అద్వైత పరంపర – ఆద్యుడు…. మహనీయులు – 2020… జూలై 20



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


ఒకసారి సాయిబాబాకు రెండు రూపాయలు మని అర్దరు ద్వారా వచ్చాయి.

సాయిని ఆటపట్టిద్దామని, రెండు రూపాయలను దాచాడు శ్యామా. శ్యామా ఇంట్లో దొంగలుపడి 250 రూపాయలను దోచుకున్నారు.

సాయితో ఆ విషయం చెప్పగా “నీవు చెప్పుకోవటానికి నేనున్నాను. నావి రెండు రూపాయలు పోయాయి” అన్నాడు సాయి.

అంటే దాచిన రెండు రూపాయలకు గాను, అంత పెద్ద శిక్ష వేశాడా? సాయి అనుకున్నాడు శ్యామా. తప్పు చిన్నదైనా, పెద్దదిగా కనబడవచ్చును గురుదేవుల చరిత్రలలో.

ఆదిశంకరుల గురువు భగవత్ గోవిందపాదులు. గోవిందపాదుల గురువులు గౌడపాదులు. అంటే గౌడపాదులు  ఆదిశంకరుల పరమ గురువు.

గౌడపాదులు పతంజలి మహర్షి వద్ద శిష్యునిగా ఉన్నాడు. పతంజలి శిష్యులకు బోధన చేస్తున్నప్పుడు ఎవరూ బయటకు వెళ్ళకూడదు. శిక్ష కఠినంగా ఉంటుంది అన్నారు పతంజలి.

ఐనా ఎందరో చిదంబరంలో ఉన్న పతంజలి వద్ద శిష్యులుగా చేరారు. వారిలో ఒకరు ఈ గౌడపాదులు. పతంజలిని ఆదిశేషుని అవతారంగా భావిస్తారు.

ఒకసారి గౌడపాదులు గురువు అనుమతి లేకుండా బయటకు వెళ్ళాడు. ఈ సంగతి తెలిసిన పతంజలికి ఆగ్రహం కలిగింది గౌడపాదులమీద.

గురువు ఆగ్రహంతో గౌడపాదులను బ్రహ్మరాక్షసుడివి కమ్మని శపించారు. గౌడపాదులు కరుణింపుమని వేడుకున్నాడు పతంజలిని. పతంజలి కొంచెం శాంతించారు.

పరిష్కార మార్గం చెప్పారు. యోగ్యుమైన శిష్యుని సంపాదించుకో గలిగితే, శాప విముక్తి కలుగుతుందని పతంజలి చెప్పారు. గౌడపాదులు గురుదేవుల పాదాలకు నమస్కరించి వెళ్ళిపోయాడు.

గౌడపాదులు బ్రహ్మరాక్షసిగా మారాడు. నర్మదా తీరంలోని ఒక అడవిలోని ఒక చెట్టుపై వసించేవారు. యోగ్యుడైన శిష్యుని కొరకు అన్వేషణ ప్రారంభించాడాయన.

ఆ త్రోవలో పండితు లెవరైనా పోతుంటే, వాళ్ళను ఆపి వ్యాకరణంలో ప్రశ్నలు వేసేవారు గౌడపాదులు.

తప్పు సమాధానాలు చెప్పేవారు దొరికేవారు గౌడపాదులకు. ఎంతో కాలానికి గాని యోగ్యుడైన శిష్యుడే దొరకలేదు గౌడపాదులకు.

చంద్రశర్మ ఆ మార్గంగుండా పోతుంటే “ఎక్కడకు పోతున్నావు?” అని ప్రశ్నించాడు గౌడపాదులు.

“చిదంబరంలో నున్న పతంజలి వద్దకు వ్యాకరణాన్ని నేర్చుకునేందుకు” అన్నాడు చంద్రశర్మ.

“ఇప్పుడు పతంజలి ఎవరిని శిష్యునిగా స్వీకరించుట లేదు. నేను పతంజలి శిష్యుడనే. నేను నేర్పగలను” అన్నాడు గౌడపాదులు.

చంద్రశర్మ సంపూర్ణంగా వ్యాకరణాన్ని నేర్చుకున్నాడు. గౌడపాదులు శాపం నుండి విముక్తి పొందారు.

చంద్రశర్మ ఎవరో కాదు గౌడపాదుల గురువైన పతంజలియే. తన శాపంతో బాధపడుతున్న తన శిష్యుని చూచి జాలిపడి, చంద్రశర్మగా వచ్చి శిష్యునికి శాప విమోచనం కలిగించాడు.

చంద్రశర్మే ఆదిశంకరుల గురువైన గోవిందా భగవత్పాదులు. అద్వైత గురు పరంపరలో ప్రథముడు గౌడపాదులు. తేది వివరాలు లభించలేదు.

శ్రీ జగద్గురు పరంపరగా స్తోత్రంలోని గౌడపాదులను ఇలా స్మరిద్దాం.

“ఎవరి ఉపదేశ  వాక్యాలవల్ల ప్రగాఢమైన మాయ సిగ్గుపడి తొలగిపోతుందో, ఎవరికి బ్రహ్మ విద్యతో ఆడుకునేటంత సామర్థ్యం ఉందొ, అలాంటి గౌడపాదులను నేనాశ్రయిస్తున్నాను”.

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles