తరువాత రేగే 1910 సం. లో షిరిడి వెళ్ళినప్పుడు బాబా అతనిని ఆశీర్వదించి తమ ఫోటో ఒకటి ప్రసాదించారు.—Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

This Audio Prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-54-1027-రేగే 1910 సం లో షిరిడి వెళ్ళినప్పుడు 5:08

కలకత్తాకు 5 మైళ్ళ దూరంలోని దక్షిణేశ్వర్ లో రాణి రాస్మణి అనే పరమ భక్తురాలయిన జమిందారిణిచే నిర్మింపబడ్డ కాళికాలయంలో పీఠం మెట్లపై వెండితో తయారయిన చిన్న సింహాసనం మీద సాలగ్రామం, జటాధారి అనే సాధువునుంచి శ్రీరామకృష్ణులు పొందిన అష్టధాతువులతో తయారయిన ‘రాంలాలా” అని పేర్కొనబడే బాలరాముని విగ్రహం ఉంది.

అసలయిన సిధ్ధపురుషుని కోసం అన్వేషిస్తూ షిరిడీకి వచ్చిన బి.వి.నరసింహస్వామి గారికి సాయిబాబాను చూసిన తరువాత ఆయనే అసలయిన యదార్ధమయిన మహాపురుషుడు అనేనమ్మకం కలిగింది.

సిధ్ధపురుషుడు కాదు ఆయన షిరిడీలో సజీవంగా సంచరిస్తున్న భగవంతుడు అని నిర్ధారించుకొన్నారు. 

రేగే ఆయనను ఆహ్వానించి పి.ఆర్.అవస్తే గారికి పరిచయం చేశారు.

అవస్తె, నరసింహస్వామి గార్లతో కలిసి రేగే కూడా అపుడు జీవించి ఉన్న బాబాగారి అంకిత భక్తులందరినీ వ్యక్తిగతంగా కలుసుకొని వారి అనుభవాలన్నిటిని సేకరించారు.

అవిధంగా సేకరించిన భక్తుల అనుభవాలన్నిటిని పుస్తకాలుగా ప్రచురించారు నరసింహస్వామిగారు. ఆయన ‘సాయిసుద’ అనే పత్రికను ప్రారంభించారు.

మద్రాసులోఅఖిల భారత సాయి సమాజ్ (All India Sai Samaj)స్థాపింపబడటానికి కూడా ఆయనే ముఖ్యకారకులు.

బాబాగారు జీవించి ఉండగా స్వామిగారు షిరిడీ వెళ్ళనప్పటికీ, ఆయన బాబాతత్వ ప్రచారానికి ఎంతో కృషి చేసారు. 

బాబావారి సందేశాలను, మహిమలను, మొత్తం భారతదేశమంతటా ముఖ్యంగా దక్షిణాదిలో విస్తృతంగా వ్యాప్తిలోకి తీసుకొనివచ్చింది స్వామిగారే.

మన దేశంలోనేకాదు విదేశాలలో కూడా బాబా అంటే ఎవరో ఆయన వల్లనే తెలిసింది.

నిజం చెప్పాలంటే నరసింహస్వామిగారు మహోన్నతమయిన సాయి భక్తుడిగా మనం అభివర్ణించవచ్చు. 

ఆయన తన ఆఖరి శ్వాస వరకు బాబాకు ఎంతో సేవ చేసి 1956 వ.సంవత్సరంలో మరణించారు.

నరసింహస్వామి గారు వ్యక్తిగతంగా బాబాను ఎప్పుడూ కలుసుకోకపోయినా, కీర్తించదగ్గ సాయి భక్తుడిగా సాయి భక్తుల హృదయాలలో చిరస్థాయిగా ఆయన ఉండిపోవాలనే ఉద్దేశ్యంతో, స్వామి మరణించిన పది సంవత్సరాల తరువాత ఆయన చిత్రపటాన్ని సమాధిమందిరంలో రేగే గారు 1966 వ.సంవత్సరంలో ఆవిష్కరించారు. 

బాబా ప్రత్యక్షంగా ఆశీర్వదించి, తన కరుణను ప్రసాదించిన అదృష్టవంతుడు రేగే. 

ఎన్నో సందర్భాలలో ఆయనకు బాబాతో సన్నిహిత అనుబంధం కలిగింది. 

బాబాకు అంకిత భక్తుడయిన రేగే అక్టోబరు, 30, 1968 లో మరణించారు.

*శ్రీబ్.వి.నరసింహస్వామిగారి Devotees Experiences of Sri Sai Baba (ఇదే పుస్తకం తెలుగు అనువాదం శ్రీసాయిభక్త అనుభవ సంహిత – తెలుగులోకి అనువాదం చేసినవారు సాయినాధుని సురేంద్రబాబు) ఈ పుస్తకాల ద్వారా సాయి భక్తులందరి గురించి, బాబాతో వారి అనుభవాలను గురించి తెలుసుకోవచ్చు.

రేగే కు సాయి అనుగ్రహం ఇంతగా వర్షించడానికి ఈ జన్మ కు సంబందించినది కాదు.

అతడు రత్నగిరి జిల్లాలోని నహీబాబ్ గ్రామంలో జూలై 5, 1888 యోగిని ఏకాదశినాడు జన్మించారు.

నాటికీ అరవరోజున ఆ బిడ్డ ప్రక్కనే హరత్తుగా ఒక పకీర్ ప్రత్యక్షమై ఆ పిల్లవాణ్ణి ఎత్తుకుని అతని తలపై తమ చేతితో నిమిరి తిరిగి పడుకోబెట్టారు.

ఆయనేవరోనని ఆ ఇంటివారు విచారించేలోగానే ఆ పకీర్ అదృశ్యులయ్యారు.

ఆ కుటుంబం వారు దయ్యమో, భుతమోనని భయపడ్డారు.

తరువాత రేగే 1910 సం. లో షిరిడి వెళ్ళినప్పుడు బాబా అతనిని ఆశీర్వదించి తమ ఫోటో ఒకటి ప్రసాదించారు.

అతడు ఇంటికి వచ్చాక ఆ ఫోటో చూసిన అతని తల్లి ఆశ్చర్యపడి అతడు జన్మించిన అరువరోజున దర్శనమిచ్చిన పకీర్ సాయే నని గుర్తించి ఆ సంగతి అతనితో చెప్పారు.

శ్రీ సాయి అంకిత భక్తుడయిన జస్టిస్ ఎమ్.బి.రేగే గారి గురించిన సమాచారం ఈ క్రింది లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/2016/04/blog-post_30.html  ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles