భక్తుడి తమ్ముని జబ్బు, శిరిడీలో బాబా తగ్గించిన విచిత్ర వైనం



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


నాకు నా సాయి నాథుని ప్రవిత్ర నగరి శిరిడీ మొదటి సారి వెళ్ళే అదృష్టం దగ్గర దగ్గర 10 సంవత్సరాల క్రిందటనే కలిగింది.

శిరిడీ చేరి నేను మొదట సారి సమాధి మందిర్ బాబా దర్శనం కోసం వెళ్ళాను. నేను ఎంత ఆకర్షితుడిని అయినానంటే, ఇంకా నా జీవితం మొత్తం ఆయన కృప కు పాత్రమైంది. నాకు అప్పటి నుంచి అన్ని బాబానే.

2000 సంవత్సరం నుంచి నేను ప్రతి సంవత్సరం బాబా దర్శనార్థం క్రమం తప్పకుండ శిరిడీ వెళ్ళేవాడిని.

అక్కడ అడుగు పెట్టిన వెంటనే అంతు పట్టని ఆనందం మనసుకు కలిగిస్తుంది. అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది.

నా సాయినాథునికి నా మీద వున్న కృప, ప్రేమ, స్నేహం నాకు అయన మీద వున్న దృఢవిశ్వాసం. ఇది నా అనుభూతి మీకు చెప్పబోతున్నాను.

నేను ఒక నియమ బద్డంగా శిరిడీకి వెళ్తాను. 2 నెలల ముందే బాబాను అడుగుతాను, అయన సమక్షంలో ఎటువంటి పరిస్థితిలోనైనా programme మార్చుకోను, అని నిర్ణయం తీసుకుంటాను.

అయన కృప వలన చాలా సంవత్సరాల నుంచి ఇలా ప్రతి సంవత్సరం ఒక సారి శిరిడీ వెళ్తాను. ఈ సంవత్సరం కూడా అలాగే బాబా ఆజ్ఞతీసుకొని ticket Book చేసుకున్నాను.

నేను ఇంక శిరిడీ వెళ్ళే రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. ఇంక 3 days లో వెళ్ళాలి. అంతలో నా తమ్ముడికి ఆరోగ్యం క్షిణిస్తూ వచ్చింది.ఎన్ని మందులు ఇచ్చినా బాగు కావడం లేదు.

నా తమ్ముడి ఆరోగ్యాన్ని మనసులో పెట్టుకొని, శిరిడీ వెళ్లాలంటే ఇష్టం లేదు, వెళ్ళి కూడ వుండలేను. నా మానసిక పరిస్థితి డోలాయమానంగా మారింది.

అయినా మనసులో కోరిక, ఎలాగైనా శిరిడీకి బాబా నన్ను రప్పిస్తారు అని, ప్రయాణం రోజు ఇంకోసారి నా తమ్ముడిని doctor దగ్గరికి తీసుకెళ్ళాను.

బాబా కృప వలన నా తమ్ముడి ఆరోగ్యం మెరుగుపడింది కాని చాలా నీరసంగా వున్నాడు. అందుకని doctor glucose ఎక్కించారు.

అప్పుడు నా తమ్ముడు అన్నాడు, నువ్వు శిరిడీ కి plan ప్రకారం వేళ్ళు, నేను బాగానే వున్నాను అన్నాడు. అందుకని నేను శిరిడీకి ప్రయాణం అయ్యాను.

తరువాత రోజు శిరిడీ చేరాను. చేరిన వెంటనే ఇంటికి phone చేశాను, తమ్ముడు ఎలా వున్నాడని, అప్పుడు తెలిసింది నా తమ్ముడి పరిస్థితి బాగాలేదని, serious గా వుందని, Hospital లో admit చేశారని.

రక్త పరీక్ష చేస్తే dengue అని తెలిసింది. పరిస్థితి చేయి దాటి పోయింది అని నా తమ్ముని భార్య ఏడుస్తూ మమ్ములను వచ్చేయండి అని చెప్పింది.

నేను చెప్పాను, నేను బాబా దగ్గర వున్నాను శిరిడీలో ఏమి కాదులే అని మాత్రం అనగలిగాను. నేను వెంటనే సమాధి మందిర్ వైపు పరుగులు పెట్టాను.

ఒక వైపు తమ్ముడి పరిస్థితి బాగాలేదు, ఏమి చేయాలో తెలియక బాబా, బాబా అంటూ సమాధి మందిర్ లో బాబా ముందు ఏడ్చేశాను తట్టుకోలేక (తమ్ముడిని వదిలి వచ్చాను అలాంటి స్థితిలో అన్న భావన నన్ను పీడిస్తూనే వుంది).

అప్పుడు సమాధి దగ్గర ఒక బీద బ్రాహ్మణుడు ఈ విభూతి తీసుకొని వెంటనే తమ్ముడికి ఇవ్వు. అంతకన్నా ముందు నీ తమ్ముడిని స్మరిస్తూ నువ్వు కొంచెం నీళ్ళలో కలుపుకొని తాగు, బాబా సర్వాంతర్యామి బాగు చేస్తాడు.

అంతె వెంటనే బయటికి వచ్చి విభూతిని నీళ్లలో కలిపి నా తమ్ముడిని స్మరిస్తూ ఆ నీళ్ళు తాగేశాను. ద్వాకామాయిలోకి వెళ్ళి కూర్చున్నాను.

తరువాత రోజు నాకు return train . విభూతి నాకు ఇవ్వడానికి బ్రాహ్మణుడు సమాధి మందిర్ లో ఎందుకు కనపడ్డాడు. ఏమో …బాబా కే తెలియాలి.

ద్వారకామాయిలో కూడా బాబాను నా తమ్ముడి గురించే ప్రార్దిస్తువున్నాను. నేను వెళ్ళవలసిన రోజు వచ్చింది. తిరుగుప్రయాణంలో మా వూరు చేరి వెంటనే ఇంటికి వెళ్ళాను.

ఇంట్లో చూశాను కదా …నా తమ్ముడు పూర్తిగా dengue నుంచి కోలుకున్నాడు. అప్పుడే వాళ్ళు Hospital నుంచి ఇంటికి వచ్చారు.

నేను అడిగాను ఎప్పుడు బాగా అయినావు అంటె, నిన్న నేను శిరిడీలో విభూతి నీళ్ళలో కలుపుకొని తాగినప్పటి నుంచి జ్వరం అసలు లేదు. dangue వున్న చిన్న గుర్తుకూడా లేదు.

చూడండి ఈ లీల మొత్తం గమనిస్తే , నా శిరిడీ యాత్ర క్రమం తప్పకుండా వెళ్ళగలిగాను. నేను వచ్చేసరికి నా తమ్ముడు కూడా బాగ అయినాడు.

వాడు వాడి కర్మ అనుభవించాడు. దృఢమైన భక్తి విశ్వాసం వుంటే, మనల్నే కాదు, మనకి కావలిసిన వాళ్ళను కూడా బాబా చేరదీస్తారు.

లలిత్ K కాలరా,
గురుగావ్ హర్యానా

ఈ బాబా వారి లీల తెలుగు లోకి అనువదించిన వారు : మాధవి, భువనేశ్వర్

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

7 comments on “భక్తుడి తమ్ముని జబ్బు, శిరిడీలో బాబా తగ్గించిన విచిత్ర వైనం

dillip

beautiful miracle.madhavi mam. sairam

T.v.pramada

Chala manchi experience sai ram

Maruthi Sainathuni

Sai Baba…Sai Baba

Rohith T V

Om Sai Ram!

Madhavi

Manam chadive saicharitraku daggaragaa vundhi.ee leela.Nana saaheb okasari udhi eypoindhi ani mattini teesukoni baba nu smarinchi oka bhakthurali jabbu nu nayam chesaru..jai sai ram…..

ఈ లీల చాల బాగుంది…నేను ఒకసారి Barbar షాప్ కి వెళ్ళినప్పుడు .. ఇద్దరి సంభాషణలు విని చాల భాధ అనిపించింది…వారిద్దరిలో ఒకరి అబ్బాయికి dengue వచ్చింది…అయితే అతనకి మంచి వైద్యం చేయించే ఆర్థిక స్తోమత లేదు..అతనికి ఏమిచేయాలో కూడా తెలియటం లేదు…అతను ఒకరి ఇద్దరిని కూడా అడిగాడు…ఎక్కడైనా తక్కువకి వైద్యం చేస్తారేమో అని …అప్పుడు నాకు ఆ సంఘటన చూసి చాల భాధ అనిపించింది…
అప్పుడు నాకు ఒకటే ఆలోచన వచ్చింది…అతను బాబా ని నమ్ముకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అనిపించింది..అప్పుడే బాబా కి విన్నవించుకున్నాను…ఈ పరపంచములో నీ లీలలు ప్రచారము చేసే అవకాశము కలిపించామని…ఆ ప్రయత్నములోనే…ఈ saileelas.com డిజైన్ చేసాము …

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles