అసలు మహాత్ములు అంటే ఎవరు?



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై !!
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై !!

ఒక సండే రోజు మాస్టర్ గారి వైఫ్ అలివేలు మంగమ్మ గారు నాగోలులో దర్శనాలు ఇస్తున్నారు వస్తావా అని మా ఫ్రెండ్ ఒకరు అడిగారు.నాకు అర్ధం కాలేదు మాస్టర్ గారి వైఫ్ దర్శనమ్ ఇవ్వడం ఏంటి అని అడిగితె వాళ్ళు మహాత్ములు కదా వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పాను అన్నారు.

నాకు  వెళ్లాలనిపించలేదు.బాబా ఉన్నాడు కదా ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్లడం ఎందుకు అని.సో నేను రాను సారీ అని చెప్పాను.

గురుచరిత్ర బుక్ మాస్టర్ గారు రాసిందే కాబట్టి.ఓకే తన పేరు భరద్వాజ గారు.తాను బాబాకి గొప్ప భక్తుడు.చాల బుక్స్ రాసారు బాబా పైన ఇతర మహాత్ములపైనా.తనకి బాబా బ్లెస్సింగ్స్ చాల ఉన్నాయ్.అని అనుకునే దాన్ని కానీ అంత కంటే ఎక్కువగా తెలియదు.

నేను మా ఫ్రెండ్ వాళ్ళ హాస్టల్ కి వెళ్లి మాటలలో తనకి చెప్పాను.మాస్టర్ గారి వైఫ్ నాగోలులో ఉంటారట ఈ రోజు దర్శనం ఉందట ఫ్రెండ్ రమ్మన్నారు కానీ నేను వెళ్ళలేదు అని చెప్పాను.

దానికి మా ఫ్రెండ్ ఎందుకు వెళ్ళలేదు.తాను ఒక మహాత్మురాలు.సజీవంగా ఉన్న మహాత్ములలో ఇప్పుడు ఉంది నాకు తెలిసి ఆమెనే.తాను కూడా ఎప్పుడు సమాధి అవుతారో తెలియదు.కాబట్టి వెళ్లి దర్శనం చేసుకుంటే బాగుంటుంది .నాకు వెళ్లాలని ఉంది కానీ నాకు తెలియదు నువ్వు కూడా వస్తానంటే కలిసి వెళదాం అని అడిగింది.

నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే ,తాను నీకు లేకపోవచ్చు కానీ నాకోసం రావా అని అడిగే సరికి ఓకే అని చెప్పా.ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా ఆడ్ అయ్యారు.

సరేలే మహాత్మురాలు అంటుంది.పెళ్లి ఐన ఆమె కదా,పెద్దామె కదా అని వెళ్ళేటప్పుడు పసుపు,కుంకుమ,బ్లౌజ్ పీస్ ,పసుపు కుంకుమ కలర్ గాజులు,పసుపు,కుంకుమ కలర్ లో పువ్వులు,పండ్లు తీసుకువెళ్లా తనకు ఇద్దాము అని.నేను తీసుకెళ్తున్నాను కానీ అమ్మగారు తీసుకుంటారో లేదో తెలియదు కానీ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్లడం బాగుండదు అని ఆలా తీసుకెళ్లా.

వెళ్ళేటప్పుడు అసలు మహాత్ములు అంటే ఎవరు?ఎలా ఉంటారు ?ఎవరిని మహాత్ములు అని అంటారు? బాబా,దత్తుడు మహాత్ములు అంటే ఓకే ,కానీ వీళ్ళెవరూ?మనలాగే చూడడానికి నార్మల్ గ ఉంటారా?లేదా ఏమైనా డిఫరెంట్ గా పెద్ద జుట్టుతో జుట్టంతా జాడలు కట్టి తప్పస్సు చేసుకునే వాళ్ళలాగా ఉంటారా? గాంధీ ని మహాత్ముడు అంటారు.ఓకే తనంటే దేశం కోసం జీవితమంతా త్యాగం చేసాడు అని అంటారు అనుకుందాం.వీళ్ళు కూడా తపస్సు చేసి ఆధ్యాత్మికంగా సమాజానికి మేలు చేస్తున్నారు కదా అందుకే వీళ్ళను మహాత్ములు అంటున్నారా?అసలు గాంధీ కి వీళ్లకు డిఫరెన్స్ ఏమిటి?అసలు మహాత్ములు అంటే మీనింగ్ ఏంటి?.ఇవన్నీ అడిగా మా ఫ్రెండ్ ని తనకి తెలియదు అంది .అందరు అంటున్నారు అని వీళ్ళు కూడా అంటున్నారు.

సరే ఎలాగో నాగోలుకి వెళ్ళాము అందరు కూచున్నారు అక్కడ బాబా,దత్తుడు,మాస్టర్ గారి ఫొటోస్ పెట్టారు.పక్కన అమ్మగారు చైర్ లో కూర్చొని ఉన్నారు.

తానే అమ్మగారు అని చూపించింది మా ఫ్రెండ్.ఓకే తాను కూడా చూడడానికి నార్మల్ గానే ఉన్నారు మనలాగే,కానీ తనకు ఆధ్యాత్మికంగా శక్తులు ఉండవచ్చు అనుకున్నాను.తనకు ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు కదా.అందరి మనసులలో ఏముందో తెలుస్తుంది కదా.నా మనసులో కూడా ఏముందో తెలుస్తుంది కదా.సో నేను అడగకుండానే న మనసులో అనుకున్నదానికి సమాధానం ఇవ్వాలి అనుకున్నాను.

నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నేను తెచ్చిన పూలు పండ్లు లాంటివి ఇచ్చి. తరువాత వీటిని అమ్మగారు తీసుకుని పెట్టుకుంటే బాగుండు అనుకున్నాను.కొంచం సేపు భజనలు,ఆరతి అయ్యాక అమ్మగారు వెళ్లిపోయారు.భోజనం చేసి రిటర్న్ వచ్చాం మేము.నాకు బానే అనిపించింది.మా ఫ్రెండ్ చాల హ్యాపీ గా ఫీల్ ఐంది.

వచ్చేటప్పుడు అంది.ఈరోజు చాలా మంది ఉన్నారు కదా మనం మాట్లాడలేకపోయాం.ఎవరు లేనప్పుడు వెళ్లితే ఎవరు ఉండరు కాబట్టిఅమ్మగారితో మాట్లాడొచ్చు అంది.సరే నీకోసం మధ్యాహ్నం పెర్మిషన్ తీసుకుని వస్తాను అని చెప్పాను.

నెక్స్ట్ ఒకరోజు మళ్ళీ వెళ్ళాము.వెళ్ళేటప్పుడు గోరింట ఆకు తీసుకుని వెళ్ళాం అమ్మగారు ఇంకా అక్కడ ఉండే వాళ్ళు అందరు పెట్టుకుంటారు కదా అని.

అమ్మగారి ఇంటి దగ్గరికి వెళ్లి అడిగితె,మార్నింగ్ నుండి అమ్మగారు గాడి బయటకు రావట్లేదు.ఈ రోజు ఎవరికి దర్శనాలు ఇవ్వట్లేదు అని చెప్పారు.మా ఫ్రెండ్ డిసప్పాయింట్ ఐంది.

నేను వెళదామా అంటే వద్దు వెయిట్ చేద్దాము కొంచం సేపటి తరువాత ఐన బయటకు వచ్చి దర్శనమ్ ఇస్తారేమో చూద్దాం అంది.నేను సరే నీ ఇష్టం అని వెయిట్ చేసాం.ఆలా 4 ఐంది కానీ అమ్మగారు బయటకు రాలేదు.నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు కానీ మా ఫ్రెండ్ కి అమ్మగారిని చూసే వెళ్ళాలి అని వెయిట్ చేస్తుంది.

ఆలా ఆలా 5 ఐంది కానీ దర్శనం కాలేదు నేను ఇక వెళదాం చీకటి అవుతుంది అంటే .ఇంత దూరం వచ్చి చూడకుండా వెళితే ఎలా అంది.నేను సరే 6 వరకు చూద్దాం లేదంటే ఇక వెళ్లడమే అని అంటే ఒక అంది కానీ 6 కి వెళదాం అంటే దానికి రావాలనిపించట్లేదు నాకు అర్ధమవుతుంది.

కానీ చీకటి అవుతుంది మనకి రూట్ సరిగ్గా తెలియదు అంటే బాబా చూసుకుంటారులే అంది.నేను ఈ రోజు బుధవారం బాబా ఫోటోకి అలంకరించాలి అంటే ఎప్పుడు అలకరిస్తావు కదా.ఈ ఒక్కరోజు అలకరించకుంటే ఏమి అవధులే ,మనం సజీవంగా ఉన్న మహాత్మురాలి దగ్గరే ఉన్నాం అని బాబా కి తెలుసు కదా అంది.

నాకు ఆలా అనడం నచ్చలేదు.తాను సజీవంగా ఉండొచ్చు మహాత్మురాలు కావచ్చు,బాబా ఫిసికల్ గా లేకున్నా బాబా మహాత్ముడే కదా మరి తన దగ్గరికి వెళితే అయిపోతుంది కదా అంటే,తాను నాకు కూడా బాబా అంటే చాల ఇష్టం.బాబా చెప్పారు కదా మహాత్ములందరు ఒక్కటే అని కాబట్టి అమ్మగారిలో కూడా బాబానే చూడొచ్చుకదా .బాబా ఇష్టపడతాడు కదా ఆలా అంది .

నేను,మహాత్ములందరు ఒక్కరే అని బాబా చెప్పారు నిజమే కానీ నాకు అందరిని బాబాలో నే చూడడం ఇష్టం.ఇప్పుడు అమ్మగారు కనపడి ఓ లక్షరూపాయల జాబ్ ఇచ్చినా,బాబా కనిపించకుండా ఏమి ఇవ్వకున్నా కూడా నేను బాబా కె ఇంపార్టెన్స్ఇస్స్తాను కానీ లక్షరూపాయల జాబ్ ఇచ్చింది కదా,లైవ్ గా ఉంది కదా అని ఇంకెవరికి ఇవ్వను అన్నాను.

నేను ఇంత దూరం అమ్మగారికోసం రాలేదు నీకు ఇష్టం కాబట్టి నువ్ నా ఫ్రెండ్ వి కాబట్టి నీకోసం వచ్చాను అది నీకు తెలుసు.ఇప్పటిదాకా వెయిట్ చేసాం కదా .చీకటి కూడా అవుతుంది.అమ్మగారు ఎందుకు దర్శనం ఇవ్వలేదో,ఇప్పుడు కూడా ఇస్తారో ఇవ్వరో తెలియదు.మనం ఇక్కడికి వచ్చి వెయిట్ చేసాము అని తనకి తెలుస్తుంది.తన సన్నిధిలో ఉన్నాం ఇంతవరకు అది చాలు వెళదాం అని అంటే ఇక తప్పక సరే అంది.

వచ్చేటప్పుడు అనుకున్న.సారీ అమ్మగారు మా ఫ్రెండ్ కి మీరంటే ఇష్టం వెయిట్ చేయాలనుకుంది కానీ నేనే చీకటి అవుతుందని తీసుకెళుతున్నాను.తప్పైతే క్షమించండి.అని మమళ్ళీ బాబాకి కూడా ఎవరి ఇష్టానికి వ్యతిరేకంగా మనం ప్రవర్తించడం ఇష్టం ఉండదు కదా అని సారీ బాబా కానీ తప్పట్లేదు.అని చెప్పుకున్నాను.

రాగానే టెంపుల్ కి వెళ్లి తొందరగా ఫోటో కి అలంకారం చేసి వచ్చి పడుకున్నాను.

కలలో అమ్మగారి దగ్గర వైట్ డ్రెస్ వేసుకుని ఒకతను ఉన్నాడు.నేను అంతకుముందు తీసుకెళ్లిన పూలు బ్లౌజ్ గాజులు లాంటివి ఒక పెద్ద పళ్లెం లాంటి దానిలో పెట్టి అక్కడ బెంచ్ పై ఉన్నాయ్.అమ్మగారు ఆ వైట్ డ్రెస్ వేసుకున్న అతనికి అవి తన దగ్గరికి తీసుకురమ్మని చెప్పారట .

సో తాను అవి తీసుకువెళ్తూ నాతో,అమ్మగారికి మీకు దర్శనం ఇవ్వాలని బాగా అనిపించిందట కానీ పెద్దవాళ్ళు ద్దర్శనం ఇవ్వడానికి పెర్మిషన్ ఇవ్వలేదు అని మీకు చెప్పమన్నారు అని చెప్పి వెళ్ళాడు.

నాకు హ్యాపీ అనిపించింది.నేను తీసుకెళ్ళినవి అన్ని అమ్మగారు స్వీయకరించారు,పెద్దవాళ్ళు అంటే బాబా,మాస్టర్ గారు అనుమతి ఇవ్వలేదేమో అనుకున్నాను.

తరువాత రోజు గురువారం కదా.టెంపుల్ కి వెళ్లేసరికి మా ఫ్రెండ్ ఉంది టెంపుల్ లో నేను తనకి చెప్పా ఈ విషయం.తాను నీకు చెప్పారా?అమ్మగారు అంటే నాకు ఇష్టం.నీకు అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఏదో నాకోసం వచ్చావు.ఐన కూడా నాకు కలలో,చెప్పకుండా నీకు చెప్పారు.నాకు బాధ అనిపిస్తుంది అంది.

నేను ఎవరికి చెపితే ఏంటి నీకు సమాధానం ఐతే వచ్చింది కదా.నిన్న మనం యెంత సేపు ఉన్న కూడా.బాబా ఒప్పుకోలేదు కనుక అమ్మగారు దర్శనం ఇవ్వకపోయే వారు.మనం వచ్చిందే బెటర్ ఐంది అంటే అవును కనీసం ఇక్కడ బాబాకి ఐన అలంకరించగలిగావు టైంకి వచ్చి,లేదంటే రెండు మిస్ అయ్యేవి అంది.ఇప్పుడు నాకు హ్యాపీ గానే ఉందిలే.నాకు అమ్మగారు నీ ద్వారా సమాధానం ఇప్పించారు అని హ్యాపీ గా ఫీల్ ఐంది.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “అసలు మహాత్ములు అంటే ఎవరు?

Sai Suresh

nice experience sai

prathibha sainathuni

thak u suresh garu..

kishore Babu

ఎవరైతే భగవంతుడు ఇచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించి కనీసం కొంత మంది జీవితాలలో వెలుగు నింపకలిగితే వారే మహాత్ములు, గొప్పవారు అని నా నమ్మకం. ప్రతిభ గారు మీరు కూడా మీకు బాబా ఇచ్చిన జ్ఞానాన్ని..మన బాబా భక్తులకి ఎప్పటికి పంచాలి అని నా కోరిక.

prathibha sainathuni

థాంక్యూ కిశోర్ గారు..మీ నిర్వచనం బాగుంది.
బాబా ఎలా చేయించుకుంటే ఆలా….

వరదా భాస్కరాచార్యులు

దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామీ సనోవతు …..

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles