బాబా , రామకృష్ణపరమహంస వేరు కాదనే  భావన రేగే కు కలిగింది–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

This Audio Prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-53-1026-బాబా-రామకృష్ణపరమహంస Lakshmi Prasanna 8:20

clip_image002_thumb[4]

బాబా తాను మహాసమాధి చెందిన తరువాత కూడా రేగే కుసహాయం చేస్తూ వచ్చారు.

1923 వ.సంవత్సరంలో ఆయన నాగపూర్ లో ఉన్న హజ్రత్ బాబాతాజుద్దీన్ ఔలియా గారిని దర్శించుకోవడానికి వెళ్ళారు.

అ కాలంలోతాజుద్దీన్ బాబాగారు అసాధారణమైన తత్వ వేత్తలలో ఒకరు.

ఆయనలో మూర్తీభవించినటువంటి మహోన్నతము, అత్యద్భుతమయిన ఆధ్యాత్మిక శక్తులు ఎంతో మందినిఆకర్షించాయి.

హిందువులు, ముస్లిములు ఇంకా ఇతరులు కూడా ఆయననిపూజించేవారు.

సమస్త మానవాళి బాధల నివారణకై ఆయన తమఆశీస్సులను అందచేసేవారు.

ఆయనఖ్యాతి సత్పురుషుడయిన ఒక సూఫీ సాదువుగా నలుదెసలా వ్యాప్తిచెందింది.

ఆ రోజులలో ఆయన రాజుగారి అంతఃపురం లో నివశిస్తుండడం వలన వారి దర్శనం లభించడం కష్టతరం అయ్యేది.

రేగే ఆయననుదర్శించుకోవడానికి వెళ్ళిన రోజున అక్కడ ఆయనను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో కిటకిటలాడుతూ ఉంది.

ఎంతోమంది తమ వంతు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.

అదే రోజుసాయంత్రం ఆయన రైలులో తిరుగు ప్రయాణమవ్వాలి.

దర్శనం అంతతొందరగా లభించేలా లేదు.

ఇక సాయంత్రం 3 గంటలవరకు చూసి వెళ్ళిపోదామనుకున్నారు.

అప్పుడే ఒక అద్భుతం జరిగింది. సమయం మూడు గంటలవుతుండగా లోపలినుండి ఒక వ్యక్తి రేగే దగ్గరకు వచ్చి హజ్రత్ తాజుద్దీన్ బాబా గారు పిలుస్తున్నారని చెప్పిరేగే గారిని లోపలికి తీసుకొని వెళ్ళాడు. 

ఆ విధంగా రేగే హజ్రత్తాజుద్దీన్ బాబా గారి దర్శనం చేసుకొని ఆయన ఆశీస్సులనుపొందారు.   ప్రయాణ సమయానికి ఆఖరి నిమిషంలో ఈ అద్భుతంజరగడం అంతా బాబా ఆశీర్వాద బలం వల్లనేనని భావించారు.

మరోసారి శ్రీ శీలలనాద్ మహారాజ్ ఆ ప్రాంతానికి వచ్చారని తెలిసి రేగే వారిని కూడా దర్శించి, వారిని తన ఇంటికి ఆహ్వానించారు.

ఆయన వెంటనే రేగే ఇల్లు చేరి సాయి పటానికి నమష్కరించారు.

రేగే సమర్పించిన టీ కొంచెం త్రాగి కొంచెం ప్రసాదంగా అతనికి ఇచ్చారు.

వేరోకప్పుడు సాయి ఖేడా నివాసియైన శ్రీ కేశవానందజిని, పూణే నివాసియైన హజ్రత్ బాబాజాన్ అనే సిద్దురాలిని గూడా దర్శించారు రేగే.

ఆ ఇద్దరు మహాత్ములు అతనిని చూస్తూనే, “నీవు సాయిబాబా దర్భారుకు చెందినవాడవు” అని ఎంతో ఆదరించారు.

శ్రీ మాధవనాద్ మహారాజ్ ఇండోర్ లో ఎందరినో భక్తీ మార్గంలో నడిపిన మహనీయులు. వీరికి బాబా పట్ల ఎంతో భక్తిశ్రద్ధలు ఉండేవి. 

బాబాసాహెబ్ రేగే ఒకసారి వీరిని దర్శించి తిరిగి పూణే బయలుదేరుతుంటే ఆయనిలా అన్నారు.

“నీవు మొదట షిరిడి దర్శించి, తర్వాత ఇంటికి వెళ్ళు, ఈ జాబు బాబాకి ఇవ్వు”. ఆ జాబులో దేవి సాక్షాత్కారం మొదలైన ఎన్నో విషయాల గురించి ఆయన వ్రాసారు.

రేగే షిరిడి చేరేసరికి అర్ధరాత్రి అవటంవలన సమాధి మందిరం మూసివేసారు.

ఏమి చేయాలో తోచక అతడా జాబు ఒక కిటికిలో పెట్టి అక్కడే నిలబడ్డారు.

చిత్రంగా అతడు చూస్తుండగానే అతని కళ్ళ ఎదుటి దృశ్యమంతా మారిపోయింది.

అతని ఎదుట బాబా సమాధి ఉన్నది. దానిపైనున్న దోమతెర తొలగించబడియున్నది.

కుడిప్రక్కగా తాను, ఎడమవైపు ఒక పెద్ద పులి ఉన్నాయి.

మరుక్షణమే ఎడమవైపు పులి బదులు దేవీమూర్తి ఉన్నది. అది చూడగానే మాధవనాధులు జాబులో వ్రాసిన విషయం గుర్తొచ్చింది.

దోమతెర లోపల సాయిబాబా చిలిం త్రాగుతూ కూర్చొని ఉన్నారు. ఆయన ఎదుట మాధవనాధులు కూర్చొని విచిత్రమైన పారవశ్యంతో అటూ యిటూ ఊగిపోతున్నారు.

ఈ దృశ్యమెంతో సేపు కొనసాగింది. అది స్వప్నమేమోనని రేగే శంకించారు గాని, చూచుకుంటే మేలుకువే!

ఆ జాబుతో మాధవనాధులు సూక్ష్మ రూపంలో సాయిని దర్శించారు.

సాయి వారి జాబుకు సమాధానంగా దేవి దర్శనం, తమ సాన్నిధ్యనందము గూడా వారికీ ప్రసాదించారు.

బాబా, రామకృష్ణ పరమహంస ఇద్దరియొక్క అంశ ఒకటేనని, రేగే భావించారు.

దానికి ఉదాహరణగా జరిగిన ఒక సంఘటన ద్వారా ఆయన తన భావన నిజమేనని నిర్ధారించుకొన్నారు.

1928 వ.సంవత్సరంలో అయన దక్షిణేశ్వర్వెళ్ళారు. అక్కడ చూడదగ్గ ప్రదేశాలు, దేవాలయాలు అన్నీ చూడాటానికి ఒక గైడుని ఏర్పాటు చేసుకొన్నారు.

అ గైడు రామకృష్ణపరమ హంస పూజించిన కాళీమాత విగ్రహాన్ని, ఇంకా ఇతర మూర్తులను చూపించాడు.

రామకృష్ణపరమహంస ఆడుకొన్న ‘రాంలాల్’(బాల రాముడు)విగ్రహాన్ని చూపించమన్నారు.

ఆ గైడు ఆయనని ఒక గుడిలోకి తీసుకొని వెళ్ళి ఒక పెద్ద విగ్రహాన్ని చూపించి అదే రాంలాల్ విగ్రహం అని చెప్పాడు.

పరమహంస గారి చరిత్రను క్షుణ్ణంగా చదివిన రేగే అది పరమహంసగారు ఆడుకున్న ‘రాంలాల్’ చిన్న విగ్రహం అవడానికి ఆస్కారం లేదని చెప్పారు.

ఆదే సమయంలో అనుకోకుండా ఒక పూజారి అక్కడకు వచ్చి దక్కన్ నుండి వచ్చినది మీరేనా అని రేగేను ప్రశ్నించారు. 

రేగే అవునని జవాబిచ్చారు. అపుడా పూజారి తాను అన్ని విగ్రహాలను దగ్గరుండి చాలా దగ్గరగా చూపించి విశేషాలను కూడా వివరించి చెబుతానని చెప్పాడు.

అంతకు ముందు చూసిన ప్రదేశాలను, గుడులను మళ్ళీ మరొకసారిచూడమని, తాను అన్నీ దగ్గరుండి చూపించినందుకు తనకుడబ్బేమీ ఇవ్వనక్కరలేదని రేగేతో చెప్పాడు.

తనకు క్రితం రోజు రాత్రి ఒక కల వచ్చిందనీ ఆ కలలో తనకు మరుసటి రోజు దక్కన్ నుండి ఒక భక్తుడు వస్తున్నట్లు, అతనికి అన్ని ప్రదేశాలను, గుడులను దగ్గరుండి చూపించమని ఆదేశాలు వచ్చాయని చెప్పాడు.

విగ్రహాలను కూడా చూపించి వాటిని పూజించుకొనేందుకు సహాయం కూడా చేయమని కలలో ఆదేశం వచ్చినట్లు చెప్పాడు.

అపుడాపూజారి రేగేను వెంటబెట్టుకొని ప్రతి గుడిలోకి తీసుకొని వెళ్ళాడు.

గర్భగుడిలోకి కూడా తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్న విగ్రహాలను కూడా స్వయంగా చేతితో తాకి తనకు ఇష్టమయిన రీతిలో పూజించుకునేలా సహాయం చేసాడు.

తనకు గైడు ఇదే  ‘రాంలాల్’ అని ఒక పెద్ద విగ్రహాన్ని చూపించాడని పూజారితో చెప్పారు రేగే.

ఆ పూజారి, గైడు మిమ్మల్ని మోసం చేశాడు అని అన్నారు.  ఆపుడా పూజారి పరమహంస ఆడుకున్న ‘రాంలాల్” చిన్న విగ్రహాన్ని తీసి రేగే ఒడిలో ఉంచారు.

ఆ విధంగా ఆయన ఊహకందని రీతిలో బాబా అనుగ్రహం వల్ల రేగే గారి కోరిక నెరవేరి, బాబా , రామకృష్ణపరమహంస వేరు కాదనే  భావన రేగే కు కలిగింది.

శ్రీ సాయి అంకిత భక్తుడయిన జస్టిస్ ఎమ్.బి.రేగే గారి గురించిన సమాచారం ఈ క్రింది లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/2016/04/blog-post_30.html  ద్వార సేకరించడం జరిగింది.

రేపు తరువాయి భాగం ….

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles