Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-52-1026-నేను నీకేమి ఇవ్వలేదా Lakshmi Prasanna 7:39
ఒకనాడు రేగే మశిద్ లో ఉండగా ఎవరో భక్తుడు ఎర్రని అరటిపండ్లు బాబాకు సమర్పించారు. అవంటే రేగే కెంతో ఇష్టం.
వాటిలో కొన్ని బాబా తనకు ఇస్తారని అతడాశించారు.
వెంటనే బాబా అతనికేసి చూచి ఒక పండు తీసుకోని ఒలిచి పండంతా ఇతర భక్తులకు పంచి, పైతోక్క మాత్రం రేగే కిచ్చి తినమన్నారు.
అతడేలాగో అది తినేసారు. తరువాత బాబా 2, 3 పండ్లు తీసుకోని అలాగే చేసారు. చివరకు నాల్గవ పండు చేతిలోకి తీసుకుని అతనికేసి చూసి, “నేను నీకేమి ఇవ్వలేదా?” అని ఆ పండు ఒలిచి కొంచెం తాము కొరుక్కుని అదెంతో బాగుందన్నారు.
తర్వాత భాగం అతని నోటికందించి, కోరుక్కోమన్న్నారు.
మళ్ళి తనోకముక్క కొరుక్కుని, అతనికొక ముక్క కోరికిస్తూ అలా పండంతా పూర్తిచేసారు.
ఈ లీల గురించి ఆలోచిస్తే, ఎంతో విలువైన ఆధ్యాత్మసుత్రాలు తెలుస్తాయి.
మొదట రేగే కు పండ్లను చూడగానే జిహ్వాచాపల్యం కలిగింది. అది ఒక బలహీనత అన్న తలంపు కూడా అతనికి రాలేదు.
నామరూపాల వల్ల కలిగిన లౌకిక సుఖబ్రాంతి విడిస్తేగని గురుకృప లభించదు.
బాగా అలోచించి నామరుపాత్మకమైన ఇంద్రియ విషయాలు నిజంగా సుఖమయములు కావని మొదట ముముక్షువు తెలుసుకోవాలి.
అప్పుడుగాని విషయాల పట్ల వైరాగ్యం కలుగదు. అందుకే సాయి అతనిని భ్రమింప జేసిన అరటితోక్కను మాత్రమే అతనికిచ్చారు.
మిగిలిన భక్తులందరికీ లబించినవి మేలయిన అరటిపండ్లు మాత్రమే, వాటిని ప్రసాదించినది సద్గురువే కావచ్చుగాక!
కానీ భక్తీ విశ్వాసాలతో, అచంచలమైన ప్రేమతో ఆయనేమి ప్రసాదించినా సంతోషంగా తీసుకున్న రేగే కు మాత్రం సాయి ప్రసాదం లభించింది.
ఆ సద్గురుని ఉచ్చిష్టం లభించింది. బాబా తాముగా తమ ఉచ్చిష్టం భక్తునికి ప్రసాదించిన సందర్భము మరొకటి లేదు.
రేగే 1914 సం. లో మిత్రుడు అవస్తేను ప్రోత్సహించి శిరిడి తీసుకెళ్ళారు.
దారిలో ఒక స్టేషన్ లో సైనికాధికారి రైల్లోని ప్రయాణికులను దింపి సైనికులను ఎక్కిస్తున్నారు.
కానీ చిత్రంగా అతడు వీరిద్దరిని తిరిగి రైలేక్కించారు. రేగే రాత్రంతా భజన చేసారు.
వారు శిరిడి చేరగానే రేగెను చూపుతూ సాయి “అతడికి ఎవరినైనా వెంట తీసుకొస్తే గాని తృప్తిలేదు. వాళ్ళు నా బిడ్డలను రైల్లోంచి దింపి వేయాలని చూచారు.
కానీ వీళ్ళిద్దర్నీ దింప వద్దని ఆ సైనికాధికారి తో చెప్పను” అన్నారు.
మరల రేగేను చూపుతూ “నాకు రాత్రంతా నిద్ర లేదు. నా పడకచుట్టు ‘బాబా’ ‘బాబా’ అన్న ఇతడి కేకలే!” అన్నారు.
సాయి తమను అంతగా ఆశ్రయించుకున్న రేగే హృదయాన్ని సర్వబంధాల నుండి రక్షించుకుంటూ వచ్చారు.
1914 సం. లో ఒకరోజు సాయి గర్భిణియైన శ్రీమతి రేగేతో “నా వరప్రసాదం నీ దగ్గరున్నది” అన్నారు. బిడ్డ జన్మించాక ఆయన ఒకరోజు “బిడ్డ నీవాడా, నావాడా?” అన్నారు.
“మీవాడే” అన్నారు రేగే. “వాణ్ణి నావాడుగా పెంచు” అన్నారు బాబా.
రెండోయేట ఆ బిడ్డ మరణావస్థలో వుండగా రేగే “బాబా! ఈ బిడ్డ కర్మశేషం నాకిచ్చి, వాడికి మీ పాదాల చెంత ఆత్మశాంతి ప్రసాదించండి” అన్నారు.
వెంటనే ఆ బిడ్డ చిరునవ్వుతో యోగిలాగా బ్రహ్మరంధ్రం గుండా ప్రాణం విడిచాడు!
ఆ తరువాత రేగే షిరిడి వెళ్ళినప్పుడు రేగే గురించి “ఆ బిడ్డ నావాడు; ఇతని ప్రార్ధననుసరించి ఆ బిడ్డను శాశ్వతంగా నా హృదయంలో ఉంచుకున్నాను” అన్నారు బాబా.
1915 వ.సంవత్సరంలో రామనవమి ఉత్సవాలకు షిరిడీ వెళ్ళే ముందు, బాబాకు సమర్పించడానికి కానుక ఏదయినా తీసుకొని వెడదామని ఇండోర్ లోని బట్టల బజారుకు వెళ్ళారు.
అక్కడ చాందేర్ లో తయారయిన ఢాకా మజ్లిన్ వస్త్రం అమితంగా ఆకర్షించింది.
దానికి చుట్టూ లేసు అల్లికతో చాలా అందంగా ఉంది. అది ఎంత మెత్తగా మృదువుగా ఉందంటే దానికి మడిచిన తరువాత చిన్న పాకెట్ లో ఇమిడిపోయింది.
బాబా కు కానుకగా దానిని కొని తన చొక్కా జేబులో పెట్టుకొన్నారు.
భక్తులు బాబాను దర్శించుకోవడానికి వెళ్ళినపుడు ఆయనకు వస్త్రాలు సమర్పిస్తూ ఉండేవారు. తరువాత వాటిని బాబా ఆశీస్సులతో తిరిగి తీసుకొంటు ఉండేవారు.
ఎప్పుడూ ఆ విధంగా జరుగుతూ ఉండేది. కాని రేగే గారి ఆలోచన మరొక విధంగా ఉంది.
బాబా మీద తనకున్న ప్రేమను ఆయన గుర్తిస్తే, తానిచ్చిన కానుకను ఆశీర్వదించి తిరిగి ఇవ్వకుండా ఆయన తన స్వంతానికి ఉంచేసుకోవాలని కోరుకొన్నారు.
భక్తులందరూ తాము తెచ్చిన వస్త్రాలను, శాలువాలను బాబాకు సమర్పించి, వాటిని ఆయన మీద కప్పేవారు. ఆఖరున ఎవరు సమర్పించిన వస్త్రాలను వారికి ఇచ్చివేస్తూ ఉండేవారు బాబా.
రేగే తాను సమర్పించిన వస్త్రాన్ని బాబా తనకు తిరిగి ఇవ్వకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో, బాబాకు నమస్కరిస్తూ అతి చాకచక్యంగా తను తెచ్చిన పాకెట్ ను ఎవరూ గమనించని విధంగా ఆయన ఆసనం (గద్దె) క్రిందకు తోసేశారు.
భక్తులందరూ సమర్పించిన వస్త్రాలన్నీ ఎవరివి వారికి మరలా తిరిగి ఇచ్చేశారు బాబా.
బాబాగారు కూర్చున్న ఆసనం క్రింద ఏమి ఉన్నది ఎవరూ గమనించలేదు.
బాబా తన ఆసనం నుండి పైకి లేచి “ఈ ఆసనం తీసి దులిపి శుభ్రం చేయండి” అన్నారు. ఆసనం ప్రక్కకు జరపగానే దానిక్రింద మజ్లిన్ క్లాత్ ఉన్న పాకెట్ బయట పడింది.
బాబా ఆపాకెట్ లోని మజ్లిన్ వస్త్రాన్ని బయటకు తీసి “ఏమిటిది? మజ్లినా?” అని దాని మడతలు విప్పి “దీనిని నేను తిరిగి ఇవ్వను. ఇది నాది” అని దానిని తన భుజాల మీదుగా కప్పుకొని “ఇది కప్పుకుంటే నేను చాలా అందంగా ఉన్నాను కదూ” అని రేగేతో అన్నారు.
తాను తెచ్చిన కానుకను స్వీకరించి తన స్వంతానికి బాబా ఉంచుకుంటానని చెప్పగానే రేగే ఆనందానికి అవధులు లేవు.
శ్రీ సాయి అంకిత భక్తుడయిన జస్టిస్ ఎమ్.బి.రేగే గారి గురించిన సమాచారం ఈ క్రింది లింక్http://telugublogofshirdisai.blogspot.co.ke/2016/04/blog-post_30.html ద్వార సేకరించడం జరిగింది.
రేపు తరువాయి భాగం ….
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- సిద్దావతారుడు…..సాయి@366 అక్టోబర్ 9….Audio
- ఎన్నేళ్ళనేది కాదు…అర్హతే కొలమానం ….. సాయి@366 ఫిబ్రవరి 25….Audio
- రాత్రి నిద్రించని సాయి…..సాయి@366 డిసెంబర్ 21….Audio
- బాబా చిరునవ్వు నవ్వి ‘సరే’ అన్నారు–Audio
- నా ఖజానా తాళంచెవి నీ చేతిలో పెట్టాను. నీకేమి కావాలో కోరుకో ఇస్తాను—Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments