నా ఖజానా తాళంచెవి నీ చేతిలో పెట్టాను. నీకేమి కావాలో కోరుకో ఇస్తాను—Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

This Audio Prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-43-1023-నా ఖజానా తాళంచెవి నీ చేతిలో పెట్టాను 8:42

అదే సంవత్సరం 1912 లో ఆయన వంద రూపాయలతో మరలా షిరిడీకి వచ్చారు.

బాబాను దర్శించుకున్నపుడు బాబా రూ.40/- దక్షిణ అడగగానే వెంటనే సమర్పించారు.

కొంత సేపయిన తరువాత మరలా రూ.40/- దక్షిణ అడిగారు.

రేగే వెంటనే దక్షిణ ఇచ్చారు.  తరువాత మిగిలిన రూ.20/- కూడా దక్షిణ అడిగారు.

రేగే ఎటువంటి సంకోచం లేకుండా ఇచ్చేశారు.

తన వద్దనున్న డబ్బంతా బాబాకు దక్షిణగా సమర్పించినందుకు చాలా సంతోషించారు.

ఇపుడాయన వద్ద ఒక్క పైసా కూడా లేదు.

ఆ తరువాత బాబా మరలా రేగేకు కబురు పంపించారు.

రేగే రాగానే బాబా మరలా ఆయనను దక్షిణ అడిగారు.

అటువంటి పరిస్థితిలో ఆయన తన వద్ద డబ్బు లేదని బాబాకు చెప్పారు.

అయితే ఎవరి దగ్గరకయినా వెళ్ళి అడిగిపట్టుకురా అని చెప్పి శ్యామా వద్దకు వెళ్ళమని సలహా ఇచ్చారు.

ఆయన శ్యామా దగ్గరకు వెళ్ళి మసీదులో జరిగిన విషయమంతా వివరించి బాబాకు దక్షిణ ఇవ్వడానికి డబ్బు అడిగారు.

అప్పుడు శ్యామా రేగే తో “నువ్వు బాబా మాటలను సరిగా అర్ధం చేసుకోలేదు. బాబాకు నీడబ్బేమీ అవసరం లేదు. 

ఆయనకు డబ్బు గడ్డిపోచతో సమానం. 

ఆయన ఉద్దేశ్యం ప్రకారం నీ తనువు, మనస్సు, బుధ్ధి, నీ సమయం అంతా ఆయన మీదే లగ్నం చేయమని, బాబా మాటలలోని అంతరార్ధాన్ని వివరించాడు.

రేగే బాబా దగ్గరకు తిరిగి వెళ్ళి శ్యామా చెప్పినదంతా చెప్పాడు.

బాబా చిరునవ్వు నవ్వి “దీక్షిత్ దగ్గరకు వెళ్ళి అడుగు” అన్నారు.  ఆయన దీక్షిత్ దగ్గరకు వెళ్ళి బాబాకు దక్షిణ కోసం డబ్బడిగారు.

దీక్షిత్ గారు రేగే చెప్పినదంతా విన్న తరువాత బాబా మిమ్మల్ని నాదగ్గరకు ఎందుకని పంపించారో పరిస్థితులను బట్టి అది మీకు ఒక ఉపదేశం చేస్తున్నట్లుగా గ్రహించుకోవాలి. 

డబ్బు లేకపోవడం గాని, యాచించడం గాని ఇవేమీ అవమానకరంగా భావింపరాదనీ, యాచించడం విషయానికి వస్తే మనలో  గొప్పవాళ్ళమనే భావన, మనం ఇంకొకరిని యాచించడమేమిటి అనే భావం మనసులోకి రానివ్వరాదని బోధించడానికే బాబా మిమ్మల్ని నావద్దకు పంపించారని”

దీక్షిత్ విడమర్చి చెప్పాడు.

రేగే తిరిగి బాబా వద్దకు వెళ్ళి దీక్షిత్ చెప్పినదంతా వివరంగా చెప్పారు.

బాబా చిరునవ్వు నవ్వి ఆయనని నానా సాహెబ్ దగ్గర అప్పు అడిగి తీసుకురమ్మని పంపించారు.

రేగే నానా సాహెబ్ కోసం ఖండోబా ఆలయానికి వెళ్ళారు.

అక్కడ  నానాసాహెబ్, ఉపాసనీ శాస్త్రి గారి మార్గదర్శకత్వంలో కొన్ని ఆధ్యాత్మిక గ్రంధాలను చదువుతూ ఉన్నారు.

ఆయనకు కూడా మసీదులో జరిగినదంతా చెప్పి ఆయనని అప్పు అడిగారు.  అంతా విన్న నానా సాహెబ్ లౌక్యంగా ఇలా అన్నారు

“ఇది చాలా సున్నితమయిన అంశం.  బాబా దక్షిణ అడగగానే ఇవ్వడానికి మన దగ్గర లేనప్పుడు మన పరిస్థితి ఎంత సంక్లిష్టంగా ఉంటుందో నేను ఊహించుకోగలను.

ఇకనుండి నువ్వు నేను చేసే విధంగానే చేస్తూ ఉండు అని ఒక సలహా ఇచ్చాడు.

నేను షిరిడీ వచ్చేటప్పుడు సగం డబ్బు కోవర్ గావ్ లో దాచి ఉంచుతాను.

లేకపోతే బాబా దక్షిణ అడిగినప్పుడు “లేదు” అని చెప్పడం చాలా బాధాకరంగా ఉంటుంది.

బాబా దక్షిణ అడిగినపుడు ఆయనకి సమర్పిస్తూ, అయిపోగానే కోపర్ గావ్ నుంచి తెప్పించి ఇస్తూ ఉంటాను.

నువ్వు కూడా అదే విధంగా చేయి” అని సలహా ఇచ్చారు.

రేగే మశీదుకు వెళ్ళి నానా చెప్పినదంతా చెప్పి ఆయన ఇచ్చిన సలహా కూడా చెప్పారు.

అ వెనువెంటనే బాబా నానాకు కబురు పంపించారు.

నానా రాగానే అతనిని రూ.40/- దక్షిణ అడిగారు.

అతను సంతోషంగా సమర్పించి వెళ్ళిపోయాడు.

మరలా అతనికి కబురు పంపించి మరొక రూ.40/- దక్షిణ అడిగారు.

అదికూడా సమర్పించాడు నానా.  మరలా నానాను మసీదుకు పిలిపించి అతని వద్ద మిగిలిన డబ్బును కూడా దక్షిణగా స్వీకరించేసారు.

నానా సాహెబ్ వెంటనే కోపర్ గావ్ లో తాను దాచుకున్న డబ్బును తెమ్మని ఒక మనిషిని పంపించాడు.

అతను షిరిడీకి రెండువందల రూపాయలతో వస్తూ,  వందరూపాయలను కోపర్ గావ్ లో దాచుకుని వందరూపాయలతో షిరిడీకి వచ్చాడు.

కానీ ఈలోగానే బాబా మళ్ళీ దక్షిణ అడిగారు. బాబాకు ముందర వంద రూపాయలు దక్షిణగా సమర్పించేసాడు.

ఇక తన వద్ద డబ్బు లేదని చెప్పవలసివచ్చినందుకు నానా చిన్నబుచ్చుకున్నాడు.

ఈ సంఘటన ద్వారా బాబా వారికందరికీ చెప్పదలచుకున్నదేమిటంటే తాము ఏమడిగినా బాబాకు ఇవ్వగలమని, ఆయన అవసరాలన్నీ తీర్చగలమనీ అనుకుంటే అదంతా ఒట్టి భ్రమేనని తెలియ చెప్పడానికే బాబా ఆవిధంగా చేశారు. 

బాబా దక్షిణ అడగడంలోని ఆంతర్యం వారికర్ధమయింది.

బాబా ధనాన్ని, కానుకలను లెక్క చేయరు. అవి ఆయనకు అవసరం లేదు.  వారు తన భక్తులనుండి కోరుకునేది ధృఢమయిన హృదయపూర్వకమయిన ప్రేమ మాత్రమే.

అటువంటి ప్రేమ రేగేలో ఉందని బాబాకు తెలుసు.  కాని అందరి భావాలు ఏవిధంగా ఉన్నాయో రేగేకు తెలియచెప్పాలనుకొన్నారు.

ఒకనాటి మధ్యాహ్నం రేగేను ,మశీదుకు పిలిపించి, బాబా ప్రేమగా

“నా ఖజానా తాళంచెవి నీ చేతిలో పెట్టాను. నీకేమి కావాలో కోరుకో ఇస్తాను” అన్నారు.

రేగే వివేకంతో ‘అన్ని జన్మలలోనూ మీరు నాకు తోడుండాలి’ అన్నారు. ఆయన, “తప్పక ఎప్పుడు నీచెంతనే, నీలోనే, నీతోనే ఉంటాను” అని సంతోషంతో అతని వీపు తట్టారు.

నాటినుండి అతనికేప్పుడు బాబా తన దగ్గరున్నట్లే ఉండేది.

చాలా సంవత్సరాల తరువాత ఆయన కుమారుడు మరణించాడు.

అప్పుడు ఆయన అనేక కుటుంబాలు నివాసముంటున్న ఒక భవంతిలో నివసిస్తూ ఉండేవారు.  కుమారుని మరణానికి ఆయన భార్య కృంగిపోయింది.

మనకేది మంచిదో అదే బాబా చేస్తారని, బాబాయే కుమారుడిని తీసుకొని వెళ్ళారని అందుచేత దుఃఖించవద్దని భార్యను ఒదార్చారు. 

రేగే తన బిడ్డ శరీరాన్ని ఒడిలో పెట్టుకొని కూర్చొని ఉండగా బాబా కనిపించి “నీకు నేను కావాలో, చనిపోయిన నీ బిడ్డ కావాలో తేల్చుకో.  రెండూ కావాలంటే పొందలేవు. 

నీ కుమారుడిని బ్రతికించమంటే బ్రతికిస్తాను.  కాని నేను నీతో ఉండను. 

ఈ బిడ్డను బ్రతికించుకోవాలని అనుకోకపోతే, నీకు తరువాత ఎంతో మంది పిల్లలు పుడతారు” అన్నారు.  రేగే ఎటువంటి సంకోచం లేకుండా “బాబా నాకు మీరే కావాలి” అన్నారు.

అయితే ఇంక శోకించకు అని చెప్పి అదృశ్యమయ్యారు.  ఆవిధంగా బాబా తన ఉనికిని తెలియచేస్తూ ఆయనని అన్ని సందర్భాలలోను ప్రోత్సహిస్తూ ఉండేవారు.

భక్తుల అవసరాలను బట్టి వివిధ భక్తులకు బాబా చేసే సహాయాలు కూడా అనేక విధాలుగా ఉండేవి. బాబా రేగేకు ఎన్నోవిధాలుగా సహాయం చేశారు.

అన్ని సందర్భాలలోను ఆయనకు విలువైన సలహాలను కూడా బాబా ఇచ్చారు.

శ్రీ సాయి అంకిత భక్తుడయిన జస్టిస్ ఎమ్.బి.రేగే గారి గురించిన సమాచారం ఈ క్రింది లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/2016/04/blog-post_30.html ద్వార సేకరించడం జరిగింది.

రేపు తరువాయి భాగం.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

One comment on “నా ఖజానా తాళంచెవి నీ చేతిలో పెట్టాను. నీకేమి కావాలో కోరుకో ఇస్తాను—Audio

Ashok

Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles