Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయిబాబా వంటి మహాయోగి చరిత్ర వ్రాయుట అతి కష్టమంటారు సాయి సచ్చరిత్ర వ్రాయబూనిన హేమాడ్ పంత్.
ఏ భక్తుడైనా తన గురువు చెప్పేది, చేసేది మాత్రమే వ్రాయగలడు, తెలియని విషయములు ఎన్నో ఉంటాయి.
బొంబాయి నుండి విమలామా అనే భక్తురాలు హరనాథునకు ఒక ఉత్తరం వ్రాసింది
“ఓ శ్రీ హరనాథ ప్రభూ! మీకు వందనములు. మీరు మువ్వురు కాంతల రూపంలో మా ఇంట చేరి, నాకు ప్రసూతి సేవలను చేసి, పురిటి స్నానము కూడా చేయించి, అకస్మాతుగా అంతర్దానమయ్యారు. మీ ప్రేమ నేమని వర్ణింతును..”అని.
హరనాథ్ చెంత ఉన్నవారా ఉత్తరమును చదివి ఆశ్చర్యపోయారు.
నారాయణ గంగాధర్ పాటక్ కలకత్తాలో జిల్లా ఆరోగ్య శాఖాధికారి. ఒకసారి అయన కాశ్మీరు వెళ్ళి శ్రీనగర్ లో ఉన్నా హరనాథుని కలసి ముచ్చటించు చున్నారు.
హరనాథులు అకస్మాత్తుగా తల పైకెత్తి “ఏం ఫరవాలేదు. మీకే ఆటంకము రాదు నిశ్చింతగా సంకీర్తన చేసుకోండి” అన్నారు.
పాటక్ ఆశ్చర్యపోయి “బాబా ఇప్పుడు మీరెవరితో మాట్లాడితిరి?” అని అడిగాడు.
“కలకత్తాలో ఉన్న రాంరఖాల్ బాబు ఇంటికి పోయి వచ్చితిని. అతడు తన ఇంటిలో ఆ రోజంతా సంకీర్తన చేయదలచుకున్నాడు. ఇరుగు పొరుగు వారందరూ ఇతర మతస్థులు.
వారభ్యంతరము చెబుదురేమోనని సందేహిస్తూ నను ప్రార్ధించాడు. సంకీర్తన చేసుకొండు అని వారికి ధైర్యము చెప్పి వచ్చితిని” అన్నారు హరనాథులు.
పాటక్ ఆ విషయమై ఆరా తీసాడు. హరనాథ్ అక్కడ కనిపించుట, ఆ మాటలు సత్యమని ఋజువయ్యాయి.
కాశ్మిరులోని హరనాథులు, అదే సమయమున కలకత్తాలో ప్రత్యక్షమగుట విశేషమేమీ కాదని, విదేశాలలో కూడా హరనాథులు ఒకే సమయమున ప్రత్యక్షమైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
ఒక రోజున శ్రీ హరనాథ ప్రభువు బంకమట్టితో చేప ఆకారమును చేశాడు. దాని శరీరమునకు చేపపొలుసును అతికించి, చెరువులో అందరూ చూచుచుండగా వదిలారు.
ఆ చేప ప్రాణముపొంది, చెక చెక ఈదుచు నీటిలోనికి పోయింది.
కిషోర్ చంద్ర నాందీ రంగూన్ పోస్టాఫీసులో గుమస్తా. రేపు పైకం ఇస్తానంటే నమ్మి, పార్సెళ్ళను పైకం తీసుకోకుండా ఇచ్చేవాడు.
అది సరిగా వంద రూపాయలైంది. కొద్ధి రోజులలో లెక్కల తనిఖీ ఆడతారు వస్తున్నాడు. ఈలోగా డబ్బు లెక్కచూపాలి.
డబ్బు ఇవ్వవలసిన వారు ఇవ్వలేదు. ఐరావతీ నదిలో దూకి ఆత్మహత్య చేసుకుందామని వెళ్ళాడు. ఒక బాల సన్యాసి నాందీని కలుసుకొని ఈ రోజు టపాలో నీకు పైకం వస్తుంది. ఆపద తీర్చుకో” అని చెప్పి అదృశ్యమయ్యాడు.
ఆశ్చర్యకరంగా వంద రూపాలయాలు ఎవరో పంపారు. దానితో ఆపద తీర్చుకున్నాడు.
చాలా కాలం తరువాత తెలుసుకున్నాడు ఆ బాల సన్యాసి, హరనాథులే అని.
హరనాథుల జయంతి జూలై 1వ తేది అర్ధరాత్రి 12 గంటల తరువాత (అంటే 2వ తేదీన) జన్మించారు. నేడు హరనాథుల జయంతి సందర్భమున ఆయనను స్మరించెదము గాక!
కుసుమ హరనాథ్! శరణు శ్రీ కుసుమనాథ….
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- శ్రీ భగవాన్ బాల యోగీశ్వరాయ నమః …. మహనీయులు – 2020… జూలై 19
- రామ లీల … మహనీయులు – 2020… జూలై 26
- దర్బార్ సాయి మందిరం …. మహనీయులు – 2020… జూలై 6
- అద్వైత పరంపర – ఆద్యుడు…. మహనీయులు – 2020… జూలై 20
- త్రివిధ పద్ధతులు …. మహనీయులు – 2020… జూన్ 2
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments