Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్ద సద్గురు సాయినాధ్ మహరాజ్ కీ జై!! శ్రీ సాయిసచ్చరిత్రము(click Here)
“నా సమాధి కదులును..మనస్పూర్తిగా నను శరణు జొచ్చినవారి తో నా సమాధి మాట్లాడును.”…అన్న బాబా పలుకులకి సాక్షాలు ఈ క్రింది బాబా లీలలు ..
ఒకసారి బాబా సాహెబ్ తర్కాడ్ 1932 వ సంవస్తరం లో షిరిడి లో శ్రీరామ నవమి ఉత్సవము చూడాలని షిరిడి కి వెళ్తాడు.దీక్షిత్ వాడా లో స్నానం చేసిన తరువాత ద్వారకామాయి కి వెళ్లి అత్యంత భక్తి శ్రద్ధ ల తో బాబా చిత్ర పటాన్ని దర్శించుకుని పూజ చేసాడు.తరువాత సాష్టాంగ నమస్కారం చేసి ధుని మాయి లో ని ధుని తీసుకుని వెళ్ళిపోడానికి బాబా అనుమతి తీసుకుని సమాధి మందిరం లో కి వెళ్తాడు .అక్కడ అతను సమాధి ని పూజించి దక్షిణ అర్పిస్తాడు..రామనవమి ఉత్సవం అయిపొయింది కనుక ముంబై వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు.
అతడు ఉదయము 11 గంటలకు బస్సు దగ్గరికి వస్తాడు. ఆ బస్సు లో ప్రతి రోజు ముంబై వెళ్ళే యాత్రికులకోసం 3 సీట్స్ ఖాళి గా వుంటాయి…. కాని, ఆ రోజు బస్సు మొత్తం చాలా రద్దీగా వుంది కూర్చోడానికి జాగా లేకుండెను.,కావున బాబా సాహెబ్ త్ర్క్హాడ్ తిరిగి వాడా కి వెళ్ళిపోయాడు.వాడా లో అతని మనసు చాల కలత పడింది ..అసలు అలా ఎందుకు జరిగింది, తన పూజ లో ఏమయినా లోటు జరిగిందా అని ఆలోచిస్తూఆ రాత్రంతా ఉండిపోతాడు.
మరుసటి ఉదయము ద్వారకామాయి కి వెళ్లి బాబా చిత్రపటము దర్శనం కి చేసుకుంటాడు. ఆశ్చర్యం ..చిత్రపటం లో బాబా ముఖము చాల ఉగ్రము గా కనిపిస్తుంది ..అతను నిశబ్దం గా తల దించుకుని ఏదో లోటు జరిగిందని అనుకుంటాడు..కాని ఆ లోటు ఏమిటో గుర్తుకు రాదు. ఆ తర్వాత సమాధి మందిరం కి వెళ్లి బాబా సమాధి పి తల వుంచాగానే సమాధి లో నుండి “అరె, నా సవ్వా రూపాయ ” అనగా “అరె. నా ఒక రూపాయి 25 పైసలు ” అని వినిపిస్తుంది..అపుడు తర్ఖడ్ కి , షిరిడి కి బయల్దేరేప్పుడు తనకి తన కోడలి కి జరిగిన సంభాషణ గుర్తుకు వస్తుంది. తనకోడలు బాబా కి దక్షిణ , సమాధి మందిరం లిని దక్షిణ పెట్టె లో వేయమని ఇస్తుంది..కానీ తర్ఖడ్ దక్షిణ పెట్టె లో కన్నా దక్షిణ కౌంటర్ లో వేస్తే తనకు రసీదు వస్తుంది అలాగే సాయి లీల మాగాజాయినే లో తన పేరు కూడా వస్తుందని అంటాడు. అపుడు ఆమె “నేను నా పేరు పబ్లిష్ కావాలని అనుకోవడం లేదు..నేను భక్తి శ్రద్ధ ల తో బాబా కి దక్షిణ అర్పిన్చుకొవాలనుకుంటున్న” అని సమాధానం ఇస్తుంది ..మేరు ఈ దక్షిణ , దక్షిణ పెట్టె లో వేయండి అనగా తర్ఖడ్ అలాగే చేస్తాడు..
ఈవిదం గా ” సమాధి చెందినా గాని , నా ఎముకలు మీ తో మాట్లాడును ” అని బాబా మరోసారి నిరూపించాడు.
ఇంకో సాయి లీల.
ఒక తమిళ భక్తుడు షిరిడి కి వెళ్తాడు..బాబా సమాధి దర్శనం కి వెళ్లి బాబా సమాధి పి తల ఉంచగా “సాపట్టిపో” అని తమిళ పధం వినిపించింది. తమిళం లో సాపట్టిపో అనగా “భోజనం చెసి /ప్రసాదం తిని వెళ్ళు ” అని అర్ధం. యిలా బాబా సమాధి చెందినా తరువాత కుడా, నిజ భక్తులకి సమాధి లో నుండే మాట్లాడుతూ ,తన వద్దకు వచ్చే అందరు భక్తుల ని గమనిస్తూ ఒక
తండ్రి లా వారి యోగ క్షేమాలను చూస్తున్నాడు.(పూజ్య గురువులు శ్రీ అమ్ముల సాంబశివ రావు గారి “సాయి ని ఎందుకు పూజించాలి” అనే పుస్తకము ఆధారంగా )
సంపాదకీయం: శ్రీ సాయి సత్ చరిత్రము
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No :09704379333
Latest Miracles:
- సమాధి చెందినా గాని , నా ఎముకలు మీ తో మాట్లాడును–Taarkad-34–Audio
- కలలో బాబా నిజ సమాధి దర్శనం
- జన్మతః మూగ అమ్మాయి కి బాబా సమాధి చూడగానే మాట్లాడిన వైనం
- సాయిబాబావారి సమాధి మందిరములో, గురూజీ బాబా ఒడిలో ధ్యానం చేసుకుంటూ కనిపించారు.
- సమాధి నుండి వెంటనే వచ్చి నా పక్కన నిలిచారు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments