Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై !!
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి జై !!
ఒకరోజు మారుతి తో వాళ్ళ హాస్టల్ కి వెళ్ళాను.అలానే వాళ్ళ హాస్టల్ ఓనర్ వాళ్ళ రూమ్ కి తీసుకెళ్లింది. హాస్టల్ ఓనర్ రజని అక్క ,మంచి బాబా భక్తురాలు.
టెంపుల్ లో చాల సార్లు చూసాను.కానీ అప్పటికి అంతగా పరిచయం లేదు.మారుతి రజని అక్క వాళ్ళ రూమ్ లో బాబా ఫొటోస్ చూపిస్తాను రా అని నన్ను తీసుకెళ్లింది.వెళ్ళాక అక్క వాళ్ళ రూమ్ లో బాబా పక్కన ఎవరిదో ఫోటో కనిపించింది.
ఇతను ఎవరు అని అడిగితె అక్క తాను మా గురువుగారు అని చెప్పింది.బాబా ఫోటో పక్కన,ఆలా ఇంకొకరి ఫోటో పెట్టి బాబాకి ఈక్వల్ గా తనకు ఆలా పూజ చేయడం నాకు నచ్చలేదు.తాను వైట్ డ్రెస్ లో ఉన్నాడు అంత వరకే చూసాను ఫేస్ కూడా సరిగా చూడాలనిపించలేదు నాకు.
అక్క అంత మంచి బాబా భక్తురాలు పైగా చదువుకుంది.అలాంటి అక్క ఇలా ఒక మానవుణ్ణి పట్టుకుని బాబా ఫోటో పక్కన పెట్టింది ఏంటి?వైట్ డ్రెస్ వేసుకున్న వాళ్ళంతా బాబాలు అయిపోతారా?చదువుకున్న వాళ్ళు కూడా ఇలా పిచ్చిగా నమ్ముతున్నారు కాబట్టే చాల మంది దొంగ బాబాలు పుట్టుకొస్తున్నారు.
ఆ దొంగ బాబా లు చేసే పనులు చూసి,శిరిడి బాబా కూడా వాళ్ళలాగానే కావచ్చు అనుకుంటారు .నాకంటే బాబా నిదర్శనాలు ఇచ్చారు,అందుకే నమ్ముతున్నాను.ఆలా అందరికి ఇవ్వాలని ఏమి లేదు కదా సో అందరు బాబా కూడా వీళ్ళలాగే దొంగ బాబా అనుకుంటారు.వీళ్లందరి వల్ల బాబా కి చెడ్డపేరు వస్తుంది అని బాధపడ్డాను మనసులో.
మళ్ళీ అయినా నాకెందుకు లే,ఎవరిష్టం వాళ్ళది అనుకుని అక్కకి బాయ్ చెప్పి వెళ్ళిపోయా.వెళ్లేముందు అక్క, ప్రతిభ ఈ రోజు సాయంత్రం సత్సంగం ఉంటుంది నీకు కుదిరితే రా అని చెప్పింది.నేను సత్సంగం అంటే ఏమిటి అంటే, మారుతి ఏమి లేదు అందరు కూర్చొని బాబా పూజ,నామం చెబుతారు అని చెప్పింది.
నేను ఎలా చేస్తారు అంటే నార్మల్ గా అందరు చేసినట్టే చేస్తారు కానీ నామం మాత్రం టెంపుల్ లో లా ఓం సాయి శ్రీ సాయి కాకుండా,సాయిబాబా సాయిబాబా అని చెబుతారు అంది.నాకు ఆ నామం కొత్తగా అనిపించింది.నాకు బాబా పక్కన ఇంకొక పర్సన్ ఫోటో పెట్టడం నచ్చలేదు.
అయినా ఈరోజుల్లో బాబా లాంటి వాళ్ళు ఉంటారా.తాను ఒక మానవుడు.తనకు కొన్ని శక్తులు ఉంటె ఉండొచ్చు ఆలా అని బాబా తో ఈక్వల్ కాలేడు కదా అని అంటే,ఏమో అక్క కి చాల ఇష్టం తనంటే తాను నమ్ముతది అని చెప్పి.సాయంత్రం అక్క రమ్మని చెప్పింది కదా ఒకసారి వచ్చి చూడు.అని చెప్పింది.నేను రాను. నాకు రావాలని లేదు అని చెప్పా.
నాకు అక్క అంటే ఒక బాబా భక్తురాలి గా ఇష్టం కానీ,ఆలా బాబా పక్కన ఎవరినో పెడితే నాకు ఇష్టం ఉండదు అని చెప్పా. తాను కొంచం చెప్పి చూసింది. లాస్ట్ కి సరే నీఇష్టం అని అంది.
అప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న రోజులు.హైదరాబాద్ లో సీమాంధ్ర మీటింగ్ జరిగింది. అందువల్ల తరువాతి రోజు తెలంగాణ బంద్ కి పిలుపునిచ్చారు.బస్సెస్ ఏవి తిరగట్లేదు.నేను ఆఫీస్ కి వెళదాం అని బస్సు లు లేక మా సర్ కి కాల్ చేసిబస్సు లు లేవు రాలేను అని చెపితే సరే అన్నారు.
నేను హాస్టల్ కి వచ్చాక మారుతి కి కాల్ చేశాను.ఆఫీస్ లేదు హాస్టల్ కి వస్తావా అని అడిగాను .అప్పుడు మారుతి మేము మాదాపూర్ కి వెళుతున్నాము అంటే ఎందుకు అంటే,అక్కడ ఒక అంకుల్ బాబా గురించి బాబా చెబుతారట. రజని అక్క వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళతో నేనుకూడా వెల్దాము అనుకుంటున్నాను నువ్వు వస్తావా అని అడిగింది.నేను సరే రూమ్ లో చేసేదేమి లేదు.బాబా తో ఐన టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది వస్తాను అన్నాను.
నేను ఎప్పటినుండో వెళ్దాం అనుకుంటున్నా వీలుకాలేదు నీకు ఇప్పుడు చెప్పగానే ఆలా రావడానికి కుదిరింది చూసావా.డాడీ (బాబా) కి ఎప్పుడు నువ్వంటే ఇష్టం.నీకోసమే ఆఫీస్ లేకుండా చేశారేమో అంది.ఇంకా నయం నాకోసమే తెలంగాణ బంద్ చేయించారని అనట్లేదు నువ్వు.ప్రతీది ఆలా చూడొద్దు అని చెప్పా.
నాకు సత్సంగం అంటే ఏంటో తెలియదు.ఏదైతే ఏంటి బాబా గురించే కదా అని వెళ్ళాం.వాళ్ళింట్లో బాబా ది పెద్ద ఫోటో నచ్చింది.చూడగానే హ్యాపీ అనిపించింది కానీ,వెంటనే పక్కన చిన్నది గురువుగారి ఫోటో చూడగానే అబ్బా అనిపించింది.
అంకుల్ బాబా గురించి చాల బాగా చెప్పారు అలానే వినాలనిపించింది.అలానే మళ్ళీ తరువాత వారం కూడా వెళ్ళాము.నాకు బాబా కావాలి బాబా గురించి చెప్పేవి కావాలి,అంకుల్ బాగా బాబా గురించి చెపుతున్నాడు కాబట్టి అవి వింటాను.ఇక ఆ శరత్ బాబు గారి గురించి చెప్పేవి కాకుండా బాబా గురించి చెప్పేవాటి మీద నేను ఫోకస్ చేస్తే అయిపోతుంది కదా అని వెళ్లేదానిని.
పొరపాటున కూడా గురువుగారి ఫోటో చూసేదానిని కాదు.ఒకసారి అనుకోకుండా ఆ ఫోటోని చూసా..వైట్ డ్రెస్,తలకి వైట్ టోపీ,బుజం మీద కండువా.కానీ నాకు అప్పుడు సరిగ్గా చూడకపోవడం వల్ల,బాబా లాగా తలకి గుడ్డ చుట్టుకున్నారు.బాబా లాగా కాలుమీద కాలు వేసుకుని కూచున్నారు.బాబా ని కాపీ చేద్దాం అనుకున్నట్టున్నారు.కానీ యెంత మంది కాపీ చేసిన బాబా,బాబా నే.ఎవరు బాబాని కాపీ చేయలేరు అనుకున్నా.
గురువు గారంటే ఎందుకో తెలియని కొంచం కోపం కూడా వచ్చింది.అది గురువు గారిమీద కోపం కంటే.బాబా మీద ఉన్న ఇష్టం వల్ల ఆలా వచ్చి ఉంటుంది.
ఒకరోజు మారుతి,సుమ ఇద్దరు వాల్ల హాస్టల్ లో బాబా నామం పెట్టుకున్నారు.నన్ను రమ్మంటే ఆఫీస్ అయ్యాక వెళ్ళా .ఇద్దరు నామం చెప్పుకుంటున్నారు.కొంచం సేపు కూర్చొని వచ్చా ఏదో హ్యాపీ గా అనిపించింది.నాకు ఆలా పెట్టుకోవాలి అనిపించింది.
మారుతికి చెపితే సరే వస్తాను అంది.నేను 2 డేస్ ఆఫీస్ కి లీవ్ పెట్టా,అప్పుడు రూమ్ నేను ఒక్కదాన్నే ఉన్నాను శనివారం సత్సంగ్ కి వెళ్లి వచ్చి రూమ్ మొత్తం క్లీన్ చేసాం.
నామం పెట్టుకుందామా, సత్సంగ్ పెట్టుకుందామా అని మారుతి అడిగితె ఏదైనా ఓకే ,కానీ నాకు సత్సంగం ఎలా చేయాలో తెలియదు అన్నాను.తాను ఎం కాదు బాబా చేయించుకుంటాడులే అని చీటీలు వేసింది.సత్సంగం అని వచ్చింది.
మా హాస్టల్ ఆంటీ కి నా గురించి తెలుసు కాబట్టి పర్మిషన్ ఇచ్చింది హాస్టల్ లో నా రూమ్ లో చేసుకోవడానికి సత్సంగ్ కి రెడీ చేసాం అన్ని,అందరిని ఇన్వైట్ చేసాం.నా దగ్గర అందరి మహాత్ముల ఫొటోస్ ఉన్నాయ్ అవన్నీ సత్సంగ్ లో పెట్టాము .అలాగే గురువుగారిది కూడా.
నేనేమో మాములుగా నేను మారుతి ఇద్దరం నామం చేసుకుందాం అనుకుంటే, బాబా నాతో ఆలా చాల మందితో సత్సంగం చేయించారు. అసలు అది ఎలా చేయాలో తెలియకుండానే ,అది కూడా మొత్తం సాయిపథం లో సత్సంగం ఎలా జరుగుతుందో అలాగే జరిగింది నాకు తెలియకుండానే .
నైట్ కలలో నేను పూజ చేసిన ఆ ఫొటోస్ అన్నిటికి ఆరతి ఇద్దామని అనుకుంటుండగా అక్కడే ఏడెనిమిది మంది పెద్దవాళ్ళు కూర్చున్నారు .వాళ్లందరికీ మూలకు కూచున్న ఒకాయన నేను చేసిన బాబా పూజకి ఆరతి ఇవ్వాలని ఉంది .వాళ్ళు తనని అడిగారు.
మొత్తం చీకటి ఉంది జస్ట్ బాబా ముందు దీపాల వెలుతురూ మాత్రమే ఉంది కనుక తానెవరో నాకు సరిగ్గా కనిపించలేదు ఆ మూలకు కూర్చున్న అయన పర్లేదు తానే అంత చేస్తుంది కదా ఆరతి కూడా తననే ఇవ్వమనండి . అని చెప్పారు.
కానీ మిగిలిన అందరికి అతనే ఆరతి ఇవ్వాలని ఉందని నాకు అర్థమైంది .సో నేను అతనితో పరవాలేదు మీరే ఇవ్వండి. బాబాకి ఎవరు ఇచ్చిన ఏమి కాదు రండి అని ఆరతి పళ్లెం తనకి ఇచ్చాను.
తాను నాదగ్గర నుండి ఆరతి పళ్లెం తీసుకున్నారు .అప్పుడు తాను తెల్ల పంచ ,తెల్ల బనీను ,పైన పంచ వేసుకుని ఉన్నారు .తాను బాబా కి ఆరతి ఇచ్చి అందరికి చూపిస్తే మేం అందరం ఆరతి కి నమస్కారం చేసుకున్నాం .
ఈ కలని ఉదయం మారుతికి చెపితే వైట్ పంచ , బనీను వేసుకున్నారు అంటే అది బాబూజీ గారే , నిన్న సత్సంగం దగ్గర పెట్టిన మహాత్ముల ఫోటోలలో తానే ఆలా వేసుకుంటారు .ఆ మూలకు కూచున్న వాళ్ళందరూ .నువ్వు పెట్టిన మహాత్ములు ఐ ఉంటారు వీరందరు బాబూజీ గారిని నువ్ చేసిన పూజకి ఆరతి ఇవ్వుమన్నారు అంటే తానే నీ గురువు అని బాబా ఆలా చెప్పరేమో అంది.నాకు బాగా కోపమొచ్చింది .నాకు గురువెంటి నాకు బాబా నే గురువు తప్ప ఇంకెవరు కాదు.ఇంకొక సారి అతను నాకు గురువు అని అనకు అని చెప్పాను.
Latest Miracles:
- సచ్చరిత్ర చదవడంతో గురువు అంటే ఎవరో, దైవం అంటే ఎవరో తెలిసింది
- నోరు తెరచి అడగకుండానే మనసులోని కోరికను తీర్చిన బాబా వారు
- సచ్చరిత్ర పై అవగాహన పెంచిన సత్సంగం.
- సత్సంగం చేసుకోవడానికి బాబా ధన సహాయం
- అసలు మహాత్ములు అంటే ఎవరు?
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “సత్సంగం అంటే ఏంటో తెలియదు..”
Sreenivas
February 1, 2017 at 6:06 amమంచి experience సాయి…..సాయి బాబా …సాయి బాబా…సాయి బాబా
kishore Babu
February 1, 2017 at 8:12 amGoD ======Good, there is no difference between God and Good..
సత్ అంటే మంచి అని, సాంగత్యం అంటే సమూహంగా కలిసి , సాయి బాబా వారికీ సంభందించి బోధనలను మరియు లీలలను గురించి ఒకరికి ఒకరు పంచుకోవడం. …సాయి బాబా…సాయి బాబా..
మన ఆలోచనలని ఈ వెబ్ సైట్ ద్వారా పంచుకొన్న….అది సాంగత్యమే…అని నా నమ్మకం…
prathibha sainathuni
February 2, 2017 at 6:05 amavunu..saibaba saibabaa saibaba saibaba….
Sreenivas
February 1, 2017 at 8:36 amసాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా
Maruthi Sainathuni
October 4, 2017 at 7:00 pm2-3 years back jariginavi kooda every point Chalaa Baaga Gurthupettukunnavu akka,great Sai Baba…Sai Baba