శాంత మరియు ఒక బాలుడిని బాబా కాపాడారు–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


This Audio has been Prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-26-boy-by-Lakshmi-Prasanna 2:41

అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు

బాబా శాంతను ఎంతో ప్రేమించేవారు. ఆమె షిరిడీ నివాసి బాబు గిర్వందికర్ కుమార్తె. బాబా ఆమెను ప్రేమగా ‘చిన్న సోదరి’ అని పిలిచేవారు.

ఆమె కూడా బాబాని సోదర అని పిలిచేది. ఒకరోజు ఆమె ద్వారకామాయి దగ్గర ఉన్న బావిలో పడిపోయింది. చూసిన ప్రతి ఒక్కరూ ఆమెకు ఏమి జరిగి ఉంటుందోనని చాలా భయపడ్డారు.

కానీ వాళ్ళు బావిలోనికి చేసేసరికి ఆ అమ్మాయి ఆశ్చర్యకరంగా బావిలో తేలుతూ ఉంది.

అయితే ఆమె మెడ నుండి క్రింద బాగం అంత నీటిలో మునిగి ఉన్నాయి. వారు ఆమెను బయటకు లాగి, ఆమెను పరిశీలించినప్పుడు ఆమెకు ఎక్కడ ఎటువంటి గాయాలు లేవు.

ఆ బావి చాలా లోతైనది అయినప్పటికీ ఆమెకు గాయాలు తగలకపోవడంతో అందరు నిర్ఘాంతపోయారు.

అప్పుడు శాంత “నేను అనుకోకుండా బావిలోకి పడగానే, నా బాబా, నా సోదరుడు నన్ను క్రింద బాగం మాత్రమే మునిగి, తల మాత్రం పైకి ఉండేలా పట్టుకున్నారు. అందువల్ల నేను పైకి తేలుతూ ఉన్నాను” అని చెప్పింది.

మరో సందర్భంలో ఒక చిన్న పిల్లవాడు ఇంటికి వెళ్తున్నాడు. అప్పడు భారీగా వర్షం పడుతోంది.

అతను గొడుగును వేసుకొని వెళ్తూ ఉన్నాడు. తన ముందు ఏమి ఉన్నది కనపడకుండా ఆ గొడుగు అడ్డుగా ఉంది. తన ఇంటి ముందు ఇల్లు నిర్మించడానికి కోసం పునాది వేయడానికి భూమి తవ్వి ఉంది.

అనుకోకుండా అతను ఆ గొయ్యిలో పడిపోయాడు.

ఆగోయ్యి చాలా లోతుగా ఉన్నప్పటికీ, అతను మరోవైపుకి నడిచి అక్కడి నుండి పైకి ఎక్కి బయటకు చేరుకున్నాడు. ఎలా వచ్చావని ఆ బాలుడిని ప్రశ్నించినప్పుడు, బాలుడు

“బాబా తన కోసం మెట్లు పెట్టారని, అందువల్ల నేను వాటిని అధిరోహించి బయటకు వచ్చానని” చెప్పాడు.

source: Ambrosia in Shirdi – Part-I (Baba’s Leelas before 1918)

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “శాంత మరియు ఒక బాలుడిని బాబా కాపాడారు–Audio

Maruthi

saiBaba…SaiBaba

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles