Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio has been Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-27-Sri-Sai-1-fever-Neverget-by-Lakshmi-Prasanna 6:46
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి -1వ భాగం
ఆంధ్రరాష్ట్రం లోని మారుమూల ప్రదేశాలలోనే కాక భారతదేశమంతట కూడా “ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి” అనే నామం వ్యాప్తి చెందడానికి కారకులు సాయి భక్తులయిన శ్రీ దూబగుంట శంకరయ్యగారు.
బాబాతో ఆయనకు అసంఖ్యాకమయిన అనుభవాలున్నాయి. వీటిలో చాలా అనుభవాలను శంకరయ్యగారు తనే స్వయంగా రాశారు. ఆ అనుభవాలు ‘సాయిలీల’ పత్రికతో సహా ఎన్నో పత్రికలలో ప్రచురింపబడ్డాయి.
ఒక మాధ్యమం ద్వారా సాయిబాబా యొక్క ఉనికి తెలియడం ఒక అంతుపట్టని విషయం. కాని,
సాయియే స్వయంగా ఎదురయినప్పుడు, జరిగిన సంఘటన మీద సందేహం కలుగుతుంది. ఒక సంతోషకరమైన అనుభవం కలిగినపుడు భగవంతుడు సృష్టించిన మాయ తొలగిపోతేనే గాని ఎవరూ స్పృహలోకి రారు. సాయినాథులవారు భక్తుల కోర్కెలని, లక్ష్యాలని, సద్గుణాలని ముందుగానే గ్రహించగలరు.
ఎవరయితే ఆయన సహాయాన్ని కోరుతారో వారియందు ఆయన ప్రేమ అసాధారణంగాను, ఉత్తమంగాను ఉంటుంది.
శంకరయ్యగారు తన జీవితంలో జరిగిన మహత్తరమయిన సంఘటనని ఎంతో ఆనందంతో గుర్తుచేసుకున్నారు.
విజయవాడ రైల్వేస్టేషన్లో బాబా ఫొటో పెట్టడానికి ఒక వినతి పత్రం రైల్వే అధికారులకు ఇవ్వడం జరిగింది.
ఆ విషయం ఎంతవరకూ వచ్చిందో తెలుసుకొనేందుకు, విజయవాడకు చెందిన శ్రీ ఎం.ఎల్.ఎన్.ప్రసాద్ గారితో కలిసి ఆయన 1985 వ సంవత్సరం ఆగస్టులో సికిందరాబాద్ రైల్వేస్టేషన్ కు వెళ్ళారు.
అప్పట్లో విజయవాడ స్టెల్లా కాలేజీ దగ్గరలో ఉన్న సాయిమందిరంలో అఖండ సాయినామ సప్తాహం (49 రోజులపాటు నిరంతరాయంగా సాయినామ జపం) ఏర్పాటు చేయడానికి ప్రతిపాదన జరిగింది.
దానిలో శ్రీప్రసాద్ గారు చాలా చురుకుగా పాల్గొంటున్నారు.
దీని గురంచి చర్చ జరుగుతున్నపుడు కార్యక్రమ నిర్వాహకుల మీద కొంతమంది సాయిభక్తులు పుకార్లను వ్యాప్తి చేస్తున్నారని శ్రీ ప్రసాద్ గారు చర్చించారు. (కార్యక్రమ నిర్వాహకులలో శ్రీ శంకరయ్యగారు కూడా ఒకరు).
ఇటువంటి అస్పష్టమయిన భావన కల్గిన సంఘటనలకు కూడా నిజాయితీపరుడయిన వ్యక్తి హృదయం బాగా గాయపడుతుంది.
శ్రీశంకరయ్యగారి లక్ష్యం సాయినామాన్ని నలుదిశలా వ్యాపింపచేసి, అందరిలోనూ భక్తిని పెంపొందించడం. అటువంటి అపవాదుకు ఆయన కొంచెం వెనుకకు తగ్గారు.
ఈ నామజప కార్యక్రమానికి సుముఖంగా లేనివారితో తిరగవద్దని శ్రీ ప్రసాద్ గారు శంకరయ్యగారికి సలహా యిచ్చారు. ఈ విధమైన ధోరణి ఇటువంటి కార్యక్రమ ఉద్దేశ్యం మీద కూడా సందేహాలను రేకెత్తించింది.
ఇదంతా విన్న తరువాత శ్రీశంకరయ్య గారు చాలా అశాంతికి గురయ్యి రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకుందామనుకున్నారు.
వికలమైన మనసుతో ఆయన సికిందరాబాదులోని ఆల్ఫా హోటల్ ప్రాంతంలో తిరుగుతూ, తన ఆఫీసుకు వెళ్ళడానికై తన కంపెనీ బస్సు కోసం (బాలానగర్ – ఐడీపీఎల్) ఎదురుచూస్తూ ఉన్నారు.
ఆయన ఆలోచనలన్నీ ఇంకా శ్రీప్రసాద్ తో జరిగిన సంభాషణల మీదే తిరుగుతున్నాయి.
మనుషులు యిటువంటి అసత్యమైన పుకార్లని ఎట్లా పుట్టిస్తారోననీ,
అలాంటివి జరుగుతుంటే బాబా ఎలా అనుమతిస్తున్నారోననీ ఆలోచిస్తున్నారు. బాబాకు సర్వం తెలుసు. కాని తన భక్తునియొక్క పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరయితే చిత్తశుధ్ధితో ఆయన సహాయం కోరుతారో, వారికి బాబా సహాయం లభిస్తుంది.
శ్రీ శంకరయ్యగారి మనసు దేనిగురించీ ఆలోచించని స్థితిలో ఉంది, కాని ఆ వ్యాఖ్యలని ఆయన అవమానకరంగా భావించారు. ఎవరయినా మనకు చేసిన చిన్న అపకారం మనల్ని బాధించినపుడు,
ఎప్పుడో ఒకప్పుడు వారు పశ్చాత్తాపం చెందుతారు. అది ఒక్కొక్కసారి మన మంచికే జరిగి అంతమవుతుంది.
ఇక్కడ జరిగిన సహాయం ఎంతో విలువైనదీ, వర్ణించనలవికానిది. ఆయన మనసు అటువంటి స్థితిలో ఉండగా, అకస్మాత్తుగా గళ్ళలుంగీ, పైన భుజం మీద మురికిగా ఉన్న తువ్వాలు ధరించి, జోలి (సంచీ), చేతిలో గ్లాసుతో, పొడవుగా ఉన్న ఒక ఫకీరు ఆయనను సమీపించాడు.
ఆ ఫకీరును చూడగానే శంకరయ్య తన జేబులోనుంచి పావలా కాసు తీసి అతని గ్లాసులో వేశారు. ఆసక్తికరమయిన సంభాషణ వారిద్దరి మధ్య ఇలా జరిగింది.
(ఫకీరు హిందీలో మాట్లాడారు)
ఫకీర్ : ఓ! ఈ పావలా దేనికి?
శంకరయ్య : దయచేసి తీసుకో. నువ్వు ఎక్కడనించి వస్తున్నావు?
ఫ: నా మందిరం నుండి.
శం: నీ మందిరం ఎక్కడ వుంది?
ఫ: అన్ని చోట్లా ఉంది.
శం: బాబావారి కార్యక్రమం జరుగబోతోంది, కాని కొంతమంది దుర్మార్గపు పనులను సృష్టిస్తున్నారు.
ఫ : హాని కలిగించే పనులు ఏమీ జరగవు. అంతా సవ్యంగానే జరుగుతుంది.
శం : నువ్వు ఎప్పుడయినా షిరిడీ వెళ్ళావా?
ఫ: షిరిడీ వెళ్ళడానికి ఆలోచించాలా? మన్మాడ్ మీదుగా వెళ్ళు. కోపర్గాఁవ్ నుంచి 9 కి.మీ.
శం: నేను చాలాసార్లు వెళ్ళాను. అందుచేత నాకు బాగా తెలుసు. నేను నిన్ను అడుగుతున్నాను.
ఫ: (ఇక సంబాషణ కొనసాగించడానికి యిష్టం లేక) నా మందిరానికి వెళ్ళాలి. సమయం ఆసన్నమయింది.
శంకరయ్య తన జేబులోనుంచి ఒక కార్డు తీశారు. దానిమీద ఒకవైపు బాబా ఫొటో, మరొకవైపు కార్యక్రమాల వివరాలు (తెలుగులో) ఉన్నాయి. ఫకీరు అసలు దానివైపు చూడకుండానే, ‘నాకు తెలుగు తెలీదు’ అంటూ అక్కడినుండి నిష్క్రమించారు.
(రేపు తరువాయి భాగం )
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
Latest Miracles:
- ఓం సాయి శ్రీసాయి జయజయసాయి – 2వ భాగం–Audio
- శ్రీసాయి తత్వం – 1వ.భాగం
- మానవ జీవితానికి శ్రీసాయి సందేశాలు – 1వ.భాగం
- శ్రీసాయి సత్ చరిత్ర – తత్వం – అంతరార్ధం – 8వ.భాగం (ఆఖరి భాగం)
- నీటి దీపాలతో నిండిపోయిన ‘ద్వారకామయి’ – (1వ. భాగం)
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments