నానా చనిపోబోతున్నాడు, నేను రక్షిస్తున్నాను” అన్నారు–నానాసాహెబ్ చందోర్కర్-3–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.

This Audio Prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-138-నానాసాహెబ్ చందోర్కర్-3 7:50

ఒకసారి నానాసాహెబ్ మసీదులో బాబా సమక్షంలో కూర్చొని ఉన్నపుడు మేలిముసుగులు ధరించి కొంతమంది ముస్లిం వనితలు బాబా దర్శనం కోసం వచ్చారు.

నానాసాహెబ్ లేచి వెళ్ళబోతుండగా బాబా వెళ్ళవద్దని వారించారు. ముస్లిం స్త్రీలు బాబాను దర్శించుకొన్నారు. ఆసమయంలో వారిలో ఒకామె తన ముసుగును తొలగించి బాబాకు నమస్కరించింది.

ఆమె అందానికి ముగ్ధుడయిన నానాసాహెబ్ కి మనస్సు చలించింది.

బాబా వెంటనే అతని మనసులోని భావాలను గ్రహించారు. భగవంతుడు సృష్టించిన సృష్టిలోని అందాలను చూచి ఆనందించవలసినదే గాని మనసులో ఎటువంటి చెడు భావాలను రానీయరాదని బాబా బోధించారు.

ఒకసారి జిల్లా కలెక్టరు నానా చందోర్కర్ ను కోపర్గాం వచ్చి తనను కలుసుకోమని ఆదేశించాడు.

కనుక బాబా వద్ద సెలవు తీసుకోవడానికి అతడు మసీదు చేరాడు.

బాబా ,”రేపు వెళ్ళు” అన్నారు. అతడు బాబాపై విశ్వాసంతో శిరిడీలో ఉండిపోయాడు. మర్నాడు అతడు ప్రయాణమై బాబా ఆశీస్సుల కోసం వెళ్ళినప్పుడు బాబా ఆశీర్వదించి, “ఈ రోజు వెళ్ళు” అన్నారు.

తడు వెళ్లేసరికి ముందురోజు కలెక్టరు రాలేదని, ఆ రోజే వస్తున్నారనీ తెలిసింది. అందుకే ముందురోజు బాబా అతడిని శిరిడీలో నిలిపివేశారు. తన భక్తుడికి కలుగబోయే ఇబ్బందిని గుర్తించి ముందే తొలగించారు సాయి.

ఒకసారి నానా తన స్నేహితుడితో కలిసి పూణే నుండి టాంగాలో వెళ్తుండగా అకస్మాత్తుగా గుర్రం బెదిరింది.

బండి తిరగబడింది. వారిద్దరికీ నిజానికి బాగా దెబ్బలు తగులవలసింది.

అయినా ఆశ్చర్యకరంగా వారిద్దరికీ చిన్న దెబ్బ కూడా తగులలేదు. వారిద్దరూ ఎంతో ఆశ్చర్యపోయారు.

కానీ అదే సమయంలో శిరిడీలో బాబా తమ చేతులు శంఖంలా పెట్టి ఊదుతూ, “నానా చనిపోబోతున్నాడు, నేను రక్షిస్తున్నాను” అన్నారు. అలా నానా ప్రాణాన్ని కాపాడారు సాయి.

ఒకప్పుడు నానా చందోర్కర్ ఒక అడవిలోనున ప్రసిద్ధమైన గణపతి ఆలయానికి బయలుదేరారు.

రైలు ఆలస్యమై అతడు అడవి చేరేసరికి ప్రొద్దు గూకింది. అతడు ధైర్యం చేసి నడకసాగించి, ‘బాబా! 9 గంటలకు మందిరం మూసేస్తారు.

నేనక్కడకు చేరేసరికి 11 గంటలవుతుంది. నాకప్పుడు ఒక కప్పు టీ కావాలి’ అని ప్రార్ధించారు.

అతడు 10 మైళ్ళు నడచి ఆలయం వద్దకు రాగానే, ‘ఏడీ, నానా వచ్చాడా’ అని పూజారి అనడం వినిపించింది.

‘నేను వస్తున్నట్లు మీకెలా తెలుసు? అని ఆశ్చర్యంగా అడిగారు నానా. పూజారి అతనికి టీ అందిస్తూ, “నానా వస్తున్నాడు, అతడికి టీ సిద్ధం చేయండి” అని సాయి మాటలు విన్పించాయి అన్నారు.
ఒక వేసవి సెలవులలో నానా చందోర్కర్ తన స్నేహితులతో కలసి హరిశంద్ర గుట్ట వెళ్లారు.

మద్యలో అతడు ఎండకు దప్పిక అయి, ‘నీరు త్రాగాక నేనొక్క అడుగైనా వేయలేను. సాయి యే నన్ను కాపాడాలి’ అని ఒక బండమీద కులబడ్డారు.

మరుక్షణమే ఒక భిల్లుడు కట్టెలు మోసుకొస్తూ, నానాతో ‘మీరు కూర్చున్న బండ క్రింద మంచి నీరుంది, త్రాగండి” అన్నారు. చూడగా బండ క్రింద స్వచ్చమైన నీరున్నది. అతడు దప్పిక తీర్చుకున్నారు.

