బాబా మనల్ని అనుక్షణం కనిపెట్టుకొని ఉంటారు–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


This Audio has been prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-39-Baba-Anukshanam-by-Lakshmi-Prasanna 2:11

అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

సాయి బంధువులందరికీ గురు పొర్ణమి శుభాకాంక్షలు

హైదరాబాదులోని ఖైరతాబాద్ కి చెందిన లలీత గారికి 2017 జులై 2వ తేదిన అంటే గత ఆదివారం జరిగిన ఒక చిన్న అనుభవం సాయి బంధువులతో పంచుకొనేందుకు వాట్సప్ లో పంపించారు.

వారి మాటలలోనే  చదవండి. వారి కుటుంబ సభ్యులందరిపైన బాబా అనుగ్రహం సదా ఉండాలని బాబాని వేడుకుంటున్నాను.

నేను, మా వారు పెద్దాపురం లోని మా బంధువుల ఇంటికి వెళ్లటానికి ఇంటి నుండి బయలుదేరాం.

మేము ఇంటి నుండి బయటకు వచ్చి రైల్వే స్టేషన్ కు వెళ్లటానికి ఒక అటో అతన్ని సంప్రదించం.

ఆ ఆటో డ్రైవర్ 2 గంటల నుండి ప్రయత్నం  చేస్తున్నా ఆటో స్టార్ట్ కాలేదట. కాని మేము వెళ్ళగానే స్టార్ట్ అయ్యింది.

ఆటో డ్రైవర్ స్టేషన్ బయట  దించేయ కుండా ఎంట్రన్స్ గేటు లోపలి వరకు తీసుకోని వెళ్లి దించాడు.

నాకు ఈ మధ్య మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. బాబా అటో అతను లోపల తెచ్చి దించాడు. కాని,  ఇప్పుడు మేము ఎక్కవలిసిన  భోగి ఎక్కడ వస్తుందో నేను ఈ ప్లేట్ ఫారం అంత నడవాలా బాబా అనుకున్నాను.

అంతే ఆశ్చర్యం అద్భుతం! మేము ఎక్కవలసిన భోగి సరిగ్గా మా ఎదురు గా ఆగింది.

నా తండ్రి, గురువు, దైవం అయిన బాబా చేసిన ఈ అద్భుతానికి నా మనసంతా సంతోషం తో నిండి పోయింది. మా ప్రయాణం సోకర్యవంతంగా సాగింది.

బాబా మనల్ని అనుక్షణం కనిపెట్టుకొని ఉంటారు.

మనకు అవసరమైన ప్రతిక్షణం అయన తమ ఆపన్నహస్తం సదా అందిస్తూనే ఉంటారు. మనల్ని బాబా తమ చెంతకు చేర్చుకున్నందుకు మనం ఎంతో అదృష్టవంతులం.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles