డీ వచ్చి హుండీ లో బాబాకి సమర్పిస్తానని మొక్కుకొమ్మని చెప్పారు.
నేను అలానే బాబాని ప్రార్ధించి బాబాకు వెండి పాదుకలు ఇవ్వాలని దృఢంగా నిర్ణయించుకున్నాను.
మా అమ్మగారికి కొన్ని రోజులలోనే కాళ్లలోని పుండ్లు మాయమైయ్యాయి.
నేను మొక్కుకున్నట్లు బాబాకి షిర్డీలో వెండిపాదుకలను సమర్పించాను.బాబాలీలలు అనిర్వచనీయం.
ఈ లీల బాబా సచ్చరిత్రలోని శ్యామా తల్లి సప్తశృంగిదేవి కి మొక్కిన వెండికుచముల మొక్కును పోలిఉన్నది.
శ్యామతల్లి తన కుచముల మీద తామర వ్యాధివచ్చినపుడు తగ్గితే,సప్తశృంగిదేవికి వెండికుచములను సమర్పించాలని అనుకుంటుంది.ఆమె తదనంతరం ఆమె కుమారుడు అయిన శ్యామా తన తల్లి మొక్కును మర్చిపోయినప్పుడు బాబానే దానిగురించి గుర్తుచేస్తే శ్యామా “బాబా నువ్వే నాకు ఆ జగన్మాతావు “కావున నువ్వే దానిని స్వీకరించమని అడుగగా బాబా ఆ మొక్కును స్వీకరించక వని పట్టణానికి వెళ్లి ఆ మొక్కును చెల్లించమని ఆదేశిస్తారు”.
ఆ రోజు సాయి చేసిన ప్రతి లీల ఈ రోజుకి చేస్తూనే ఉన్నారు.
“నా సమాధి నుండి సర్వకార్యాలను నిర్వర్తించును”అని బాబా చెప్పిన ఏకాదశ సూత్రాన్ని నిత్యసత్యంగా ఆయన భక్తులకు చూపిస్తూనే ఉన్నారు.
ఎల్లపుడు సాయి ఎరుకలో సాయిభక్తులు అందరు ఉండాలని నా కోరిక….
– సర్వం సాయినాథార్పణమస్తు –
Latest Miracles:
- బాబా కృప వలన మా అమ్మగారి కాళ్ళలో పుండ్లు మాయమైనాయి–Audio
- ఇదంతా సాయి మహిమేనని నా ప్రగాఢ విశ్వాసము–Audio
- అంతే కదా!…..సాయి@366 నవంబర్ 6….Audio
- జీవిత కాలాన్ని పెంచిన బాబా–Audio
- ప్రేమగా పెడితే నేను ఏదైనా తింటానని తినకపోవడం అంటూ ఉండదని నాకు సందేశమిచ్చారు–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
2 comments on “బాబా కృప వలన మా అమ్మగారి కాళ్ళలో పుండ్లు మాయమైనాయి–15”
Madhavi
January 8, 2018 at 6:21 amJaisairam..Baba bless u all..
Dhananjay patil shirdi
May 18, 2018 at 8:59 pmSaibaba will bless you Tejasvini