సరిగా అదే సమయంలో శిరిడిలో సాయి “నానా దప్పికతో చావనున్నాడు. కానీ నేను చావనివ్వను” అన్నారని తర్వాత తెలిసింది.
బన్ను మాయి ప్రముఖ సన్యాసిని. నానాసాహెబ్ కు ఆమెకు పూజ చేయాలనే సంకల్పం కలిగింది.

బాబా అనుగ్రహం లేకుండా ఆమె దర్శనం దొరకడం దుర్లభం. ఆ సన్యాసిని 20 సంవత్సరాల వయసుగల ముస్లిం మహిళ. ఆమెలో ఆధ్యాత్మిక శక్తి ఉఛ్ఛ స్థితిలో ఉది. ఆమె తల్లి భోడేగావ్ లో తన యింటిలోనే ఉంటోంది.

బన్నుమాయి యిల్లువదలి పూర్తిగా దిగంబరంగా అన్ని చోట్లా తిరుగుతూ ఉండేది. ఎక్కువగా అడవులలోను, ముళ్ళపొదలలోను రహస్యంగా ఉండేది.

ఆమె శరీరంనిండా ముళ్ళు గుచ్చుకొని ఉన్నా వాటినెన్నడు తొలగించుకోవాలనె ఆలోచన కూడా ఆమెకి ఉండేది కాదు. నిద్రాహారాల గురించి కూడా ఆలోచించేది కాదు.

ఆమె తల్లి యింకా యితరులు అందరూ ఆమె ఒక పిచ్చిపిల్ల అనుకునేవారు.

కాని నానాసాహెబ్ యింకా కొందమందికి మాత్రమే ఆమె ఆధ్యాత్మిక స్థితిలో ఎంతో ఉన్నతంగా ఉన్న సన్యాసిని అని నమ్మేవారు. ఆసన్యాసినిని దర్శించడానికి అనుమతి కోరడానికి నానాసాహెబ్ బాబా వద్దకు వెళ్ళాడు.

మొదట్లో బాబాకు యిష్టం లేనప్పటికీ తరువాత ఆమె దర్శనానికి నానాసాహెబ్ ను దీవించారు.

ఆయన సన్యాసిని ఉండే గ్రామానికి వెళ్ళి ఆమె ఎక్కడ ఉన్నదో తెలుసుకోవడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించారు కాని లాభం లేకపోయింది.

ఆమె ఆచూకీ లభించలేదు. పైగా, దిగంబర సన్యాసిని గురించి వాకబు చేస్తున్నందుకు ఆయనను గ్రామస్తులు అసహ్యించుకొన్నారు.

అపుడాయన కొంతసేపు బాబాని ధ్యానించారు. కళ్ళు తెరచి చూసేటప్పటికి ఆయనకెదురుగా బన్నుమాయి రోడ్డుమీద నుంచొని దర్శనమిచ్చింది.

ఆయన ఆమె కాళ్ళమీద పడగానె ఆమె ప్రక్కనున్న ముళ్ళపొదలలోకి అదృశ్యమయింది.

మరొక్కసారి ఆమె దర్శనం చేసుకొని ఆమెకు పూజ చేద్దామనుకొన్నాడు.

ఆకారణంగా ఆయన ఆమె కోసం ఒక గుడారం వేసి అందులో ఆమె స్నానం చేయడానికి వేడినీళ్ళు, కొత్తచీర, జాకెట్టు యింకా ఆమెకవసరమయినవన్నీ ఏర్పాటు చేశాడు. మరలా బాబాను ప్రార్ధించాడు.

వెంటనే ఆసన్యాసిని ప్రత్యక్షమయి తనంతతానుగా గుడారంలోకి ప్రవేశించి స్నానం చేసి క్రొత్త బట్టలు ధరించింది. నానాసాహెబ్ ఆమె పాదాలకు నమస్కరించి పూజించాడు.

అపుడామె వెంటనే లేచి ధరించిన బట్టలన్ని తీసి విసిరేసి అదృశ్యమయిపోయింది.

ఆయన తనున్న గ్రామంలోనే బసచేసిన గదిలో లోపల తలుపు గడియ వేసుకొని ఉండిపోయాడు.

మరుసటి రోజు ఉదయం గ్రామంనించి బయలుదేరేముందు మరలా ఆసన్యాసిని దర్శన భాగ్యం కలిగించి పూజించుకొనే అదృష్టాన్నిప్పించమని బాబాని ప్రార్ధించాడు.

ఆ వెంటనే గదిలో బన్నుమాయి కూర్చుని ఉండటం చూశాడు. గడియవేసి ఉన్న గదిలోకి ఆమె ఎలా ప్రవేశించిందో దానికెవరూ సమాధానం చెప్పలేరు.

ఆయన ఆసన్యాసిని పూజించిన వెంటనే ఆమె అదృశ్యమయిపోయింది.

ఇదంతా బాబా అనుగ్రహంతోనే సాధ్యమయింది. నానా సాహెబ్ మనస్సు సహజంగానే స్వచ్చమయినదని బాబాకు తెలుసు. నానా కూడా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్నాడని తెలుసు.

ఆందుకే ఆయనకు ఆసన్యాసిని దర్శనం చేయించి ఆమెకు పూజచేసే భాగ్యాన్నిచి దీవించారు.

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles