Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద
సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-55-1027-బాబా- ఎంత దయామయుడవయ్యా 5:22
శ్రీ సాయిబాబా లీలలు చిత్రవిచిత్రములు – మహాత్ములను దర్సించనవసరంలేదన్నవారిని, బాబా మహ్మదీయుడని దర్శించుటకు విముఖలైనవారిని నాస్తికులను తమను నిందించిన వారిని కూడా బాబా తమ దగ్గరకు లాగుచునే ఉంటారు అట్టివారిలో శ్రీపేరూరు శర్మ, అనగా పేరూరు వాస్తవ్యులు ప్రొఫెసర్ కర్ర సుబ్బరాయశర్మగారు, వీరు వాస్తు, సాంఖ్యా సాముద్రిక శాస్త్రవేత్త.
కాకినాడ వాస్తవ్యుడు. వీరు ప్రతి నెల గుంటూరు, విజయవాడ వాస్తువిషయములలో వెళ్లివచ్చుచుండువాడు.
వీరు సాయి బాబా భక్తులు కారు. భార్య పిల్లలు సాయిభక్తులైనను శర్మగారికి తెలియదు.
వారింటి చుట్టూ సాయి భక్తులే వీరు బాబాను, బాబాభక్తులను విమర్శించుట, ఎగతాళి చేయుట జరుగుచుండెడిది.
కాకినాడ వాస్తవ్యుడైన హోమియో వైద్యుడు సంపర శ్రీరామచంద్రరావు గారు వీరి మిత్రులు. వీరు శ్రీ సాయిబాబాకు అంకిత భక్తులు.
1957 వ సంవత్సరములో ఒక ప్రమాదంలో రామచంద్రరావుగారి చేతి ఎముక విరిగినది.
ఆసుపత్రిలో చేర్చి ఎక్స్ రే తీయించగా వ్రేలి ఎముక తొలగినట్లు ధృవపడినది.
కట్టు కట్టిరి. కొన్ని రోజుల తరువాత కట్టువిప్పిచూస్తే ఎముక కలవలేదు . పైకి ఎక్కినట్లున్నది.
ఇచ్చట లాభములేదు మద్రాసు తీసుకొని వెళ్ళమని శర్మగారితో డాక్టరు చెప్పిరి .
రావుగారు ఈ విషయము గ్రహించి బాబాపై భారము వేసి ఎవరికీ చెప్పకయే శ్రీరామచంద్రరావుగారు రిక్షాలో ఇంటికి వెళ్లిపోయిరి.
తన పూజ మందిరములోనికి వెళ్లి శ్రీ సాయి బాబా పటమున తన చేయినుంచి తన బాదంతయు బాబాకు చెప్పుకొని భోరున ఏడ్చినాడు రావుగారు .
అలా బాబా పటముపై యుంచుచూ ఊదీని మాత్రమే ఔషధముగా తీసుకొనుచుండెను.
వారము రోజులు గడిచినవి. శంక తీర్చుకొనుటకు బయటకు వెళ్ళి తిరిగివచ్చి లోపల పడక కుర్చీలో కన్నులు మూసుకొని విశ్రాంతి తీసుకొనుచుండెను.
అతను బాబా ధ్యానమునందుండెను .ఉన్నట్టుండి ఎవరో రావుగారి ఆచేతిని విసరిలాగినట్టయినది. కుర్చీయందలి చెయ్యి విసురుగా ప్రక్కకుపోయినది.
అంతులేని బాధ కలిగి భరించలేక కేకలు వేయుచూ కన్నులు తెరచినాడు రావుగారు.
ఇంటిలోని వారందరు వచ్చిరి.ఎవరిని తనచెంతకు రానివ్వక తిట్టసాగిరి. అందరూ భయపడి రావుగారికి ఆప్తమిత్రుడైన శర్మగారికి కబురు చేసిరి.
ఆయన వచ్చి పరిస్థితి చూచి రావుగారితో “ఏమిటయ్య! నీచేయిని లాగినది శ్రీ సాయియే.
ఎముకపై ఎక్కిన ఎముకను సరిచేసినాడు. ఈ విషయము నన్ను తెలుపమని చెప్పుటచే పరుగున వచ్చినాను” అని అబద్ధమును అతని కోపమును ఉపశమింపచేయుటకు చెప్పినాడు.
రావుగారు శర్మమాటను నమ్మి “బాబా! ఎంత దయామయుడవయ్యా? నాచేతిని బాగుచేసితివని” అనుచు రిక్షాను పిలిపించామని ఎక్స్ రే తీయిస్తామని శర్మకు చెప్పెను.
శర్మ తాను అబద్ధము చెప్పుటచే ఎక్స్ రే తీయించుటకు భయపడెను.
రావుగారు పట్టుపట్టుటచే ఇద్దరు రిక్షాలో డాక్టరు దగ్గరకు వెళ్ళిరి. శర్మ డాక్టరుతో అసలు విషయము చెప్పి తనను కాపాడమని కోరెను.
భయముతో బాబాను తలచుకొనుచుండెను . డాక్టరు ఎక్స్ రే తీసి దానిని కడిగి చూచి తగ్గినది.
ఇక వేలుకు కట్టుకట్టనవసరంలేదనెను. శర్మకు ఆ మాటలు నమ్మశక్యం కాలేదు . ఏవరట్లు సరిచేసిరి? ఆ ప్రయత్నముగా బాబా అని శర్మగారు కేక పెట్టిరి .
బాబాయే ఆ వేలును సరిచేసిరి. ఇచట బాబా రెండులీలలు చూపిరి. మొదటిది సాయిభక్తుడైన రావుగారు మండువాడక బాబాయే బాగుచేయుననైన విశ్వాసము, ఓర్పుతో వేచి యుండగా భక్తుని విశ్వాసమునకు వేలును సరిచేసి బాబా కాపాడిరి.
రెండవది బాబాని బాబా భక్తులను దూషించు శర్మను సంస్కరించవలెను. అతనిచే అబద్ధము చెప్పించి, పశ్చాత్తాపము కలిగించి, తన మాట పోకుండా అతనిని కాపాడమనగా సాయినామజపము చేయించి చివరికి సాయినాశ్రయించు వానిగా బాబా చేసిరి. రావుగారి విశ్వాసము మనకు యున్నదా? పరిశీలించుకుందాము.
శ్రీ ఆలూరు గోపాలరావు గారి విరచిత శ్రీ సాయి బాబా సత్ చరితము
సంపాదకీయం: సద్గురులీల ( అక్టోబర్ – 2014)
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- ఆ వ్యాసము చదువుటతో శ్రీ సాయిబాబా యందు వీరు ఆకర్షితులైరి…Audio
- “విషకీటకము నాయనా జాగ్రత” అని శ్రీ సాయి ముందుగా వెంకటేశ్వర్లుగారిని హెచ్చరించుట–Audio
- బాబా వారి వైశిష్ట్యము
- గుండె ఆపరేషన్ చేసిన బాబా–Audio
- నాస్తికులైన సభాగారిని మృతువు నుండి బాబా కాపాడుట,తెలుగు రచయత–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments